BigTV English

Niharika Konidela: ఇంట గెలవలేక రచ్చ గెలవడానికి రెడీ అయిన మెగా డాటర్

Niharika Konidela: ఇంట గెలవలేక రచ్చ గెలవడానికి రెడీ అయిన మెగా డాటర్

Niharika Konidela:  మెగా డాటర్ నిహారిక కొణిదెల  .. ఒక మనసు సినిమాతో తెలుగుతెరకు పరిచయమైంది.  మెగా ఫ్యామిలీ నుంచి ఇండస్ట్రీకి పరిచయమైన మొట్ట మొదటి హీరోయిన్ నిహారికనే. దీంతో ఆ సినిమా పై అంచనాలు ప్రేక్షకులు బాగానే పెట్టుకున్నారు. ఎన్నో అంచనాల మధ్య రిలీజ్ అయిన ఈ సినిమా ఆశించిన ఫలితాన్ని అందించడం విషయం పక్కన పెడితే.. నిహారిక నటనపై ట్రోల్స్ మొదలయ్యాయి.


ఇంకోపక్క  శౌర్యతో నిహారికకు ఎఫైర్స్ అంటగట్టారు.  ఇవన్నీ పట్టించుకోకుండా మరో రెండు సినిమాలు చేసింది మెగా డాటర్. పాపం.. అవి కూడా ఈ చిన్నదానికి పరాజయాలనే  అందించాయి. దీంతో తాను నటిగా పనికిరానని  ఫిక్స్ అయ్యి.. పెద్దలు కుదిర్చిన పెళ్లి చేసుకొని సెటిల్ అవుదామనుకుంది.  జొన్నలగడ్డ  చైతన్యను  వివాహం చేసుకొని కొత్త జీవితాన్ని మొదలుపెట్టింది. ఇక ఈ జీవితం కూడా మూడు నాళ్ల ముచ్చటగా మారింది.  కలకాలం కలిసి ఉంటారనుకున్న ఈ జంట విడాకులు తీసుకొని విడిపోయారు.

కారణాలు ఏమైనా నిహారిక.. విడాకుల తరువాత సొంతంగా  ఎదగడానికి నిర్ణయించుకుంది. ఇందులో భాగంగానే  నిర్మాతగా మారి మంచి కంటెంట్ ఉన్న సినిమాలను నిర్మించడం ,మొదలుపెట్టింది. ఇంకోపక్క నటిగా కూడా గుర్తింపు తెచ్చుకోవడానికి ప్రయత్నిస్తుంది. అయితే ఈసారి టాలీవుడ్ లో కాకుండా కోలీవుడ్ లో తన అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి రెడీ అయ్యింది. ఇప్పటికే మద్రాస్కారన్ అనే సినిమాతో అమ్మడు హీరోయిన్ గా ఎంట్రీ ఇవ్వనుంది.


మలయాళ కుర్ర హీరో షానే నిగమ్  కోలీవుడ్ ఎంట్రీ ఇస్తున్న ఈ సినిమాలో అతడి సరసన హీరోయిన్ గా నటిస్తోంది. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన సాంగ్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటుంది. ఇక ఇది కాకుండా  నిహారిక మరోమ్యూజిక్ వీడియోలో నటించింది. దర్శన్, నిహారిక జంటగా నటించిన  కడలోర కవితై అనే సాంగ్  కు స్వాతిని దర్శకత్వం వహించగా.. విశాల్ సురేష్ మ్యూజిక్ అందించాడు. సాంగ్ ఆద్యంతం ఆకట్టుకుంటుంది. ఇందులో నిహారిక ఒక నృత్య కళాకారిణిగా కనిపించింది. 

చనిపోదామని అనుకున్న అమ్మాయి  లైఫ్ లోకి ఒక అబ్బాయి వస్తాడు. అతనితో జీవితాన్ని పంచుకోవాలని ఆమె అనుకుంటుంది. కానీ చివరికి అతని శత్రువులు అతనిని చంపేస్తారు. ఇక అతడి  జ్ఞాపకాలతో ఆ అమ్మాయి గడుపుతూ ఉండడం సాంగ్ లైన్ గా కనిపిస్తుంది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారింది. మరి ఇంట గెలవలేక రచ్చ గెలవడానికి రెడీ అయిన మెగా డాటర్.. అక్కడైనా హిట్ ను అందుకుంటుందేమో చూడాలి. 

Related News

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Big Stories

×