RajiniKanth – Kamal Haasan : సౌత్ ఇండియాలో రజినీకాంత్, కమల్ హాసన్‌లకు ఎలాంటి క్రేజ్ ఉందో అందరికీ తెలిసిందే. ఇలాంటి స్టార్ హీరోలతో సినిమాలు చేయాలని చిన్న డైరెక్టర్ల నుంచి మొదలు పెడితే… స్టార్ డైరెక్టర్లు సైతం అనుకుంటారు. వాళ్లు ఎప్పుడెప్పుడు టైం ఇస్తారా అని వెయిట్ చేస్తుంటారు. కానీ, ఓ డైరెక్టర్ మాత్రం కమల్ హసన్, రజినీకాంత్ తన సినిమాలకు పనికి రారు అని కామెంట్ చేశాడు. ఈ కామెంట్స్ ప్రస్తుతం కోలీవుడ్‌లోనే కాదు… మొత్తం సౌత్ సినీ ఇండస్ట్రీనే షేక్ చేస్తుంది. ఇలాంటి కాంట్రోవర్సియల్ కామెంట్స్ చేసిన స్టార్ హీరో ఎవరో ఇప్పుడు
చూద్ధాం…
డైరెక్టర్ బాల..
ఇప్పుడున్న ఆడియన్స్ టేస్ట్ వేరు. 90స్ లో సినిమాలు చూసిన వాళ్ల టేస్ట్ వేరు. అందుకే ఆ టైంలో శివ పుత్రుడు, వాడు వీడు, నేనే దేవుడ్ని లాంటి సినిమాలు రియలిస్టిక్ ఉండటంతో ఓన్లీ తమిళ ఆడియన్స్ మాత్రమే కాదు, తెలుగు సినీ లవర్స్ కూడా అట్రాక్ట్ అయ్యారు. అలాంటి సినిమాలు చేసిన డైరెక్టర్ బాల అంటే సినీ లవర్స్‌కు విపరీతమైన అభిమానం పెరిగిపోయింది. ఆయన నుంచి ఎలాంటి సినిమాలు వచ్చినా.. నటీనటులతో సంబంధం లేకుండా చూస్తారు.
సూర్య – మమిత తప్పుకున్న తర్వాత..
ప్రస్తుతం ఆయన వనంగాన్ అనే మూవీ చేస్తున్నాడు. దీనిలో అరుణ్ విజయ్ హీరో. వచ్చే ఏడాది సంక్రాంతి సందర్భంగా జనవరి 10న ఈ సినిమాను రిలీజ్ చేస్తున్నారు. అప్పట్లో ఈ వనంగాన్ మూవీని సూర్య హీరోగా డైరెక్టర్ బాల అనౌన్స్ చేశాడు. అంతే కాదు, కొంత వరకు షూటింగ్ ను కూడా పూర్తి చేశాడు. అయితే అనూహ్యంగా ఆ ప్రాజెక్ట్ నుంచి సూర్య తప్పుకున్నాడు. అలాగే హీరోయిన్‌గా ముందు మమిత బైజు అనుకున్నారు. కానీ, ఆమె కూడా తప్పుకుంది. డైరెక్టర్ తనపై చేయి చేసుకున్నాడని, అందుకే వనంగాన్ మూవీ నుంచి తప్పుకున్నట్టు ఆమె ఇటీవల అనౌన్స్ చేసింది.
కమల్, రజినీపై కామెంట్స్…
అయితే అన్నింటినీ దాటుకుని ఈ సినిమా వచ్చే ఏడాది జనవరి 10న రిలీజ్ కాబోతుంది. ఈ నేపథ్యంలో మూవీ ప్రమోషన్స్ జరుగుతున్నాయి. ప్రమోషన్స్ లో భాగంగా… కమల్ హాసన్, రజినీకాంత్ లతో సినిమాల గురించి డైరెక్టర్ బాలకు ఓ ప్రశ్న వచ్చింది. దీనికి డైరెక్టర్ బాల నుంచి వచ్చిన ఫస్ట్ ఆన్సర్… “నో”.
రజినీకాంత్, కమల్ హాసన్ లాంటి హీరోల స్టోరీ సెలక్షన్ డిఫరెంట్‌గా ఉంటుందని, తన స్టోరీ రైటింగ్ మరో రకంగా ఉంటుందని, తన కథలు వాళ్లకు సెట్ అవ్వవు అని కామెంట్ చేశారు. ప్రస్తుతం ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. రజినీ, కమల్ లాంటి హీరోలతో సినిమాలు చేయాలని డైరెక్టర్లు క్యూ కడుతుంటే… డైరెక్టర్ బాల ఏంటి ఇలా అంటున్నాడు అంటూ స్పందిస్తున్నారు. అలాగే మరి కొంత మంది అయితే… బాల చెప్పింది కరెక్టే అని… బాల చేసే రియలిస్టిక్ స్టోరీలు రజినీ కాంత్, కమల్ హాసన్ లకు సెట్ అవ్వవు అని తమ అభిప్రాయాన్ని వెల్లడిస్తున్నారు.