Nithya Menon:ప్రముఖ స్టార్ హీరోయిన్ నిత్యామీనన్ (Nithya Menon) గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు. పొట్టిగా ఉన్నా.. తన అందంతో నటనతో అందరిని మెస్మరైజ్ చేస్తూ ఉంటుంది. ముఖ్యంగా నిత్యా మీనన్ కి సోషల్ మీడియాలో ప్రత్యేకమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందనడంలో సందేహం లేదు. రింగుల జుట్టు.. కవ్వించే కళ్ళతో.. తన అద్భుతమైన అందంతో అందరిని ఇట్టే తన వశం చేసుకుంటూ ఉంటుంది. అందుకే కుర్రకారు నిత్యామీనన్ అంటే పడి చచ్చిపోతారనడంలో సందేహం లేదు. అలాంటి ఈ ముద్దుగుమ్మ డిఫరెంట్ పాత్రలలో కూడా నటిస్తూ.. ఒక ప్రత్యేకమైన గుర్తింపును దక్కించుకుంది. ఇక ఇటీవల నేషనల్ అవార్డు కూడా రావడంతో జాతీయస్థాయిలో గుర్తింపు సంపాదించుకుంది నిత్యామీనన్. ఇదిలా ఉండగా సినిమా ఇండస్ట్రీలో మహిళలు ఎదుర్కొంటున్న పరిణామాలను, పరిస్థితులను, స్త్రీ – పురుషుల మధ్య తేడాలను వెల్లడిస్తూ.. ఇండస్ట్రీలో అసలేం జరిగింది? అనే విషయాన్ని వెల్లడించింది. మరి నిత్యమీనన్ ఏం చెప్పాలనుకుంది? అసలు ఏం జరిగింది? అనే విషయం ఇప్పుడు వైరల్ గా మారింది.
నిత్యామీనన్ కి గుర్తింపు తెచ్చిన సినిమాలివే..
నిత్యామీనన్.. నాచురల్ స్టార్ నాని (Nani) హీరోగా నటించిన ‘అలా మొదలైంది’ సినిమా ద్వారా తన సినీ ప్రస్థానాన్ని మొదలుపెట్టింది. మొదటి సినిమా హిట్ కావడంతో వరుస అవకాశాలు లభించాయి. అలా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan), ఎన్టీఆర్ (NTR), నాని (Nani) లాంటి స్టార్ హీరోల తరఫున నటించి మెప్పించిన ఈమె, తెలుగులోనే కాకుండా తమిళ్, మలయాళం సినిమాలలో కూడా నటించి భారీ పాపులారిటీ అందుకుంది. ఇక నిత్యామీనన్ కెరియర్ లో ఓ కాదల్ కన్మణి, తిరుచిత్రాంబలం, ఇడ్లీ కడై, జనతా గ్యారేజ్, గుండెజారి గల్లంతయ్యిందే, భీమ్లా నాయక్, కాంచన 2 తదితర చిత్రాలు ఈమెకు మంచి గుర్తింపును అందించాయి. ఇక ధనుష్ (Dhanush)హీరోగా వచ్చిన తిరుచిత్రాంబలం సినిమాలో తన నటనకు గానూ.. ఏకంగా నేషనల్ అవార్డు లభించింది. అంతేకాదు 2019లో ‘మిషన్ మంగళ్’ అనే సినిమా ద్వారా బాలీవుడ్ లో కూడా అడుగు పెట్టింది.
కారవాన్ల గుట్టు రట్టు చేసిన హీరోయిన్..
ఇదిలా ఉండగా తాజాగా ఈమె ఉదయనిధి స్టాలిన్ (Udhayanidhi stalin) భార్య కిరుతిగ ఉదయనిది (Kiruthiga Udhayanidhi) దర్శకత్వం వహిస్తున్న కాదలిక్క నేరమిళ్లై(Kadalikka Neramillai)అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. జనవరి 14వ తేదీన విడుదలైన ఈ సినిమా మంచి పాజిటివ్ రెస్పాన్స్ తో దూసుకుపోతోంది. ఇదే క్రమంలో ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న నిత్యా మీనన్.. షూటింగ్ స్పాట్స్ లలో తాను ఎన్నో ఇబ్బందికర విషయాలను పరిశీలించానని, తాను కూడా ఇబ్బందులు ఎదుర్కొన్నాను అని తెలిపింది. ముఖ్యంగా మేల్ క్యారెక్టర్స్ చేసే చిన్న పర్ఫామెన్స్ లకు కూడా వారిని ఎంకరేజ్ చేస్తారని, అలాంటి సమయంలో తాను ఎంతో ఇబ్బంది పడ్డానని తెలిపింది. అలాగే హీరోయిన్లకు, హీరోలకు కల్పించే సదుపాయాల గురించి కూడా మాట్లాడుతూ.. కారవాన్లలో ప్రత్యేకంగా మగవారికి సదుపాయాలు కల్పిస్తారు. కానీ ఆడవారికి రుతుక్రమ సమయంలో కూడా ఎటువంటి సదుపాయాలు కల్పించరు. ముఖ్యంగా ఇలాంటి సందర్భాలు తాను ఎన్నో ఎదుర్కొన్నాను అంటూ చెప్పుకొచ్చింది. ముఖ్యంగా ఇండస్ట్రీలో ఆడ , మగ అనే తేడా కచ్చితంగా ఉంటుంది. మేల్ డామినేషన్ ఉంటుంది అంటూ సంచలన కామెంట్లు చేసింది నిత్యా మీనన్. ప్రస్తుతం ఈమె చేసిన కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.