BigTV English

Jr Ntr: ఎండలో మిమ్మల్ని కష్టపెట్టడం ఇష్టం లేదు, త్వరలోనే మిమ్మల్ని కలుసుకుంటాను

Jr Ntr: ఎండలో మిమ్మల్ని కష్టపెట్టడం ఇష్టం లేదు, త్వరలోనే మిమ్మల్ని కలుసుకుంటాను

Jr Ntr: ప్రతి ప్రేక్షకుడికి తన అభిమాన హీరోని కలుసుకోవాలి అని కోరిక ఉండడం సహజంగా జరుగుతుంది. అయితే ఈ రోజుల్లో అంతమంది అభిమానుల్ని ఒక స్టార్ హీరో కలవడం అనేది మామూలు విషయం కాదు. కొన్ని సందర్భాలలో అభిమాన హీరోలు ఫోటోషూట్స్ పెట్టి వాళ్ళ అభిమానులకి ఫోటోలు ఇస్తూ ఉంటారు. అయితే ఇప్పుడున్న స్టార్ హీరోలంతా తమ పనుల్లో బిజీ అయిపోయారు. చాలామందికి నిల్చోని ఫోటోలు ఇవ్వడం అనేది ఒక మామూలు విషయం కాదు. ఇక ప్రస్తుతం ఎన్టీఆర్ విషయానికి వస్తే కేవలం తెలుగులో మాత్రమే కాకుండా ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు సాధించుకున్నాడు. ఒకవేళ ఎన్టీఆర్ తన అభిమానుల్ని కలుస్తాడు. అని వార్త విన్న వెంటనే ఎక్కడెక్కడ నుంచో తన కోసం తరలి వస్తారు అని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.


గతంలో అభిమానులను కలిసిన ఎన్టీఆర్

గతంలో చాలా సందర్భాలలో తన అభిమానులందరికీ ఫోటోలు ఇచ్చాడు ఎన్టీఆర్. అలానే కలవలేని వారితో ఫోన్ మాట్లాడిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఎవరైనా ఆపదలో ఉన్నారు చూడాలి అనుకుంటున్నారు అనుకున్న తరుణంలో ఎన్టీఆర్ వాళ్లని డైరెక్ట్ గా వెళ్లి కలిసిన దాఖలాలు కూడా ఉన్నాయి. అయితే ఎన్టీఆర్ తన అభిమానుల్ని కలిసి చాలా రోజులు అయింది కాబట్టి దాని గురించి మరోసారి అర్జున్ సన్నాఫ్ వైజయంతి మూవీ ట్రైలర్ ఈవెంట్లో క్లారిటీ ఇచ్చాడు. మిమ్మల్ని అందరిని కలిసి చాలా రోజులైంది. ఈ ఎండలో మిమ్మల్ని కష్టపెట్టడం ఇష్టం లేక నేను కలవడం లేదు. పగడ్బందీగా ప్లాన్ చేసుకొని మిమ్మల్ని అందరిని ఒకేసారి కలుస్తాను. కలిసి కాసేపు మాట్లాడుకుందాం అంటూ ఎన్టీఆర్ ఫోటోషూట్ గురించి క్లారిటీ ఇచ్చారు. ఏదేమైనా దానికి ఎక్కువ రోజులు టైం తీసుకోకుండా చాలా ప్లాన్ చేసి ఈ ఏడాది కలిసే విధంగా ఉంటుంది అంటూ ఎన్టీఆర్ అభిమానులకు భరోసా ఇచ్చారు. ఎన్టీఆర్ తన మాటల్లో ఈ విషయాన్ని అయితే చెప్పారు గానీ అది సాధ్యమైన పని కాదు అని చెప్పాలి. ఎందుకంటే అభిమానులు ఏ రేంజ్ లో ఉన్నారు ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు.


ఎన్టీఆర్ మాటల్లో విజయశాంతి గురించి

నటి విజయశాంతి గురించి మాట్లాడుతూ చాలామంది తెలుగు హీరోలు పక్కన నిలుచుని లేడీ సూపర్ స్టార్ ఆవిడ అంటూ చెప్పుకొచ్చారు. చాలామంది హీరోలుగా రాణిస్తున్న తరుణంలో ఒక మహిళా వచ్చి హీరోలకి పోటీగా నిలబడి సక్సెస్ సాధించడం అనేది మామూలు విషయం కాదు అంటూ ఎన్టీఆర్ తెలిపారు. కేవలం తెలుగు సినిమా పరిశ్రమ మాత్రమే కాకుండా ఇండియన్ ఇండస్ట్రీ మొత్తం గర్వపడేవాల్సిన నటి విజయశాంతి గారు అంటూ ప్రశంసలు కురిపించారు. ఇక ప్రస్తుతం ఎన్టీఆర్ మాట్లాడిన మాటలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. అలానే వార్ 2 సినిమా కూడా బాగుంటుంది అని మీ అందరికీ నచ్చుతుంది అంటూ ఆశిస్తున్నాను అంటూ తెలిపారు.

Also Read: Arjun S/o Vyjayanthi Movie Pre release event : నన్ను గారు అని పిలవద్దు అమ్మ – ఎన్టీఆర్

Related News

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Ali Wife : కొత్త బిజినెస్ మొదలుపెట్టిన అలీ వైఫ్ జుబేదా…మీ సపోర్ట్ కావాలంటూ?

Big Stories

×