BigTV English

Navyug Express Train: కాశ్మీర్ to కన్యాకుమారి- దేశంలో ఎక్కువ రాష్ట్రాలు దాటే రైలు ఇదే, ఎన్ని గంటలు జర్నీ చేస్తుందో తెలుసా?

Navyug Express Train: కాశ్మీర్ to కన్యాకుమారి- దేశంలో ఎక్కువ రాష్ట్రాలు దాటే రైలు ఇదే, ఎన్ని గంటలు జర్నీ చేస్తుందో తెలుసా?

Indian Railways: భారతీయ రైల్వే వ్యవస్థ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. ప్రపంచంలోనే అతి పెద్ద రైల్వే వ్యవస్థలు ఉన్న దేశాల్లో టాప్ లో ఉంటుంది. దేశంలోని  28 రాష్ట్రాలను లింక్ చేస్తూ వేలాది రైల్వే లైన్లు ఉన్నాయి. వాటి ద్వారా రోజు ఎ వేల రైల్లు ప్రయాణిస్తుంటాయి. దేశ వ్యాప్తంగా రైల్వే సర్వీసుల ద్వారా రోజుకు కోట్లాది మంది ప్రయాణీకులు తమ గమ్యస్థానాలకు చేరుకుంటున్నారు. దేశంలో అత్యధిక మంది ప్రజలు తమ ప్రయాణాలకు రైల్వే సేవలనే వినియోగించుకుంటున్నారు.


వందేభారత్ ఎంట్రీతో మారిన రైల్వే ముఖచిత్రం

భారత ప్రభుత్వం గత దశాబ్ద కాలంగా రైల్వే వ్యవస్థలో గణనీయమైన మార్పులు తీసుకొస్తున్నది. గతంలో పోల్చితే సరికొత్త టెక్నాలజీతో కూడిన రైళ్లను అందుబాటులోకి తీసుకొస్తుంది. ప్రమాదాలకు తావు లేకుండా ప్రయణీకుల భద్రతకు పెద్దపీట వేస్తూ ‘కవచ్’ లాంటి అత్యాధునిక సాంకేతికతను ఉపయోగించుకుంటున్నది. వందే భారత్ రైళ్ల ఎంట్రీతో ప్రయాణాకులు వేగవంతమైన, సౌకర్యవంతమైన ప్రయాణాన్ని పొందుతున్నారు. గతంతో పోల్చితే రైలు ప్రయాణానికి ప్రజలు ఎక్కువగా మొగ్గుచూపుతున్నారు. వందేభారత్ రైళ్లుకు ప్రయాణీకుల నుంచి వస్తున్న అద్భుత ఆదరణతో ఎప్పటికప్పుడు అప్ డేట్ వెర్షన్లను అందుబాటులోకి తీసుకొస్తున్నది కేంద్ర ప్రభుత్వం.


Read Also: రైల్లో ప్రయాణిస్తున్నారా ? టీసీ ఇలా చేస్తే తప్పకుండా ప్రశ్నించవచ్చు, మీకు ఉన్న హక్కులివే!

కాశ్మీర్ టు కన్యాకుమారిని కలిపే ఏకైక రైలు

భారత్ లో అనేక రైళ్లు ప్రయాణిస్తున్నా, ఒక రైలు గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ఈ రైలు భారత్ లోని సుమారు సగం రాష్ట్రాలను కలుపుతున్నది. సౌత్, నార్త్ ను ఏకం చేస్తూ 13 రాష్ట్రాలను దాటి వెళ్లే రైలు మరేదో కాదు, నవయుగ్ ఎక్స్‌ ప్రెస్. ఈ రైలు కర్నాటకలో తన ప్రయాణాన్ని మొదలు పెట్టి  అనేక రాష్ట్రాలను కలుపుతూ జమ్మూకు చేరుకుంటుంది.

Read Also: కౌంటర్‌లో కొన్న రైలు టికెట్‌ను ఆన్‌లైన్‌లో క్యాన్సిల్ చేసుకోవడం ఎలా? చాలా సింపుల్, ఇలా చెయ్యండి చాలు !

12 రాష్ట్రాల్లో స్టాఫులు.. 68 గంటల ప్రయాణం..

నవయుగ ఎక్స్ ప్రెస్ రైలు కర్నాటక రాష్ట్రంలోని మంగళూరు నుంచి తన ప్రయాణాన్ని మొదలు పెడుతుంది. కర్నాటక మీదుగా కేరళ, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఉత్తర ప్రదేశ్, రాజస్థాన్, ఢిల్లీ, హర్యానా, పంజాబ్, హిమాచల్ ప్రదేశ్ గుండా ప్రయాణించి జమ్మూ కాశ్మీర్ లోని తావి రైల్వే స్టేషన్ కు చేరుకుంటుంది. ఈ నవయుగ ఎక్స్ ప్రెస్ రైలు 13 రాష్ట్రాలను దాటి వెళ్తుండగా, 12 రాష్ట్రాల్లో ఆగుతుంది. కేవలం హిమాచల్ ప్రదేశ్ లో మాత్రమే ఈ రైలు ఆగకుండా వెళ్తుంది. ఇక ఈ రైలు మంగుళూరు నుంచి తావి వరకు ప్రయాణించేందుకు ఏకంగా 68 గంటల 20 నిమిషాల సమయం పడుతుంది. భారత్ లో అత్యంత ఎక్కువ దూరం ప్రయాణించే రైలుగా నవయుగ ఎక్స్ ప్రెస్ గుర్తింపు తెచ్చుకుంది. చాలా మంది ఈ రైల్లో ఒక్కసారైనా ప్రయాణించాలని కోరుకుంటారట.

Read Also: హాట్ బాత్, విమానం తరహా సౌకర్యాలు.. ‘వందే భారత్’ స్లీపర్ ట్రైన్ ప్రత్యేకతలు తెలిస్తే ఔరా అంటారు !

Related News

Real Estate: అపార్ట్‌మెంట్ ఫ్లాట్‌ కొంటున్నారా..అయితే అన్ డివైడెడ్ షేర్ (UDS) అంటే ఏంటి ?.. ఈ విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి ?

Real Estate: బ్యాంక్ లోన్ తీసుకొని ప్లాట్ కొంటే లాభమా….లేదా అపార్ట్ మెంట్ ఫ్లాట్ కొంటే లాభమా..? రెండింటిలో ఏది బెస్ట్ ఆప్షన్

Mobile Recharge: 365 రోజుల వ్యాలిడిటీ 1,999 రీచార్జ్ లో Airtel, Vi, BSNL ఎవరిది బెస్ట్ ఆఫర్

Bank Loans: లోన్ రికవరీ ఏజెంట్లు బెదిరిస్తున్నారా..అయితే మీ హక్కులను వెంటనే తెలుసుకోండి..? ఇలా కంప్లైంట్ చేయవచ్చు..

Golden City: ఇది ప్రపంచంలోనే గోల్డెన్ సిటీ.. 3వేల మీటర్ల లోతులో అంతా బంగారమే..?

Central Govt Scheme: కేవలం 4 శాతం వడ్డీకే రూ.5 లక్షల రుణం కావాలా? ఈ సెంట్రల్ గవర్నమెంట్ స్కీం మీ కోసమే

Big Stories

×