Big Stories

Director Sukumar – Samantha: సమంతతో లిప్ లాక్.. సినిమా తీసినంత కాలం తననే ఎంచుకుంటా: డైరెక్టర్ సుకుమార్

Director Sukumar
Director Sukumar – Samantha

Director Sukumar Crazy Comments on Samantha: ప్రస్తుతం ఫుల్ ఫామ్‌లో ఉన్న దర్శకుల్లో లెక్కల మాస్టర్ సుకుమార్ ఒకరు. జీనియస్ డైరెక్టర్​గా ప్రేక్షకుల్లో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ఈయన తన కెరీర్​లో స్క్రీన్​ప్లే రైటర్​గా, దర్శకుడిగా, నిర్మాతగా దుసుకుపోతున్నాడు. ఇప్పటి వరకు అతడు తెరకెక్కించిన సినిమాలన్నీ సూపర్ హిట్ కావడం గమనార్హం. అంతేకాకుండా పలు బ్లాక్ బస్టర్ చిత్రాలతో తన కెరీర్​గ్రాఫ్​ను అమాంతగా పెంచుకున్నాడు.

- Advertisement -

ఇక ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌తో పుష్ప మూవీ చేసి మరింత పేరు సంపాదించుకున్నాడు. ఇండియా వైడ్​గానే కాకుండా వరల్డ్ వైడ్‌కు కూడా తనేంటో, తన క్రియేటివి ఏంటో అందరికీ తెలిసింది. అయితే ఆయన తన జర్నీలో ఎంతో మంది హీరోలను, హీరోయిన్లను చూశారు. కానీ ఆయన తాజాగా ఓ స్టార్ హీరోయిన్‌పై ప్రశంసలు కురిపించాడు. అయితే ఆమె మరెవరో కాదండీ.. హీరోయిన్ సమంత. ప్రస్తుతం సుకుమార్.. సమంతపై చేసిన కొన్ని కామెంట్స్ నెట్టింట వైరల్‌గా మారాయి.

- Advertisement -

దర్శకుడు సుకుమార్.. అల్లు అర్జున్‌తో పుష్ప మూవీ ముందు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్‌తో రంగస్థలం మూవీ చేసిన విషయం తెలిసిందే. రంగస్థలం అనగానే అందరికీ గుర్తుచ్చేది చిట్టిబాబు. ఈ మూవీకి ప్రేక్షకాభిమానులు ఎంతలా కనెక్ట్ అయిపోయారో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇందులో చరణ్ యాక్టింగ్‌కు సలామ్ కొట్టాల్సిందే.

Also Read: విజయ్ చివరి మూవీ రెమ్యూనరేషన్‌తో మరో బాహుబలి తీయొచ్చు.. ఎన్ని కోట్లో తెలుసా..?

అలాగే సమంత లుక్స్, నటనకు ప్రేక్షకులు ఫిదా అయిపోయారనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. అంతేకాకుండా ఇతర నటీ నటులు కూడా ఈ చిత్రానికి ప్రాణం పోశారు. ఎన్నో రికార్డులను సైతం ఈ మూవీ తిరగరాసింది. ఇందులో చెవిటి చిట్టిబాబుగా చరణ్‌కి, పల్లెటూరి రామలక్ష్మిగా సమంతకు అద్భుతమైన పేరు వచ్చింది. ఈ చిత్రంతో నటులుగా వీరు మరో స్థాయికి ఎదిగానడంలో సందేహమే లేదు.

అయితే ఇప్పుడు ఈ మూవీ గురించి, ఇందులో సమంత పాత్ర గురించి దర్శకుడు సుకుమార్ తెలిపాడు. ఇందులో హీరోయిన్‌గా మొదట సమంతను కాదనుకున్నారట. అందుకు సంబంధించిన విషయాలను సుకుమార్ అప్పట్లో కొన్ని ఇంటర్వ్యూలలో చెప్పారు. షూటింగ్ టైంలో సమంత నటన చూసి తాను ఆశ్చర్యపోయినట్లు తాజాగా గుర్తుచేసుకున్నారు.

రంగస్థలం మూవీలో రామ్ చరణ్‌ని తప్ప ఇంకెవరినీ అస్సలు ఊహించుకోలేము. తొలుత ఈ సినిమాలో సమంతను హీరోయిన్​గా తీసుకోవాలనుకోలేదు. కొత్త అమ్మాయి అయితే బాగుంటుందని అనుకున్నాను. ఎందుకంటే ఇద్దరు స్టార్‌లను మేనేజ్ చేయలేనేమో అని అనిపించింది. అందువల్లనే సమంతను మొదట్లో కాదనుకున్నాను.

Also Read: తాప్సీ పెళ్లి వీడియో లీక్.. డ్యాన్స్ చేస్తూ వధువు.. సైకిల్ పై వరుడు..

కానీ పల్లెటూరి అమ్మాయి పాత్రకు సమంత అయితేనే బాగుంటుందని అనుకున్నాను. అందువల్లనే ఆమెను సెలెక్ట్ చేశాను. అయితే షూటింగ్ సమయంలో సమంత నటన చూసి ఎంతో ఆశ్చర్యపోయాను. అనుకున్నదానికంటే ఆమె నటన మరింత స్థాయిలో ఉండటం చూసి ఎంతో ఆనందించాను. అంతేకాకుండా ఆ సినిమాలో సమంతతో లిప్‌లాక్ సీన్ కూడా కథకు ప్రాధాన్యత ఇస్తుందనే పెట్టాను అని అన్నాడు.

ఆమె నటనతో తాను మంత్రముగ్దుడిన అయ్యానని.. తాను సినిమాలు తీసినంతకాలం సమంతను ఎంచుకుంటూనే ఉంటానని అన్నాడు. ఆమెకు ఎంత వయస్సు పెరిగినా.. ఆ వయస్సుకు తగ్గ పాత్రను ఇస్తానని చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం సుకుమార్ వ్యాఖ్యలు నెట్టింట వైరల్‌గా మారుతున్నాయి. కాగా ప్రస్తుతం సుకుమార్ పుష్ప 2 మూవీ షూటింగ్‌లో బిజీగా ఉన్న విషయం తెలిసిందే.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News