NTRNeel: మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ లైనప్ చూసి అభిమానులు పిచ్చెక్కిపోతున్నారు. ఒకదాని తరువాత ఒకటి.. గ్యాప్ కూడా లేకుండా బాక్సాఫీస్ పై దండయాత్ర ప్రకటిస్తున్నాడు. ఇప్పటికే దేవర షూటింగ్ ఫైనల్ స్టేజికి వచ్చింది. ఇక ఈ సినిమా సెప్టెంబర్ 27 న రిలీజ్ కు రెడీ అవుతుంది. ఇది కాకుండా ఇంకోపక్క బాలీవుడ్ లో వార్ 2 ను మొదలుపెట్టారు.
హృతిక్ రోషన్, ఎన్టీఆర్ మల్టీస్టారర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమా సైతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. వచ్చే ఏడాదిలో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇకపోతే ఈ రెండు సినిమాలు కాకుండా ఎన్టీఆర్ నటిస్తున్న మరో చిత్రం ఎన్టీఆర్31. కెజిఎఫ్ ఫేమ్ ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తుంది. సలార్ తరువాత ప్రకటించిన సినిమా ఇది. ప్రశాంత్ సలార్ తో బిజీగా ఉండడంతో.. ఎన్టీఆర్ కొంత గ్యాప్ ఇచ్చాడు.
ఇక ఇంకోపక్క నీల్ సైతం వరుస సినిమాలతో బిజీగా మారాడ. ఈ మధ్యనే కోలీవుడ్ లో అజిత్ తో నీల్ ఒక సినిమా చేస్తున్నాడని వార్తలు గుప్పుమన్నాయి. ఆ సినిమాను మొదలుపెట్టే లోపులో.. ఎన్టీఆర్31 ను ఫినిష్ చేయాలనీ చూస్తున్నాడట. ఇకపోతే ఇన్నాళ్లకు ఎన్టీఆర్ – నీల్ సినిమా సెట్స్ మీదకు వచ్చే సమయం ఆసన్నమైంది.
అందుతున్నసమాచారం ప్రకారం.. మైత్రీ మూవీ మేకర్స్ ఎన్టీఆర్31 కోసం కొత్త ఆఫీస్ ను ఓపెన్ చేశారంట. దీని ఓపెనింగ్ ఆగస్టు 9 న జరగనుంది. అయితే అదే ఆఫీస్ లో ఎన్టీఆర్31 ఓపెనింగ్ వేడుక ఉంటుందా.. ? లేక మరెక్కడైనా ప్లాన్ చేస్తారా.. ? అనేది తెలియదు కానీ, ఆగస్టు 9 న మాత్రం ఎన్టీఆర్31 ఓపెనింగ్ వేడుక కచ్చితంగా ఉండనుందని తెలుస్తోంది. ఎలాగూ.. దేవర షూటింగ్ ఫైనల్ కు వచ్చింది. దాన్ని ముంగించేసి.. ఎన్టీఆర్.. నీల్ సినిమాకే పరిమితం అవ్వాలని చూస్తున్నాడట. ఇక ఇదే మంచి సమయం అనుకోని ఆగస్టు 9 న పూజా కార్యక్రమాలు పెట్టుకున్నారని టాక్. మరి ఇందులో నిజమెంత అనేది తెలియాలంటే మైత్రీ అఫిషీయల్ గా అనౌన్స్ చేసేవరకు ఆగాల్సిందే.