NTR 31 Update : ‘దేవర’ (Devara) మూవీతో రీసెంట్ గా బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న ఎన్టీఆర్ (Jr NTR) త్వరలోనే ప్రశాంత్ నీల్ (Prashanth neel) దర్శకత్వంలో తెరకెక్కుతున్న “ఎన్టీఆర్ 31” NTR 31 మూవీ సెట్స్ లో జాయిన్ కాబోతున్నారు. ఎంతో ఆసక్తిగా ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఎదురు చూస్తున్న ఈ సినిమా షూటింగ్ కు సంబంధించిన అప్డేట్ తాజాగా బయటకు వచ్చింది.
ప్రస్తుతం ‘ఎన్టీఆర్ 31’ NTR 31 అనే వర్కింగ్ టైటిల్ తో పిలుచుకుంటున్న ఈ యాక్షన్ డ్రామాను మైత్రి మూవీ మేకర్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ల పై సంయుక్తంగా నిర్మిస్తున్నారు. అయితే మూవీని లాంచ్ చేసిన రోజే 2026 జనవరి 9న రిలీజ్ చేయబోతున్నాం అంటూ అనౌన్స్ చేశారు. ఇక ఈ సినిమాకు రవి బస్రూర్ సంగీతం అందిస్తున్నారు. ప్రస్తుతం ఎన్టీఆర్ ‘వార్ 2’ సినిమా షూటింగ్లో బిజీగా ఉన్నాడు.
తాజా సమాచారం ప్రకారం జనవరి లాస్ట్ వీక్ వరకు తారక్ పాత్రకు సంబంధించిన షూటింగ్ జరుగుతుందని తెలుస్తోంది. అనంతరం ప్రశాంత్ నీల్ – తారక్ మూవీ NTR 31 మొదలు కాబోతోంది. డిసెంబర్ మొదటి వారంలో ప్రశాంత్ నీల్ ఈ ప్రాజెక్టు షూటింగ్ ను మొదలు పెట్టబోతున్నారు. ఇప్పటికే హైదరాబాదులో దీని కోసం ఓ భారీ సెట్ లో షూట్ ప్లాన్ చేశారని తెలుస్తోంది. అయితే ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే డిసెంబర్ నుంచి మొదలు పెట్టి జనవరి దాకా తారక్ లేకుండానే ఈ సినిమా షూటింగ్ జరపబోతున్నారు.
ఎన్టీఆర్ ఇప్పటికే ‘దేవర’ మూవీ ప్రమోషన్లలో ఈ సినిమా షూటింగ్ సెట్స్ లో తను 2025 జనవరి కల్లా జాయిన్ అవుతాను అని చెప్పిన విషయం గుర్తుండే ఉంటుంది. జనవరిలో ‘వార్ 2’ మూవీ షూటింగ్ పూర్తయ్యాక ఫిబ్రవరి మొదటి వారం నుంచి “ఎన్టీఆర్ 31” NTR 31 మూవీ సెట్స్ లో ఎన్టీఆర్ ఎంట్రీ ఇవ్వబోతున్నట్టుగా తెలుస్తోంది.
ఇదిలా ఉండగా ఈ సినిమాకు ‘డ్రాగన్’ (Dragon) అనే టైటిల్ ను పరిశీలిస్తున్నట్టుగా ప్రచారం జరుగుతోంది.. ఇక ఈ సినిమా ప్రారంభోత్సవం రోజునే మూవీ కాన్సెప్ట్ ఏంటి అనే విషయాన్ని ప్రకటించారు. అందులో చైనా, భూటాన్, బెంగాల్, కోల్కతా అని రాసి ఉండడం క్యూరియాసిటీని పెంచేసింది. గతంలో ప్రశాంత్ నీల్ ఓ ఇంటర్వ్యూలో ఈ మూవీ గురించి మాట్లాడుతూ ఈ సినిమాతో తను ఒక కొత్త జానర్ ని టచ్ చేసానని చెప్పారు. ఇక ఈ సినిమా 1969 లో సాగిబోతుందని పోస్టర్ ద్వారా చెప్పకనే చెప్పారు మేకర్స్.
బంగ్లాదేశ్ బ్యాక్ డ్రాప్ లో రూపొందనున్న ఈ సినిమాలో కన్నడ బ్యూటీ రుక్మిణి వసంత్ హీరోయిన్ గా నటించబోతోంది అంటూ రూమర్లు చక్కర్లు కొడుతున్నాయి. మరోవైపు ఈ సినిమాలో ఎన్టీఆర్ సరసన నేషనల్ క్రష్ రష్మిక మందన్నాను నటింపజేయాలని మేకర్స్ ప్రయత్నిస్తున్నట్టుగా టాక్ నడుస్తోంది. ఒకవేళ ఇదే గనక నిజమైతే ఎన్టీఆర్, రష్మిక కాంబినేషన్లో రానున్న ఫస్ట్ సినిమా ఇదే అవుతుంది. అయితే ఇంతవరకు ఈ సినిమాలో హీరోయిన్ ఎవరు అన్న విషయంపై ఇంకా క్లారిటీ లేదు.