Lionel Messi: అర్జెంటీనా.. ఈ దేశం పేరు వినిపించగానే మనకు ముందుగా గుర్తొచ్చేది లియోనెల్ మెస్సి ( Lionel Messi ). ఇతడి పేరు వింటే సాకర్ ప్రపంచం పూనకాలతో ఊగిపోతుంది. మెస్సి ఆట ప్రత్యక్షంగా చూడాలనుకునే వారు లక్షల్లో ఉంటారు. ప్రపంచవ్యాప్తంగా కోట్లాదిమంది ఇతడిని అభిమానిస్తుంటారు. అతడి ఆట అలా ఉంటుంది మరి. ప్రస్తుత ఫుట్ బాల్ గేమ్ లో ఇతను ఒక సంచలనం. టాప్ ప్లేయర్లలో ఒకరు. మెస్సీ తన కెరీర్ లో ఎన్నో గోల్స్ కొట్టి.. ఎంతో ఖ్యాతిని సంపాదించాడు. ఎన్నో అవార్డులతో పాటు ఎన్నో రివార్డులు మెస్సీ సొంతం.
Also Read: Glenn Phillips: గుజరాత్ కు బిగ్ షాక్… డేంజర్ ప్లేయర్ అవుట్
రిటైర్మెంట్ ప్రకటించకుండానే దిగ్గజ ఆటగాడిగా పేరు సంపాదించాడు. ఇక అతడి కొడుకు థియాగో మెస్సి కూడా అతడి జాడల్లోనే నడుస్తున్నాడు. 12 సంవత్సరాల వయసులో రికార్డ్స్ బద్దలు కొడుతున్నాడు. అండర్ 13 టోర్నీలో ఏకంగా 11 గోల్స్ కొట్టి.. ఒక్కసారిగా ప్రపంచ దృష్టిని తన వైపుకు తిప్పుకున్నాడు. కాగా ఫుట్ బాల్ ప్లేయర్ క్రిస్టియానో రోనాల్డో, లియోనెల్ మెస్సి సమవుజ్జీలుగా ఉంటారు. క్రిస్టియానో తరహాలో మెస్సి కి కూడా భారీ ఫాలోయింగ్ ఉంది. మెస్సి కనిపించాడంటే అభిమానులు అతడి ఆటోగ్రాఫ్, అతనితో షేక్ హ్యాండ్ ఇచ్చేందుకు పోటీ పడతారు.
అయితే మెస్సి దరిదాపుల్లోకి వెళ్లాలంటే అతడి బాడీగార్డ్ యాస్సిన్ చూకోను దాటుకొని వెళ్లాల్సిందే. కానీ అతడిని దాటుకుని మెస్సి దగ్గరకు చేరడం చాలా కష్టం. ఎందుకంటే మెస్సీకి రక్షణ కల్పించే విషయంలో చూకో ఎప్పుడూ అలర్ట్ గా ఉంటాడు. మెస్సీ మైదానంలో ఉన్న సమయంలో లేదా బయట అతనితో షేక్ హ్యాండ్ ఇచ్చేందుకు, సెల్ఫీ దిగేందుకు ఫ్యాన్స్ పరుగులు పెట్టుకుంటూ వస్తారు. వారిని మెస్సి దరిదాపుల్లోకి కూడా చేరకుండా చూకో రక్షణ కల్పిస్తుంటాడు. ఇలా మెస్సి బాడీగార్డ్ కి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ వీడియోను చూసిన నెటిజెన్లు యాసిన్ చూకో పట్ల ప్రశంసలు కురిపిస్తున్నారు.
Also Read: Glenn Phillips: గుజరాత్ కు బిగ్ షాక్… డేంజర్ ప్లేయర్ అవుట్
మెస్సికి బాడీగార్డ్ గా ఉన్న ఈ చూ కో.. ఇరాక్, ఆఫ్ఘనిస్తాన్ లలో నేవీ సీల్ గా పనిచేసిన మాజీ యూఎస్ సైనికుడు. ఇంటర్ మయామీ క్లబ్ ప్రెసిడెంట్ డేవిడ్ బెక్ హోం వ్యక్తిగత సిఫార్సును అనుకరించి మెస్సికి బాడీగార్డ్ గా చూకో నియమించబడ్డారని నివేదికలు పేర్కొంటున్నాయి. చూకో తన ఇంస్టాగ్రామ్ ఖాతా లో బాక్సింగ్, మార్షల్ ఆర్ట్స్ శిక్షణ నియామకాలను వివరించే వీడియోలను షేర్ చేస్తుంటాడు. ఇక మెస్సి నికర విలువ 600 మిలియన్ డాలర్లు.. అంటే భారత కరెన్సీలో రూ. 4442 కోట్లు. మెస్సీ తన కెరీర్ లో ఒక బిలియన్ కంటే ఎక్కువ సంపాదించాడు. అలాగే బార్సిలోనా శివార్లలో అతడికి ఏడు మిలియన్ల భవనంతో సహా అనేక విలాసవంతమైన ఆస్తులు కూడా ఉన్నాయి.
?utm_source=ig_embed&utm_campaign=loading" data-instgrm-version="14">