BigTV English

Niharika : విడాకులపై నిహారిక రియాక్షన్.. కారణం ఇదే..!

Niharika : విడాకులపై నిహారిక రియాక్షన్.. కారణం ఇదే..!

Niharika konidela divorce news(Tollywood Celebrity News): ప్రస్తుతం మెగా డాటర్ నిహారిక కొణిదెల విడాకుల వ్యవహారం హాట్ టాపిక్ గా మారింది . ఎందుకు డైవర్స్ తీసుకుందనే చర్చ నడుస్తోంది. ఈ వార్తలకు ఫుల్ స్టాప్ పెడుతూ స్వయంగా నిహారిక విడాకులకు కారణాలను వెల్లడించింది. ఇన్‌స్టా గ్రామ్ లో ఓ నోట్‌ ను పోస్ట్ చేసింది.


తాను, చైతన్య పరస్పర అగీకారంతోనే విడిపోయామని నిహారిక పేర్కొంది. తన వెన్నంటే ఉండి మద్దుతుగా‌ నిలిచిన కుటుంబసభ్యులకు, స్నేహితులకు ధన్యవాదాలు తెలిపింది. ఈ పరిణామాల తర్వాత తమ జీవితాల్లో ముందుకు వెళ్లేందుకు కొంత ప్రైవసీ ఇవ్వాలని విజ్ఞప్తి చేసింది. తనను అర్థం చేసుకున్నందుకు అందరికీ ధన్యవాదాలు అని పోస్ట్ లో పేర్కొంది.

గుంటూరు ఐజీ జె. ప్రభాకర్‌ రావు కుమారుడు చైతన్య జొన్నలగడ్డతో 2020 ఆగస్టులో నిహారికకు ఎంగేజ్ మెంట్ జరిగింది. 2020 డిసెంబర్‌లో వారి వివాహం జరిగింది. ఇద్దరి మధ్య మనస్పర్థలు తలెత్తాయని కొంతకాలం వార్తలు వచ్చాయి. ఇరు కుటుంబాల నుంచి గానీ వ్యక్తిగతంగానీ వారు స్పందించలేదు. తాజాగా చైతన్య జొన్నలగడ్డతో తన వైవాహిక బంధానికి నిహారిక ముగింపు పలికింది. హైదరాబాద్‌లోని కూకట్‌పల్లి ఫ్యామిలీ కోర్టులో విడాకులు దరఖాస్తు చేసుకున్నారు. నెలరోజుల క్రితం కోర్టు విడాకులను మంజూరు చేసింది.


చైతన్య, నిహారిక మధ్య మనస్పర్థలు తలెత్తాయని కొన్నాళ్లుగా సోషల్ మీడియా వార్తలు చక్కర్లు కొట్టాయి. విడిపోయేందుకు సిద్ధపడ్డారని ప్రచారం జరిగింది. ఆ సమయంలో వారిద్దరూ కలిసి దిగిన ఫొటోలను సోషల్‌ మీడియా ఖాతాల నుంచి పరస్పరం తొలగించారు. దీంతో ఆ వార్తలకు బలం చేకూరింది.

మెగా ఫ్యామిలీలో జరిగిన వేడుకలకు నిహారిక మాత్రమే హాజరుకావడం చర్చ జరిగింది. విడాకుల తీసుకున్నామని వారే ఇప్పుడు ప్రకటించారు.పెళ్లి తర్వాత నటనకు నిహారిక కొంతకాలం బ్రేక్‌ ఇచ్చింది. తాజాగా వెబ్‌ సిరీస్‌ డెడ్‌ పిక్సెల్స్‌ లో నటించింది. ప్రస్తుతం ఈ వెబ్ సిరీస్ డిస్నీ+ హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్‌ అవుతోంది.

Related News

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Big Stories

×