BigTV English

Robinhood : జీరో బజ్… రాబిన్ హుడ్ పరిస్థితి మరీ ఇంత దారుణమా..?

Robinhood : జీరో బజ్… రాబిన్ హుడ్ పరిస్థితి మరీ ఇంత దారుణమా..?

Robinhood : ఈ వారం రిలీజ్ కాబోతున్న సినిమాల్లో కాస్తో కూస్తో బజ్ క్రియేట్ అయిన మూవీ రాబిన్ హుడ్ అని అనుకున్నారు అందరు. ఇలా అనుకోవడానికి కారణాలు చాలా ఉన్నాయి. హీరో నితిన్ – డైరెక్టర్ వెంకీ కుడుముల చేసిన ప్రమోషన్స్. కేతికా శర్మతో చేయించిన అది దా సర్‌ప్రైజ్ ఐటెం సాంగ్. అలాగే అన్నింటి కంటే ముఖ్యంగా ఆస్ట్రేలియా క్రికెటర్ డేవిడ్ వార్నర్ ఈ మూవీలో గెస్ట్ రోల్ చేయడం… అతన్ని ప్రీ రిలీజ్ ఈవెంట్ కు తీసుకురావడం… ఆ ఈవెంట్‌లో రాజేంద్ర ప్రసాద్ చేసిన వ్యాఖ్యలు ఇలా… వీటి అన్నింటి వల్ల… రాబిన్ హుడ్ పై బజ్ చాలా క్రియేట్ అయిందని అనుకున్నారు.


ఈ వారం రిలీజ్ అవుతున్న అన్ని సినిమాల్లో రాబిన్ హుడ్ మూవీనే హాట్ ఫేవరేట్ అని అనుకున్నారు. కానీ, అలాంటి పరిస్థితి ఎక్కడా కనిపించడం లేదు. ఈ సినిమావైపు ఎవరూ కన్నెత్తి చూడటం లేదు. ఇది బుక్ మై షో చూస్తే తెలిసిపోతుంది.

రాబిన్ హుడ్… ఇది నితిన్ కెరీర్‌లోనే బిగ్గెస్ట్ హిట్ అని చెబుతున్నాడు. అలాగే డైరెక్టర్… తనకు ఇది హ్యాట్రిక్ మూవీ అంటున్నాడు. ఇక డేవిడ్ వార్నర్ అయితే… తన ఫస్ట్ ఇండియన్ మూవీ ఇది.. బ్లాక్ బస్టర్ హిట్ అవుతుంది అని చెప్పుకున్నాడు. కానీ, అలాంటి పరిస్థితి గ్రౌండ్ లెవెల్ లో లేదు.


బుక్ మై షో లో ఈ మూవీ పరిస్థిని గమనిస్తే… అన్నీ గ్రీన్ గానే కనిపిస్తున్నాయి. ఎక్కడా కూడా హౌస్ ఫుల్ కనిపించడం లేదు. అంతే కాదు…. గత 24 గంటల్లో… ఈ రాబిన్ హుడ్ మూవీ టికెట్లు బుక్ మై షోలో కేవలం 6000 కూడా బుక్ కాలేదు.

గడిచిన 24 గంటల్లో… బుక్ మై షోలో కేవలం 5680 టికెట్లు మాత్రమే బుక్ అయ్యాయి. రేపు మూవీ రిలీజ్. ఈ టైంలో 6000 టికెట్లు కూడా బుక్ కాకపోవడం మరీ దారుణమైన పరిస్థితి అని చెప్పుకోవచ్చు.

Robinhood Tickets Booking Book my Show
Robinhood Tickets Booking Book my Show

బ్లాక్ బస్టర్ మూవీ అని రాబోతుందని హీరో నితిన్, డైరెక్టర్ వెంకీ కుడుముల, డేవిడ్ వార్నర్ తో పాటు నిర్మాతలు కూడా చెప్పుకుచ్చినా… ఈ మూవీపై ఆడియన్స్ చూపు పడటం లేదు. దీనికి కారణం లేకపోలేదు.. ఇప్పటి వరకు హీరో నితిన్ – డైరెక్టర్ వెంకీ కుడుముల కానీ… ప్రమోషన్స్ పైనే ఫోకస్ చేశారు. కానీ, సినిమాపై బజ్ పెరిగేలా.. సినిమాలో ఉన్న కంటెంట్ ను సరిగ్గా ప్రజెంట్ చేయలేదు. ప్రమోషన్స్ అనేవి ముఖ్యమే. కానీ, సినిమాపై పాజిటివ్ టాక్ రావాలంటే.. ఓపెనింగ్స్ బాగా రావాలంటే.. సినిమా లోని గుడ్ కంటెంట్ ని ఆడియన్స్ కొంత వరకు చూపించాలి. అది టీజర్, ట్రైలర్, సాంగ్… ఇలా ఏదైనా పర్లేదు. కానీ, రాబిన్ హుడ్ కు అలాంటి పరిస్థితి లేదు. దీని ఫలితంగానే.. ఆడియన్స్ ఈ మూవీపై కన్నెత్తి చూడటం లేదు. అందుకే… బుక్ మై షోలో ఈ సినిమాకు 24 గంటల్లో కేవలం 5680  టికెట్లు మాత్రమే బుక్ అయ్యాయి.

Related News

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Big Stories

×