BigTV English
Advertisement

Thammudu Trailer: మాట పోయి మనిషి బ్రతికిన చచ్చినట్టే… ఆకట్టుకుంటున్న తమ్ముడు ట్రైలర్!

Thammudu Trailer: మాట పోయి మనిషి బ్రతికిన చచ్చినట్టే… ఆకట్టుకుంటున్న తమ్ముడు ట్రైలర్!

Thammudu Trailer: హీరో నితిన్(Nithin) తాజాగా తమ్ముడు (Thammudu)అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధంగా ఉన్నారు. డైరెక్టర్ వేణు శ్రీరామ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో సప్తమీ గౌడ, వర్ష బొల్లమ్మ, లయ కీలక పాత్రలు చేస్తున్నారు. ఈ సినిమా జులై 4వ తేదీ ప్రేక్షకుల ముందుకు రాబోతున్న నేపథ్యంలో తాజాగా ఈ సినిమా నుంచి ట్రైలర్ విడుదల చేశారు. ఈ ట్రైలర్ చూస్తుంటే అక్కకు ఇచ్చిన మాట నిలబెట్టుకొని తమ్ముడిగా నితిన్ నటించారని తెలుస్తుంది. మాట పోయి మనిషి బతికిన, మనిషి పోయినట్టే లెక్క.. మాట బతికి మనిషి పోతే మనిషి బతికున్నట్టే లెక్క అంటూ పవర్ ఫుల్ డైలాగులతో ఈ ట్రైలర్ ఎంతో అద్భుతంగా ప్రేక్షకులను ఆకట్టుకుంటూ సినిమాపై అంచనాలను పెంచేస్తుంది. ఈ ట్రైలర్లో డైలాగ్స్, విజువల్స్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఆకట్టుకునే విధంగా ఉంది.


ఇచ్చిన మాట కోసం..

ఇక ఈ సినిమా అక్క తమ్ముడు మధ్య కొనసాగే అనుబంధం గురించి తెలియజేయబోతుందని తెలుస్తోంది. ఈ సినిమాలో ఫ్యామిలీ ఎమోషన్ అండ్ యాక్షన్ సన్నివేశాలతో తెరకెక్కిస్తున్నట్లు తెలుస్తోంది. ఇక ఈ సినిమాకు వేణు శ్రీరామ్ దర్శకత్వం వహించగా శ్రీ వేంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు నిర్మిస్తున్నారు. ఇక ఈ సినిమా ద్వారా లయ తిరిగి ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఇక ఈమె హీరోకి అక్క పాత్రలో నటించబోతున్నారని స్పష్టమవుతుంది. ఒకప్పుడు హీరోయిన్ గా  ఇండస్ట్రీలో ఎంతో మంచి సక్సెస్ అందుకున్న లయ పెళ్లి తర్వాత సినిమాలకు పూర్తిగా దూరమయ్యారు.


తమ్ముడు టైటిల్ వర్క్ ఔట్ అయ్యేనా….

ఇక ఇటీవల ఈమె సినిమాలపై ఆసక్తితో అమెరికా నుంచి తిరిగి ఇండియా చేరుకున్నారు ప్రస్తుతం వరుస సినిమాలకు కమిట్ అవుతూ కెరియర్ పరంగా బిజీగా అవుతున్నారు. ఈ క్రమంలోనే నితిన్ హీరోగా నటిస్తున్న ఈ ఈ సినిమాలో హీరో అక్క పాత్ర ద్వారా ప్రేక్షకులను సందడి చేయడానికి సిద్ధమయ్యారు. ఇక ఈ సినిమాలో వర్ష బొల్లమ్మ హీరోయిన్గా నటించగా సప్తమి గౌడ వంటి తదితరులు నటించబోతున్నారని తెలుస్తోంది. ఇప్పటివరకు విడుదలైన అప్డేట్స్ చూస్తుంటే మాత్రం ఏ సినిమాలో ఫ్యామిలీ ఎమోషన్ తో పాటు హై యాక్షన్ సన్నివేశాలు కూడా ఉన్నాయని స్పష్టం అవుతుంది.

ఇటీవల కాలంలో నితిన్ వరుస సినిమాల ద్వారా ప్రేక్షకుల ముందుకు వస్తున్నప్పటికీ సరైన సక్సెస్ మాత్రం అందుకోలేకపోతున్నారు. తాజాగా నితిన్ రాబిన్ హుడ్ అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. అయితే ఈ సినిమా కూడా ప్రేక్షకులను పూర్తిస్థాయిలో నిరాశపరిచింది. మరి పవన్ కళ్యాణ్(Pawan Kalyan) సూపర్ హిట్ సినిమా అయిన తమ్ముడు టైటిల్ తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. మరి ఈ సినిమా అయినా నితిన్ కు సక్సెస్ అందిస్తుందా లేదా అనేది తెలియాల్సి ఉంది.

 

Related News

Tejaswini Nandamuri: నందమూరి వారసురాలు వైరల్ యాడ్ డైరెక్టర్ ఎవరో తెలుసా? ఇంత బ్యాక్గ్రౌండ్ ఉందా?

Film industry: ఘనంగా సినిమాటిక్ ఎక్స్ పో 3వ ఎడిషన్!

CM Revanth on Movie Tickets: సినిమా టికెట్ డబ్బుల్లో సినీ కార్మికులకు వాటా… సీఎం సంచలన ప్రకటన

Bandla Ganesh: బండ్ల గణేష్ ఇల్లు చూడండి.. ఎంత అద్భుతంగా ఉందో!

Telugu Heroes : సినిమాలతో పాటు హోటల్స్… లగ్జరీ రెస్టారెంట్స్ ఉన్న హీరోలు వీళ్లే

Salman Khan: పాక్ ను కెలికిన సల్లు భాయ్.. తెలుగు సినిమాలు బాగా చూస్తారంటూ..

Siva Jyothi: బేబీబంప్ తో పెళ్లి పీటలు ఎక్కిన శివ జ్యోతి.. ఇలా కూడా చేస్తారా?

Kantara 2: వైకల్యాన్ని జయిస్తూ.. నోటితోనే కాంతార బిజీఎం!

Big Stories

×