Nikhil Siddhartha: ఇండస్ట్రీలో స్టార్ హీరోలను పేర్లుతో కాకుండా ట్యాగ్స్ తోనే ఎక్కువ పిలుస్తారు. మెగాస్టార్, పవర్ స్టార్, గ్లోబల్ స్టార్, ఐకాన్ స్టార్, మ్యాన్ ఆఫ్ మాసెస్.. ఇలా స్టార్ హీరోల పేర్లకు ముందు ట్యాగ్స్ పెట్టి పిలుస్తుంటారు. ఇక కొంతమంది హీరోలకు కొన్ని ట్యాగ్స్ ఫ్యాన్స్ ఇస్తారు.. కొంతమంది హీరోలు తమకు తామేపెట్టుకుంటారు. కుర్ర హీరో సుధీర్ బాబు ఇప్పటికే నవ దళపతి అనే ట్యాగ్ పెట్టుకున్నాడు.
ఇక ఇప్పుడు సుధీర్ కోవలోనే మరో కుర్ర హీరో నిఖిల్ నడుస్తున్నాడు. తాజాగా నిఖిల్.. తనకు తానే కొత్త ట్యాగ్ ను ఇచ్చుకున్నాడు. ఎక్స్ వేదికగా తనను ఇక నుంచి యూనిక్ స్టార్ అనే ట్యాగ్ తో పిలవమని కోరాడు. యూనిక్ స్టార్ నిఖిల్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా మారాడు.
Dhananjaya: డాక్టర్ తో ‘పుష్ప’ జాలిరెడ్డి నిశ్చితార్థం.. వీడియో వైరల్
కార్తికేయ 2 తరువాత నిఖిల్ రేంజ్ మారిపోయింది. పాన్ ఇండియా లెవెల్లో ఆ సినిమా భారీ విజయాన్ని అందుకుంది. ఈ సినిమా తరువాత నిఖిల్.. 18 పేజీస్ అనే లవ్ స్టోరీతో వచ్చాడు. అది కూడా మంచి విజయాన్ని అందుకుంది.
కార్తికేయ 2 ఇచ్చిన కాన్ఫిడెంట్ తో నిఖిల్ పాన్ ఇండియా సినిమాలనే తీయాలని కంకణం కట్టుకున్నట్లు కనిపిస్తున్నాడు. అలా అనుకొనే స్పై అనే సినిమాతో గతేడాది ప్రేక్షకుల ముందుకువచ్చాడు. అది బాక్సాఫీస్ దగ్గర బోల్తా పడింది. ఇక దీని తరువాత పీరియాడికల్ మూవీపై కన్నేశాడు. ఆదిత్య బహుధానం దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో నభా నటేష్ నటిస్తోంది.
Raashii Khanna : అందంతో సోషల్ మీడియాను మత్తెక్కిస్తున్న ముద్దుగుమ్మ
ఇది కాకుండా ది ఇండియా హౌస్ అనే సినిమాలో నటిస్తున్నాడు నిఖిల్. ప్రస్తుతం ఈ రెండు సినిమాలు షూటింగ్ జరుపుకుంటున్నాయి. రెండు సినిమాలపైనా నిఖిల్ ఆశలు పెట్టుకున్నాడు. ఈ రెండు సినిమాలు రెండు డిఫరెంట్ కథలు. దీంతో ఫ్యాన్స్ కూడా ఈ సినిమాల కోసం ఎదురుచూస్తున్నారు. మరి ఈ సినిమాలకు నిఖిల్ పేరు యూనిక్ స్టార్ పెడతారా.. ? లేక సోషల్ మీడియా వరకే ఈ ట్యాగ్ పరిమితమా.. ? అనేది తెలియాలంటే కొన్నిరోజులు ఆగాల్సిందే.
Tag me with thissssss # U N I K⭐️ https://t.co/ptp5dyb89y
— Nikhil Siddhartha (@actor_Nikhil) November 18, 2024