BigTV English

Sreeleela : శ్రీలీల గుట్టు విప్పిన నితిన్.. షాక్ అయిన ఫ్యాన్స్..

Sreeleela : శ్రీలీల గుట్టు విప్పిన నితిన్.. షాక్ అయిన ఫ్యాన్స్..
Sree Leela

Sreeleela : ప్రస్తుతం రిలీజ్ అయిన సినిమా.. అవ్వబోయే సినిమా.. ఎటు చూసినా హీరోయిన్గా శ్రీ లీల కనిపిస్తోంది. వరుస ఆఫర్లతో దూసుకుపోతున్న ఈ భామకు సంబంధించి ఓ లేటెస్ట్ అప్డేట్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ నితిన్ తో కలిసి ఎక్స్ట్రా ఆర్డినరీ మ్యాన్ మూవీ తో డిసెంబర్ 8న ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెలిసిందే. ఇక ఏ మూవీ ఫ్రీ రిలీజ్ ఫంక్షన్ లో నితిన్.. శ్రీలీలకు సంబంధించిన ఓ సీక్రెట్ ని బయటపెట్టాడు. ఆ సీక్రెట్ విన్న శ్రీ లీల ఫ్యాన్స్ షాక్ అవుతున్నారు.


వక్కంతం వంశీ డైరెక్షన్ లో వస్తున్న ఈ మూవీ ట్రైలర్ చిత్రంపై అంచనాలను భారీగా పెంచింది .బ్యాక్ టు బ్యాక్ కామెడీతో..బాగా ఎంటర్టైన్ చేసే డైలాగ్స్ తో ట్రైలర్ సూపర్ హైప్ క్రియేట్ చేస్తోంది. ఇక ఈ మూవీకి సంబంధించిన ఫ్రీ రిలీజ్ ఈవెంట్ నిన్న హైదరాబాదులో ఘనంగా జరిగింది. ఈవెంట్లో హీరో నితిన్ , శ్రీ లీల, రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన నితిన్ శ్రీ లీల గురించి కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు రివీల్ చేశాడు.

శ్రీ లీల నటన గురించి ఆమె టాలెంట్ గురించి మెచ్చుకున్న నితిన్.. కేవలం నటనలోనే కాకుండా శ్రీ లీల మరిన్ని విషయాల్లో ఎంతో టాలెంట్ ఉన్న అమ్మాయి అని పొగిడాడు.’నేను హీరోగా చాలా సినిమాలు చేశాను.. అలాగే హీరోయిన్ అయినా శ్రీ లీల కు యాక్టింగ్ తో పాటు మంచి డాన్స్ వచ్చు అని అనుకున్నాను.. కానీ ఆమె గురించి తెలుసుకున్న తర్వాత షాక్ అయ్యాను..’ అన్నాడు నితిన్. శ్రీ లీల డాక్టర్ చదవడంతో పాటు స్విమ్మింగ్ లో స్టేట్ లెవెల్ పోటీలలో పాల్గొందట. 


అంతేకాదు హాకీ లో శ్రీ లీల స్టేట్ లెవెల్ ప్లేయర్. ఇక డాన్స్ విషయానికి వస్తే కేవలం మాస్ స్టెప్స్ మాత్రమే కాదు.. తను కూచిపూడి , భరతనాట్యం కూడా నేర్చుకుంది. అలాగే సంగీతంలో కూడా శ్రీ లీల ప్రావీణ్యం సంపాదించింది.. వీణ చక్కగా వాయిస్తుందట. ఒక్క అమ్మాయిలో ఇన్ని టాలెంట్స్ ఉండడం చూసి నేను ఆశ్చర్యపోయాను.. అని నితిన్ శ్రీ లీలను తెగ పొగిడేసాడు. ప్రస్తుతం నితిన్ చెప్పిన ఈ మాటలు సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ అవుతున్నాయి.

Related News

Film industry: కన్న తండ్రే కసాయి.. కొట్టి ఆ గాయాలపై కారం పూసేవాడు.. హీరోయిన్ ఆవేదన!

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Big Stories

×