BigTV English

NTR 31 : హీరో లేకుండానే “ఎన్టీఆర్31” షూట్… ఎన్టీఆర్ సెట్స్ లో అడుగు పెట్టేదెప్పుడంటే?

NTR 31 : హీరో లేకుండానే “ఎన్టీఆర్31” షూట్… ఎన్టీఆర్ సెట్స్ లో అడుగు పెట్టేదెప్పుడంటే?

NTR 31 : మోస్ట్ అవైటింగ్ పాన్ ఇండియా యాక్షన్ ఎంటర్టైనర్ దేవర రిలీజ్ కు కౌంట్ డౌన్ మొదలయింది. ఓ వైపు చిత్రబృందం మూవీ ప్రమోషన్లలో బిజీగా ఉంటే, మరోవైపు ఎన్టీఆర్ నెక్స్ట్ ప్రాజెక్టు ఎప్పడు మొదలవుతోంది? అనే విషయాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నిస్తున్నారు తారక్ ఫ్యాన్స్. ఈ నేపథ్యంలోనే ఆయన అభిమానులు ఎగిరి గంతేసే అప్డేట్ ఒకటి బయటకు వచ్చింది. ఆ అప్డేట్ ఏంటో తెలుసుకుందాం పదండి.


ఎన్టీఆర్ లేకుండానే షూటింగ్ స్టార్ట్ 

జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం వరుస సినిమాలకు కమిట్మెంట్ ఇచ్చిన విషయం తెలిసిందే. దేవర రెండు పార్ట్ లతో పాటు కన్నడ దర్శకుడు ప్రశాంత్ నీల్ తో, హిందీలో అయాన్ ముఖర్జీతో మరో రెండు సినిమాలకు కమిట్ అయ్యారు. అయితే దేవర పార్ట్ 1 రిలీజ్ అయ్యాక ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ తో సినిమాను చేయాల్సి ఉంది. వీరిద్దరి కాంబినేషన్ లో రానున్న సినిమాపై ఇప్పటికే అఫిషియల్ అనౌన్స్మెంట్ కూడా వచ్చేసింది. షూటింగ్ మొదలు పెట్టడమే ఆలస్యం. ఇక ఈ ప్రాజెక్టు కు ఎన్టీఆర్ 31 అనే వర్కింగ్ టైటిల్ ను పెట్టారు మేకర్స్. సినిమా అనౌన్స్ అయినప్పటి నుంచి వీరిద్దరూ తెరపై మ్యాజిక్ క్రియేట్ చేస్తారంటూ బజ్ మొదలైంది. ఈ ప్రాజెక్ట్‌పై క్యూరియాసిటీ నెలకొనగా, తాజాగా ఈ సినిమాకు సంబంధించిన కొత్త సమాచారం వెలుగులోకి వచ్చింది.


ఎన్టీఆర్ నటించిన పాన్ ఇండియన్ యాక్షన్ డ్రామా ‘దేవర’ వచ్చే వారం థియేటర్లలో విడుదల కానుంది. కొరటాల శివ దర్శకత్వంలో భారీ బడ్జెట్‌తో ఈ సినిమా తెరకెక్కింది. ఇందులో జాన్వీ కపూర్, బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీ ఖాన్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఎన్టీఆర్ ప్రస్తుతం సినిమా ప్రమోషన్‌లో బిజీగా ఉన్నాడు. తాజాగా జూనియర్ ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్‌తో తన ప్రాజెక్ట్ గురించి స్వయంగా అప్డేట్ ఇచ్చారు. ఈ సినిమా షూటింగ్‌ ఎప్పుడు స్టార్ట్ అవుతుందని ఎన్టీఆర్‌ని అడగ్గా ‘అక్టోబర్ 21 నుంచి ఎన్టీఆర్ 31 సినిమా షూటింగ్‌ ప్రారంభమవుతుంది. నేను లేని పార్ట్‌ల షూటింగ్‌ని నీల్  మొదలుపెడతాడు. అక్టోబరు 21 నుంచి దాదాపు 40 రోజుల పాటు ఆ షెడ్యూల్ కొనసాగుతుంది. జనవరి 2025లో సెట్స్‌లో జాయిన్ అవుతాను “అంటూ ఫ్యాన్స్ కు పూనకాలు తెప్పించే అప్డేట్ ఇచ్చారు తారక్.

NTR 31: Jr.NTR unveils his fierce avatar in his next film with director  Prashanth Neel on his birthday; poster out

ఎన్టీఆర్ 31 టైటిల్ ఇదేనా?

ప్రశాంత్ నీల్ సినిమా పూర్తయిన తర్వాతే జూనియర్ ఎన్టీఆర్ ‘దేవర 2’కి సంబంధించిన పనులు మొదలు పెడతాడు. ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్‌ల ప్రాజెక్ట్‌ ఎన్టీఆర్ 31కి ‘డ్రాగన్’ అనే టైటిల్‌ను పెట్టనున్నట్లు సమాచారం. సమయంలో ఎన్టీఆర్ 31ని మైత్రి మూవీ మేకర్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మించనున్నారు. రవి బస్రూర్ ఈ చిత్రానికి మ్యూజిక్ డైరెక్టర్.  ఈ మూవీ షూటింగ్ పూర్తి అయ్యేలోపు ఎన్టీఆర్ హీరోగా నటించిన దేవర, హిందీ చిత్రం వార్ 2 ప్రేక్షకులను అలరించనున్నాయి. మొత్తానికి గ్యాప్ లేకుండా ఫ్యూచర్ ను ప్లాన్ చేసుకుంటున్నారు ఎన్టీఆర్.  కాగా ‘దేవర’ చిత్రం సెప్టెంబర్ 27న ప్రేక్షకుల ముందుకు రానుంది.

Related News

Alekhya sisters: ఇదేంట్రా బాబూ.. కుక్కలకు, నక్కలకు జీవితం అంకితం అంటోంది?

Movie Tickets : బుక్ మై షోలో లేని టికెట్స్ డిస్ట్రిక్ట్ యాప్‌లో ఎలా వస్తున్నాయి ?

Save the Tigers 3 : ‘సేవ్ ది టైగర్స్’ మళ్లీ వచ్చేస్తుంది.. ఎమ్మెల్యే గా ఘంటా రవి..

BIG TV Kissik talk Show: ఆ డైరెక్టర్ వల్లే నా కెరీర్ మొత్తం నాశనం.. మండిపడ్డ నటి రాశి

BIG TV Kissik talk Show : పదేళ్లుగా పిల్లలు పుట్టలేదు, చివరికి నా ప్రాణాలు ఫణంగా పెట్టి.. రాశి భావోద్వేగం

Sydney Sweeney: సిడ్నీ స్వీని బాలీవుడ్ ఎంట్రీ.. ఏకంగా రూ.530 కోట్లు ఆఫర్.. కళ్లు తేలేసిన నటి!

BIG TV Kissik talk Show : అతడితో పెళ్లి.. ఇంట్లో చాలా పెద్ద గొడవలు అయ్యాయి – కిస్సిక్ టాక్‌లో రాశి కామెంట్స్

Priyanka Jain: ప్రియాంకకు హ్యాండిచ్చి.. శోభశెట్టితో పులిహోర కలిపిన శివ్, అడ్డంగా బుక్కయ్యాడుగా!

Big Stories

×