BigTV English
Advertisement

Woman attack with Snake: ఆర్టీసీ డ్రైవర్ ను పాముతో భయపెట్టిన మహిళ.. హైదరాబాద్ లోనే ఘటన

Woman attack with Snake: ఆర్టీసీ డ్రైవర్ ను పాముతో భయపెట్టిన మహిళ.. హైదరాబాద్ లోనే ఘటన

woman attack with snake on rtc driver in Hyderabad: ఆడవారు చాలా సౌమ్యులు అంటుంటారు. సహనానికి మారుపేరు అని కూడా అంటారు. కానీ ఆగ్రహం వస్తే కొందరు అమ్మోరే అవుతారు. అపర కాళికలవుతుంటారు. ఇళ్లలోనే కోపం వస్తే భర్తలను కూడా లెక్కచేయని భార్యలు ఉంటారు. ఆగ్రహంతో భర్తలపై చేతికి ఏం వస్తే అది విసిరేస్తుంటారు. వీళ్ల పుణ్యమా అని ఆసుపత్రుల పాలవుతుంటారు భర్తలు. అయితే అవన్నీ పక్కనపెడితే హైదరాబాద్ లో ఓ మహాలక్ష్మికి కోపం వచ్చింది. మహాలక్ష్మి అంటే ఈ స్కీమ్ ద్వారా ఉచితంగా బస్సు ప్రయాణం చేసే తెలంగాణ మహిళ. రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన ఉచిత బస్సు సౌకర్యాన్ని చాలా హ్యాపీగా ఉపయోగించుకుంటున్నారు తెలంగాణ మహిళలు. అయితే ఒక్కోసారి బస్సులో కండెక్టర్ తమని ఆధార్ చూపించమని అన్నాడనో..లేక వేరే ఇతర కారణాలతో ఏకంగా కండెక్టర్ ను కొట్టిన సందర్భాలు కూడా చూస్తూనే ఉన్నాం.


బీర్ బాటిల్ తో దాడి

ఓ మహిళ వేగంగా వెళుతున్న బస్సు ఆపలేదని డ్రైవర్ పై ఆగ్రహంతో వెంటనే ఓ ఖాళీ బీర్ బాటిల్ ను తీసి బస్సు వెనక ఉన్న అద్దం కేసి బలంగా విసరడంతో ఆ బస్సు అద్దం కాస్తా విరిగిపోయింది. పెద్ద సౌండ్ తో అద్దం పగలడంతో బస్సులోని ప్రయాణికులు ఒక్కసారిగా షాక్ కు గురయ్యారు. ఇక డ్రైవర్ వెంటనే బస్సును పక్కకు ఆపేసి కిందకు దిగి చూసేసరికి మహిళ ఊహించని విధంగా డైవర్ పై ఎదురుదాడికి దిగింది. ఈ ఘటన గురువారం సాయంత్రం హైదరాబాద్ విద్యానగర్ ప్రాంతంలో జరిగింది. దిల్ సుఖ్ నగర్ డిపోకు చెందిన ఆ బస్సు ట్రాఫిక్ సిగ్నల్ సమీపంలో ఎడమవైపునకు తిరుగుతోంది. ఈ దశలో ఓ మహిళ చెయ్యి ఎత్తి బస్సును ఆపవలసిందిగా కోరింది. అంత ట్రాఫిక్ లో బస్సు ఆపితే కష్టం అని భావించిన కండెక్టర్ ఆపకుండా ముందుకు వెళ్లిపోతున్నాడు. దీనితో కోపం పట్టలేక అక్కడే రోడ్డు పక్కనే ఉన్న ఖాళీ బీర్ బాటిల్ ను అందుకుని వెనక నుంచి బలంగా బాటిల్ ను బస్సు అద్దం పగులేలా కొట్టడంతో బస్సులో ఉన్నవారితో సహా చుట్టుపక్కల వాళ్లంతా ఒక్కసారిగా భయబ్రాంతులకు గురయ్యారు.


డ్రైవర్ పై పాము విసిరి..

ఇక బస్సు ఆపిన వెంటనే బస్సు డ్రైవర్ తో గొడవ పెట్టుకున్న ఆ మహిళ తన సంచిలోనుంచి ఆగ్రహంతో వెంట తెచ్చుకున్న పామును డ్రైవర్ పై విసిరేసింది. ఊహించని షాక్ తో డ్రైవర్ ఆ పామును చేత్తో పక్కకు తోసేశాడు. వెంటనే బస్సులో ఉన్న మహిళా కండెక్టర్ స్థానిక పోలీసులకు సమాచారం ఇచ్చింది. గతంలో ఎప్పుడూ ఈ తరహా పాము దాడులు జరగలేదని అంటున్నారంతా. ఇలాగైతే డ్రైవర్లు, కండెక్టర్లకు రక్షణ ఏముంటుందని ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికైనా సీసీ ఫుటేజ్ ఆధారంగా ఆ మహిళను గుర్తించి శిక్షించాలని పోలీసులను ప్రణాణికులు కోరుతున్నారు.

Related News

Tejaswini Nandamuri: నందమూరి వారసురాలు వైరల్ యాడ్ డైరెక్టర్ ఎవరో తెలుసా? ఇంత బ్యాక్గ్రౌండ్ ఉందా?

Film industry: ఘనంగా సినిమాటిక్ ఎక్స్ పో 3వ ఎడిషన్!

CM Revanth on Movie Tickets: సినిమా టికెట్ డబ్బుల్లో సినీ కార్మికులకు వాటా… సీఎం సంచలన ప్రకటన

Bandla Ganesh: బండ్ల గణేష్ ఇల్లు చూడండి.. ఎంత అద్భుతంగా ఉందో!

Telugu Heroes : సినిమాలతో పాటు హోటల్స్… లగ్జరీ రెస్టారెంట్స్ ఉన్న హీరోలు వీళ్లే

Salman Khan: పాక్ ను కెలికిన సల్లు భాయ్.. తెలుగు సినిమాలు బాగా చూస్తారంటూ..

Siva Jyothi: బేబీబంప్ తో పెళ్లి పీటలు ఎక్కిన శివ జ్యోతి.. ఇలా కూడా చేస్తారా?

Kantara 2: వైకల్యాన్ని జయిస్తూ.. నోటితోనే కాంతార బిజీఎం!

Big Stories

×