Dhananjaya: కన్నడ నటుడు డాలీ ధనుంజయ గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎవరు ఈయన అని అంటారా.. ? పుష్ప సినిమా గుర్తుందా.. ? ఏం మాట్లాడుతున్నారు పుష్ప గుర్తులేకుండా ఎందుకు ఉంటుంది అంటారా .. ? అందులో అమ్మాయిల పిచ్చితో శ్రీవల్లీపై చేయ్యి వేసి.. పుష్ప చేతిలో చచ్చిపోతాడు కదా జాలిరెడ్డి. ఆ ఆయనే ధనుంజయ. ఈ సినిమాతో పుష్ప జాలిరెడ్డిగా పేరు తెచ్చుకున్నాడు.
కన్నడలో స్టార్ హీరోగా కొనసాగుతున్న ధనుంజయ.. తెలుగులో కూడా మంచి మంచి సినిమాల్లో నటిస్తున్నాడు. ఇక ప్రస్తుతం ఆయన జీబ్రా అనే సినిమాలో నటిస్తున్నాడు. సత్యదేవ్ హీరోగా నటిస్తున్న ఈ సినిమా నవంబర్ 22 న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక తాజాగా ధనుంజయ ప్రేక్షకులకు ఒక గుడ్ న్యూస్ తెలిపాడు.
Raashii Khanna : అందంతో సోషల్ మీడియాను మత్తెక్కిస్తున్న ముద్దుగుమ్మ
నేడు ధనుంజయ నిశ్చితార్థం చాలా సింపుల్ గా జరిగింది. ఎప్పటినుంచో ధనుంజయ.. డాక్టర్ ధన్యతతో ప్రేమలో ఉన్నాడు. ఇరు వర్గాల కుటుంబాలను ఒప్పించి వీరు పెళ్లి చేసుకోబోతున్నారు. ఈ మధ్యనే ఈ జంట తమ ప్రేమను అధికారికంగా బయటపెట్టి ఫోటోషూట్ కూడా చేసుకున్నారు.
తాజాగా ఈ జంట చాలా సింపుల్ గా ఎంగేజ్ మెంట్ చేసుకున్నారు. ఈ వేడుకకు ఇరు కుటుంబ సభ్యులు తప్ప ఇంకెవరు హాజరుకాలేదు. ఇక ఇందుకు సంబంధించిన వీడియోను ధన్యత తన ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేసింది. ఇక ఈ వీడియో చూసిన అభిమానులు కొత్త జంటకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. వచ్చే ఏడాది ఫిబ్రవరి 16 అం వీరి పెళ్లి మైసూరులో జరగనుంది. మరి ధనుంజయ తన పెళ్ళికి టాలీవుడ్ స్టార్స్ ను పిలుస్తాడా.. ? లేదా.. ? అనేది చూడాలి.