BigTV English

NTR’s Devara Movie First Single: దేవర ఫస్ట్ సింగిల్ రాబోతుందా.. ఈ ట్వీట్‌కు అర్థమేంటి..?

NTR’s Devara Movie First Single: దేవర ఫస్ట్ సింగిల్ రాబోతుందా.. ఈ ట్వీట్‌కు అర్థమేంటి..?
Devara - Ntr
Devara – Ntr

NTR Jahnvi Kapoor’s Devara First Single Release Date: ఎన్టీఆర్ – కొరటాల శివ కాంబినేషన్‌లో ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతోన్న మూవీ ‘దేవర’ మూవీ కోసం ప్రేక్షకాభిమానులు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు. పోర్ట్ మాఫియా నేపథ్యంలో ఈ మూవీ భారీ బడ్జెట్‌తో రూపొందుతోంది. ఎన్టీఆర్ ఆర్ట్స్, యువ సుధా ఆర్ట్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాయి. ఈ మూవీ నుంచి ఇప్పటికే విడుదలైన పోస్టర్స్, ఫస్ట్ లుక్ గ్లింప్స్ సినిమా అంచనాలను మరో స్థాయికి తీసుకుని వెళ్లాయి.


ముఖ్యంగా గ్లింప్స్‌తో సినిమాపై ఫుల్ హైప్ క్రియేట్ చేశారు మేకర్స్. అందులో ఎన్టీఆర్ మాస్ లుక్, ఫైట్ సీన్స్ అందరినీ మంత్రముగ్దులను చేశాయి. రెండు పార్టులుగా తెరకెక్కనున్న ఈ మూవీ షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుగుతోంది. ఈ నేపథ్యంలో తాజాగా ఈ మూవీకి సంబంధించిన ఓ అప్డేట్ బయటకొచ్చి నెట్టింట చక్కర్లు కొడుతోంది.

తాజాగా ఈ మూవీ అఫీషియల్ హ్యాండిల్‌లో ‘దేవర’ GIF ఫైల్‌ని రిలీజ్ చేసి దానికి క్యాప్షన్‌గా దేవర అంటూ మ్యూజిక్ సింబల్స్‌ని పెట్టారు. దీంతో ఈ మూవీ నుంచి ఫస్ట్ సింగిల్ రాబోతుందా? అంటూ చాలా మంది డౌట్ పడ్డారు. అయితే ఇప్పుడు దానిపై అందరికీ ఫుల్ క్లారిటీ వచ్చేసింది.


Also Read: సమంతతో లిప్ లాక్.. సినిమా తీసినంత కాలం తననే ఎంచుకుంటా!: డైరెక్టర్ సుకుమార్

ఈ మూవీ ఆడియో హక్కులు సొంతం చేసుకున్న ప్రముఖ మ్యూజిక్ సంస్థ టీ సిరీస్ వారు కూడా దేవర అంటూ మ్యూజిక్ సింబల్స్‌తో ఫైర్ ఎమోజీ పెట్టారు. దీంతో త్వరలో దేవర మూవీ నుంచి ఫస్ట్ సింగిల్ వచ్చేస్తుందని ప్రేక్షకాభిమానులు ఫుల్ ఖుష్ అవుతున్నారు. ప్రస్తుతం అందుకు సంబంధించిన వార్త జోరుగా చక్కర్లు కొడుతోంది.

దీనిపై మేకర్స్ నుంచి అఫీషియల్ అనౌన్స్‌మెంట్ త్వరలో వచ్చే అవకాశముంది. కాగా ఈ మూవీలో బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటిస్తుండగా.. సైఫ్ అలీఖాన్ కీలక పాత్ర పోషిస్తున్నాడు. ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తుండటంతో సినీ ప్రియులు ఇంకా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇకపోతే ఈ మూవీ ఓవర్సీస్ డీల్ రూ.27 కోట్ల ధరకు అమ్ముడుపోయిన సంగతి తెలిసిందే.

Related News

Film industry: కన్న తండ్రే కసాయి.. కొట్టి ఆ గాయాలపై కారం పూసేవాడు.. హీరోయిన్ ఆవేదన!

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Big Stories

×