Broom: చీపురే కదాని తీసిపారేయకండి అలా..? దాని వల్ల కలిగే ధన నష్టం అంతా ఇంతా కాదట. అయితే అదే చీపురును సరైన పద్దతిలో వాడితే ఇంట్లో అష్టైశ్వర్యాలు తాండవిస్తాయని.. ఆ ఇల్లు సకల సౌభాగ్యాలతో తులతూగుతుందని మీకు తెలుసా..? హిందూ సాంప్రదాయాల ప్రకారం ఇంట్లో చీపురు వాడటానికి కొన్ని పద్దతులు ఉన్నాయని.. వాడిన చీపురును ఎక్కడ ఎలా భద్రపర్చాలో కూడా పరిహార శాస్త్రంలో ఉందని పండితులు చెప్తున్నారు. అయితే ఇంట్లో వాడే చీపురు విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఈ కథనంలో తెలుసుకుందాం.
ప్రతి ఇంట్లోనూ శుభ్రం చేయడానికి చీపురును వాడుతుంటారు. అయితే అలా వాడిన తర్వాత చీపురును ఇష్టం వచ్చినట్టు ఎక్కడ పడితే అక్కడ పెట్టేస్తుంటారు. అయితే ఆ చీపురు వాడటం వల్ల ఇల్లు శుభ్రం అవుతుందేమో కానీ ఆ ఇంట్లో అదృష్ట దేవత.. స్థిర నివాసం ఉండదట. పైగా ఆలాంటి ఇంట్లోకి దరిద్ర దేవత పరుగులు పెడుతూ వస్తుందట. ఇక ఆ దరిద్ర దేవతను ఆపడం ఎవరి వల్ల కాదని పరిహార శాస్త్ర నిపుణులు చెప్తున్నారు. జేష్టాదేవి ఏ ఇంట్లోనైనా అడుగుపెట్టిందంటే ఆ ఇంట్లో ధనం చీపురుతో ఊడ్చినట్టే ఊడ్చుకు పోతుందట.. పైగా ఆ ఇంట్లో ఉండే వాళ్ల ఆదాయం పడిపోతుందట. ఇంట్లో నెగటివ్ ఎనర్జీ పెరిగిపోవడంతో ఆ కుటుంబ సభ్యుల మధ్య రిలేషన్ కూడా చెడిపోతుందంటున్నారు. అయితే ఇల్లు శుభ్రం చేయడానికి చీపురును ఎలా వాడతామో అంతకన్నా ఎక్కువగా ఆ చీపురు పెట్టేందుకు కొన్ని పద్దతులు ఉన్నాయంటున్నారు. అలా పద్దతి ప్రకారం చీపురు పెట్టడం వల్ల ఇంట్లో నెగెటివ్ ఎనర్జీ కూడా తగ్గిపోయి పాజిటివ్ ఎనర్జీ పెరుగుతుందట.
హిందూ పురాణాలు, వాస్తు శాస్త్రం, పరిహార శాస్త్రం ప్రకారం చీపురు అనేది చాలా పవిత్రమైదని చీపురును లక్ష్మీదేవికి ప్రతీకగా బావిస్తారు. అయితే ఇంట్లో చీపురును వాడేటప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలని పరిహార శాస్త్ర నిపుణులు తెలియజేస్తున్నారు.
1. ఇంట్లో విరిగిపోయిన చీపురు ఎప్పుడూ వాడకూడదట. ఇలా వాడటం వల్ల ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ వెళ్లిపోతుందట. దీంతో ఇంట్లోన్న లక్ష్మీదేవి బయటకు వెళ్లిపోతుందట.
2. వాస్తు శాస్త్రం ప్రకారం చీపురును ఎప్పుడూ కిచెన్ లో పెట్టకూడదట. అలా పెట్టడం వల్ల ఇంట్లోకి నెగెటివ్ ఎనర్జీ పెరుగుతుందని పండితులు చెప్తున్నారు. అలాగే అధునిక విజ్ఞాన శాస్త్రం ప్రకారం కూడా చీపురులో డస్ట్ ఉంటుంది. కిచెన్‌లో పెట్టడం వల్ల కిచెన్ లో చేసే వంటకాల్లో డస్ట్ కలిసే ప్రమాదం ఉందంటున్నారు.
3. ఇక చాలా మంది చీపురును వాడిన తర్వాత గడప ముందు పడేస్తుంటారు. అలా పడేయడం కూడా ఇంటికి శుభప్రదం కాదంటున్నారు పండితులు. ఇంట్లోకి వచ్చే లక్ష్మీదేవి ఆ చీపురును చూసి గుమ్మం దగ్గర నుంచే వెనక్కి వెళ్లిపోతుందట. అలాగే ఇంట్లోకి వచ్చే పాజిటివ్ ఎనర్జీ కూడా రాకుండా పోతుందని చెప్తున్నారు.
4. ఇక చీపురును ఎప్పుడూ తిరగేసి గోడకు పెట్టకూడదని చెప్తున్నారు పండితులు. అలా పెట్టడం వల్ల ఆ ఇంటికి దరిద్రం పట్టుకుంటుందని ఆ ఇంట్లో సుఖఃసంతోషాలు ఉండవని చెప్తున్నారు.
అయితే చీపురును ఇంట్లో దక్షిణం వైపు గోడ దగ్గర కింద పెట్టాలని అలా పెట్టడం వల్ల ఆ ఇంటికి అంతా మంచే జరుగుతుందని చెప్తున్నారు. అలా పెట్టే చీపురు ఇంటికి వచ్చే బంధువులకు, చుట్టాలకు, మిత్రులకు కనిపించకుండా పెట్టాలని సూచిస్తున్నారు.
ALSO READ: YS జగన్ మళ్లీ జైలుకు వెళ్తారా? ఉగాది పంచాంగంలో ఆయన జాతకం ఎలా ఉందో తెలుసా?