Wiaan Mulder – Carse: ఇండియన్ ప్రీమియర్ లీగ్ {ఐపీఎల్} 2025..18వ ఎడిషన్ మరికొద్ది రోజులలో ప్రారంభం కాబోతోంది. ఈ నేపథ్యంలో సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టుకి పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. ఈ 18వ సీజన్ ప్రారంభం కాకముందే గాయం కారణంగా టాప్ ప్లేయర్ మొత్తం ఐపిఎల్ కే దూరం కానున్నాడు. ఫిబ్రవరి 22 శనివారం రోజున లాహోర్ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన ఛాంపియన్స్ ట్రోఫీ గ్రూప్ – బి ప్రారంభ మ్యాచ్ లో ఇంగ్లాండ్ కి చెందిన ఫాస్ట్ బౌలర్ బ్రైడెన్ కార్సే గాయం బారిన పడ్డాడు.
Also Read: Navjot Singh Sidhu: కేఎల్ రాహుల్ ను స్పేర్ టైర్ కంటే దారుణంగా వాడుతున్నారు !
కాలి బొటనవేలి గాయం కారణంగా ఛాంపియన్స్ ట్రోఫీలోని మిగతా మ్యాచ్ లకి కూడా అతడు దూరమయ్యాడు. అయితే ప్రస్తుతం అతడు ఈ 18వ సీజన్ ఐపిఎల్ కి కూడా పూర్తిగా దూరం కానున్నాడు. ఐపీఎల్ ప్రారంభ సమయానికి కూడా అతడు కోలుకునే పరిస్థితి లేకపోవడంతో జట్టులోకి కొత్త ఆటగాన్ని ఆహ్వానించింది సన్ రైజర్స్. దీంతో అతని స్థానంలో సౌత్ ఆఫ్రికా కి చెందిన బౌలింగ్ ఆల్రౌండర్ వియాన్ ముల్దర్ ని తీసుకున్నట్టు తెలిపింది.
రూ. 75 లక్షలకు అతడిని తీసుకున్నట్లు వెల్లడించింది మేనేజ్మెంట్. ఇక వియాన్ ముల్దర్ పేస్ బౌలింగ్ ఆల్రౌండర్. అతడు రైట్ హ్యాండ్ బ్యాటర్ కూడా. 2024 ఐపిఎల్ లో అద్భుతంగా రాణించి ఫైనల్ కీ చేరుకున్న సన్రైజర్స్ హైదరాబాద్ జట్టు.. ఫైనల్ లో తడబడడంతో కప్ చేజారింది. దీంతో ఈసారి ఎలాగైనా కప్ కొట్టాలన్న కసితో ఉన్న సన్రైజర్స్.. మెగా వేళానికి ముందు క్లాసెన్, ప్యాట్ కమీన్స్, హెడ్, అభిషేక్ శర్మ, నితీష్ కుమార్ రెడ్డిలను వేలానికి ముందే రిటైన్ చేసుకుంది.
మరోవైపు మెగా వేలంలో కూడా చాకచక్యంగా వ్యవహరించి ఆడమ్ జంపా, ఇషాన్ కిషన్, రాహుల్ చౌహర్, మహమ్మద్ షమీ, హర్షల్ పటేల్ వంటి కీలక ప్లేయర్లను కొనుగోలు చేసింది. ఇక బ్రైడెన్ కార్సే స్థానంలో జట్టులోకి తీసుకున్న వియాన్ ముల్దర్.. 2017లో సౌత్ ఆఫ్రికా జట్టులోకి వచ్చాడు. అతడు ఇప్పటివరకు చెప్పుకోదగ్గ ప్రదర్శన అయితే చేయలేదు. ప్రస్తుతం జరుగుతున్న ఛాంపియన్స్ ట్రోఫీలో కూడా సెమీఫైనల్ లో తీవ్రంగా నిరాశపరిచాడు.
Also Read: SRH Match Tickets: రేపటి నుంచే హైదరాబాద్ మ్యాచ్ ల టికెట్లు.. జెర్సీ కూడా ఫ్రీ?
మరి ఈ 27 ఏళ్ల పేస్ ఆల్ రౌండర్ సన్రైజర్స్ హైదరాబాద్ జట్టులో ఎటువంటి పాత్ర పోషిస్తాడు అన్నది వేచి చూడాలి. SRH IPL 2025 స్క్వాడ్: సన్‌రైజర్స్ హైదరాబాద్ ఆటగాళ్ల పూర్తి జాబితా.. పాట్ కమిన్స్, హెన్రిచ్ క్లాసెన్, అభిషేక్ శర్మ, నితీష్ కుమార్ రెడ్డి, ట్రావిస్ హెడ్, ఇషాన్ కిషన్, మహ్మద్ షమీ, హర్షల్ పటేల్, రాహుల్ చాహర్, అథర్వ టైడ్, అభినవ్ మనోహర్, జడమ్, ఎషాన్ మలింగ, బ్రైడన్ కార్సే, కమిందు మెండిస్, సచిన్ బేబీ, అనికేత్ వర్మ