BigTV English

NTR 31: ‘సాహో’ హీరోయిన్‌తో ఎన్టీఆర్‌!

NTR 31: ‘సాహో’ హీరోయిన్‌తో ఎన్టీఆర్‌!

NTR 31: యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ ఇప్పుడు త‌న మార్కెట్‌ను పాన్ ఇండియా రేంజ్‌లో పెంచుకునే ఆలోచ‌న‌ల‌తో అడుగులు ముందుకు వేస్తున్నారు. అందులో భాగంగానే ఆర్ఆర్ఆర్ సినిమా త‌ర్వాత కొర‌టాల శివ ద‌ర్శ‌క‌త్వంలో NTR 30 సినిమా చేస్తోన్న సంగ‌తి తెలిసిందే. దీని త‌ర్వాత ఎన్టీఆర్ లైన్‌లో పెట్టిన సినిమాల‌న్నీ భారీగానే ఉన్నాయి. ఆ లిస్టులో NTR 31గా రాబోతున్న సినిమాకు ప్ర‌శాంత్ నీల్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించ‌నున్నారు. ప్ర‌స్తుతం ప్ర‌భాస్‌తో స‌లార్ సినిమా చేస్తోన్న ప్ర‌శాంత్ నీల్ నెక్స్ ఎన్టీఆర్ 31 సినిమాను చేయ‌బోతున్నారు.


స‌లార్ మూవీ కూడా ఫైన‌ల్ స్టేజ్‌కు రావ‌టంతో ప్ర‌శాంత్ నీల్ త‌న దృష్టిని ఎన్టీఆర్ సినిమాపై పెట్టార‌ట‌. NTR 31కి సంబంధించిన ప్రీ ప్రొడ‌క్ష‌న్ ప‌నులు జ‌రుగుతున్నాయని టాక్ వినిపిస్తోంది. తాజాగా మ‌రో న్యూస్ కూడా బ‌య‌ట‌కు వ‌చ్చింది. అదేంటంటే ఎన్టీఆర్ 31లో బాలీవుడ్ బ్యూటీ శ్ర‌ద్దా క‌పూర్ హీరోయిన్‌గా క‌నిపించ‌నుంద‌ట‌. నిజానికి ముందుగా ఈ చిత్రంలో దీపికా ప‌దుకొనెను హీరోయిన్‌గా తీసుకోవాల‌ని అనుకున్నారు. కానీ ఆమె బిజీ కాల్షీట్స్ కార‌ణంగా డేట్స్ అడ్జ‌స్ట్ చేయ‌లేన‌ని చెప్పేయ‌టంతో మేక‌ర్స్ ఇప్పుడు శ్ర‌ద్ధా క‌పూర్‌తో మంత‌నాలు జ‌రుపుతున్నార‌ని స‌మాచారం.

కె.జి.య‌ఫ్‌, కాంతార వంటి చిత్రాల‌తో పాన్ ఇండియా బాక్సాఫీస్ ద‌గ్గ‌ర రికార్డుల‌ను క్రియేట్ చేసిన నిర్మాణ సంస్థ హోంబ‌లే ఫిలింస్ బ్యాన‌ర్‌పై విజ‌య్ కిర‌గందూర్ NTR 31ను నిర్మించ‌బోతున్నారు. ప్ర‌స్తుతం ఎన్టీఆర్ త‌న 30 సినిమాపై ఫోక‌స్‌గా ఉన్నారు. ఈ సినిమాను వ‌చ్చే ఏడాది ఏప్రిల్ 5న విడుద‌ల చేయ‌బోతున్నారు. ఇప్ప‌టికే NTR 30కి సంబంధించి రెండు షెడ్యూల్స్ పూర్త‌య్యాయి. ఎన్టీఆర్ సరికొత్త మాస్ అవ‌తార్‌లో కొర‌టాల ప్రెజెంట్ చేయ‌బోతున్నారు. ఈ చిత్రంలో జాన్వీ క‌పూర్ హీరోయిన్‌. అనిరుద్ రవిచందర్ సంగీతాన్ని అందిస్తున్నారు. నందమూరి కళ్యాణ్ ఎన్టీఆర్ ఆర్ట్స్, యువ సుధ ఆర్ట్స్ బ్యానర్స్‌పై హరి కృష్ణ.కె, సుధాకర్ మిక్కిలినేని ఈ చిత్రాన్ని పాన్ ఇండియా మూవీగా నిర్మిస్తున్నారు.


Related News

Film industry: కన్న తండ్రే కసాయి.. కొట్టి ఆ గాయాలపై కారం పూసేవాడు.. హీరోయిన్ ఆవేదన!

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Big Stories

×