Tollywood.. తాజాగా ఆస్ట్రేలియా గడ్డపై తెలుగోడు సత్తా చాటుతున్నాడు. తాను ఆడుతున్న నాల్గవ టెస్ట్ మ్యాచ్ లోనే సెంచరీ చేసి తగ్గేదేలే అంటూ దూసుకుపోతున్నారు. అసలు విషయంలోకి వెళ్తే.. బోర్డర్ – గవాస్కర్ ట్రోఫీలో భాగంగా ఆస్ట్రేలియాలో జరుగుతున్న నాలుగవ టెస్ట్ మ్యాచ్లో టీమిండియా గట్టిగా పోరాడుతోంది. నిప్పులు చెరుగుతున్న ఆస్ట్రేలియా బౌలర్ల ధాటికి ఎదురొడ్డి మరీ నిలిచింది. మూడవరోజు 7 వికెట్ల నష్టానికి 326 పరుగులు చేసి ఫాలో ఆన్ ప్రమాదం నుండి భారత్ ఎట్టకేలకు తప్పించుకుంది. ఇక ఈ సెషన్ లో హైలెట్ గా నిలిచాడు నితీష్ కుమార్ రెడ్డి(Nitish Kumar Reddy)..
సెంచరీ కొట్టేసిన తెలుగోడు..
హాఫ్ సెంచరీని పూర్తి చేసి సరికొత్త రికార్డు తన ఖాతాలో వేసుకున్నారు. టెస్టుల్లో ఇదే అతని మొదటి అర్థ సెంచరీ కావడంతో ప్రాధాన్యత సంచరించుకుంది. నాలుగు ఫోర్లు, ఒక భారీ సిక్సర్ తో 61 పరుగులు మీద ఆడుతూ.. ఆఫ్ సెంచరీ కొట్టగానే ‘పుష్ప’ స్టైల్ లో సిగ్నేచర్ డైలాగ్ “తగ్గేదేలే” అంటూ ఆడియన్స్ లో కొత్త ఊపు క్రియేట్ చేశాడు. ఇక ఇప్పుడు సెంచరీ కూడా కొట్టేశాడు మన తెలుగోడు. దీంతో ప్రస్తుతం ఎక్కడ చూసినా నితీష్ కుమార్ రెడ్డి గురించే చర్చ జరుగుతోంది. హైదరాబాద్ కుర్రాడైన నితీష్ కుమార్ రెడ్డి.. సీనియర్లు విఫలమైనా.. మనోడు మాత్రం దూసుకుపోతున్నారు. కమిన్స్ ,స్టార్క్, బోలాండ్ వంటి డేంజరస్ బౌలర్లను కూడా ఎదుర్కొంటూ సెంచరీ కొట్టేశాడు. దీంతో సర్వత్ర ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.
టాలీవుడ్ బిగ్ ఇండస్ట్రీ అంటూ సంబోధించిన క్రికెట్ అనాలసిస్ట్..
ఇక నితీష్ కుమార్ రెడ్డి సెంచరీ కొట్టేయడంతో ప్రముఖ క్రికెట్ అనాలిసిస్ట్ హర్హ భోగ్లే (Harsha Bhogle) మాట్లాడుతూ.. “నితీష్ కుమార్ రెడ్డి ఒక బిగ్ మూవీ ఇండస్ట్రీ నుంచి వచ్చాడు” అంటూ కామెంట్ చేశాడు. ఆయన తెలుగు సినిమా ఇండస్ట్రీని పెద్ద సినీ పరిశ్రమ అని సంబోధించడంతో ప్రతి ఒక్కరు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఆస్ట్రేలియా వంటి విదేశాలలో కూడా తెలుగు సినీ పరిశ్రమ ఎంతలా గుర్తింపు తెచ్చుకుందో హర్ష భోగ్లే మాటలు వింటే అర్థం చేసుకోవచ్చు. ముఖ్యంగా మన తెలుగు ఇండస్ట్రీలో ఉండే తారలు ఇతర దేశాల ఆడియన్స్ ని కూడా మెప్పిస్తూ దూసుకుపోతుంటే.. ఇప్పుడు క్రికెట్ రంగానికి చెందిన వారు కూడా విదేశాలలో సత్తా చాటుతూ తెలుగోడి పవర్ ఏంటో నిరూపిస్తున్నారు.మరోవైపు ప్రముఖ క్రికెట్ అనాలసిస్ట్ గా గుర్తింపు తెచ్చుకున్న హర్ష భోగ్లే టాలీవుడ్ పరిశ్రమ బిగ్ పరిశ్రమ అంటూ సంబోధించడం పై ప్రతి ఒక్కరూ ఇప్పుడు తెలుగు పరిశ్రమ వైపు చూస్తున్నారని చెప్పవచ్చు. ఇక ప్రస్తుతం ఈ విషయాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.
నితీష్ కుమార్ రెడ్డిపై బన్నీ ఫ్యాన్స్ ప్రశంస..
ఆస్ట్రేలియా క్రికెట్ స్టేడియం పై నితీష్ కుమార్ రెడ్డి పుష్ప సిగ్నేచర్ డైలాగ్ చూపించడం పై అల్లు అర్జున్ పేరు కూడా మారుమ్రోగుతోంది. నేషనల్ బ్రాండ్ కాదు ఇంటర్నేషనల్ బ్రాండ్ అంటూ అభిమానులు సైతం కామెంట్లు చేస్తున్నారు. ఏది ఏమైనా అల్లు అర్జున్కి పబ్లిసిటీ లేకుండానే పాపులారిటీ పెరిగిందని కామెంట్లు చేస్తూ ఉండడం గమనార్హం.