BigTV English

Sankranti festival: ఈసారి సంక్రాంతి పండుగ మాస్ జాతర.. తగ్గేదేలే..!

Sankranti festival: ఈసారి సంక్రాంతి పండుగ మాస్ జాతర.. తగ్గేదేలే..!

Sankranti festival: కోళ్లన్నీ ఊపేశాయ్.. ఊళ్లన్నీ ఊగిపోయాయ్. చెప్పాలంటే ఈ సంక్రాంతి జిగేల్ మన్నది. పండగంటే పండగే మరి. వెనక్కి తగ్గేదేలే అన్నారంతా. పిండివంటల దగ్గర్నుంచి కోడి పందాల దాకా, మందు నుంచి ఆటా పాటా దాకా ఒక్కటేంటి బరిలో దిగాక మామూలుగా ఉండదుగా.. పండగ పవరేంటో సంక్రాంతి నిరూపించింది. లెక్కలన్నీ తిరగరాసింది. భోగి, సంక్రాంతి, కనుమ మూడూ కలిసి ఒక్కొక్కరికీ టన్నుల కొద్దీ సంబరాలను ఇచ్చి పడేశాయ్.


ఈసారి కూడా సంక్రాంతి లెక్క తగ్గలేదు. లెక్క తప్పలేదు. మూడ్రోజులూ జాతరే జాతర అన్నట్లుగా సాగాయి. పండగంటే పండగే అంతే మరి. భోగి, సంక్రాంతి, కనుమ మూడు రోజులూ కట్టిపడేశాయ్. అందరిలో జిగేల్ నింపింది సంక్రాంతి. భోగితో బోణీ కొట్టి సంక్రాంతితో సంబరాలు చేసి, కనుమతో కిరాక్ అనిపించేలా పండగ సందడి నడిచింది. ముఖ్యంగా ఆంధ్రా అందులోనూ ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాలు, ఉమ్మడి కృష్ణా, గుంటూరు జిల్లాల్లో స్టోరీ మరో లెవెల్ లో సాగిందంతే.

గుండాట.. పేకాట.., గ్యాంబ్లింగ్‌, అందర్ బాహర్, చివరికి రికార్డింగ్ డ్యాన్స్ లు ఇలా అన్నీ నడిచాయి. పేకాట ఆడేవాళ్లకు, బరుల దగ్గర దగ్గరుండి మద్యం సరఫరా జరిగింది. ఈ సంక్రాంతి గతం కంటే ఇంకాస్త అడ్వాన్స్ గా మారింది. గతంలో కొన్ని ప్రాంతాలకే పరిమితమైన కోడి పందాల కల్చర్ ఇప్పుడు చాలా జిల్లాలకు పాకింది. ఒకప్పుడు సరదాగా సాగిన కోడి పందాలు, బిజినెస్ రేంజ్ నే పెంచేశాయి. పందెంకోళ్లను పెంచి అమ్మడం ఒక బిజినెస్ అయితే.. వాటిని కొని, కోట్లల్లో పందాలు కాయడం మరో ఎపిసోడ్. బరులు వేసిన నిర్వాహకులైతే పార్కింగ్ దగ్గర్నుంచి సప్లై దాకా అన్నిటికీ ఛార్జ్ వేసి సప్లై డిమాండ్ అంటే ఇదే అని నిరూపించారు.


ఇక పండగ మూడు రోజులూ కోడి పందాలను చూడటానికి, పందాలు కాయడానికి ఏపీలోని ఇతర జిల్లాలతో పాటు.. హైదరాబాద్‌, బెంగళూరు, చెన్నై నుంచి బడా వ్యాపారులు, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్లంతా గోదావరి జిల్లాలకు వచ్చి ఇక్కడే మకాం వేశారు. ఫుల్ ఎంజాయ్ చేశారు. కొందరు పందాలు కాశారు. ఇంకొందరు పందెంకోళ్ల టేస్ట్ చూసి వెళ్లారు. ఈ దఫా ఏపీలో కొత్త మద్యం పాలసీ రావడంతో అన్ని రకాల లిక్కర్ బ్రాండ్లు అందుబాటులోకి వచ్చాయి. సో మందు, ముక్కకు లోటు లేకుండా పోయింది.

ఈసారి పందెంకోళ్లలో కొత్త రికార్డ్ ఏంటంటే పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో కోటి రూపాయలు పందెం కాశారు. నెమలి పుంజు, రసంగి పుంజును కోటి 25 లక్షలు కాసి బరిలోకి దింపారు. కోటి రూపాయల పందాన్ని చూడ్డానికి వచ్చిన జనం అంతా ఇంతా కాదు. హోరా హోరిగా సాగిన పోరులో… నెమలి పుంజు కోటి తెచ్చి పెట్టింది. ఆ తర్వాత ఫ్రై అయిపోయింది.

సంక్రాంతి అంటే పందెంకోళ్లు, మందు, విందులే కాదు.. ఆంధ్రాలో అంతకు మించి. ఏ ఇంట చూసినా చూడముచ్చటగా రంగవల్లులు, గొబ్బెమ్మలు పెట్టి నవధాన్యాలు, పూలు చల్లి ఉత్సాహంగా గడిపారు మహిళలు. బంధువులంతా ఒక్క చోట చేరి చేసుకున్న పిండివంటలు, విందు భోజనాలతో పండగ మూడు రోజులు అదిరిపోయింది. కొత్త బట్టలు, ఆలయాల్లో పూజలు, గంగిరెద్దుల విన్యాసాలు, హరిదాసుల కీర్తనలు, సాంస్కృతిక కార్యక్రమాలు ఒక్కటేమిటి అన్నీ అదుర్స్ అనిపించాయి. సంక్రాంతి శోభతో తెలుగు లోగిళ్లు వెలిగిపోయాయి.

Also Read: Jallikattu: ఈడ పందెం కట్టు.. ఆడ జల్లికట్టు.. ప్రాణాలను కూడా లెక్కచేయరు..!

గోదావరి జిల్లాల్లో కోడి పందాలే కాదు.. ఉత్తరాంధ్రలో గుండురాయి పోటీలు, ఆవుల పండగ, తాడేపల్లి గూడెం వంటి చోట్ల పందుల పోటీ ఇవన్నీ హైలెట్టే. సంక్రాంతి పండగలో నాలుగో రోజైన ముక్కనుమతో సంబరాలు పూర్తవుతాయి. చివరి రోజు మాంసం కొనుగోళ్లు పెద్ద ఎత్తున జరుగుతుంటాయి.

Related News

Gold: బంగారాన్ని ఆర్టిఫీషియల్ గా తయారు చెయ్యొచ్చా? పరిశోధకులు ఏం చెప్తున్నారంటే?

AP Politics: ఆ టీం మనకొద్దు.. జగన్ కొత్త ప్లాన్..

Siddipet Congress: ఆ జిల్లా కాంగ్రెస్‌లో కుమ్ములాటలు?

Trump tariff: ట్రంప్ టారిఫ్ దెబ్బ.. ఆంధ్రా రొయ్యలు విల విల.. సీ ఫుడ్ ఇండస్ట్రీపై పడే ఎఫెక్ట్ ఎంత?

AP Politics: టీడీపీలోకి గల్లా రీఎంట్రీ? ఎప్పుడంటే?

Chennur Politics: చెన్నూరులో బాల్క సుమన్ చేతులెత్తేశారా?

Big Stories

×