Arjun S/o Vyjayanthi Movie Pre release event : ప్రస్తుతం తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ఉన్న స్టార్ హీరోల్లో ఎన్టీఆర్ ఒకరు అని ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. మొదటి సినిమా ఊహించిన సక్సెస్ ఇవ్వకపోయినా కూడా స్టూడెంట్ నెంబర్ వన్ సినిమాతో తనలో ఉన్న టాలెంట్ బయటపెట్టి అతి చిన్న ఏజ్ లోనే మంచి స్టార్ కమర్షియల్ ఇమేజ్ సొంతం చేసుకున్నాడు ఎన్టీఆర్. ఎన్టీఆర్ కెరియర్ లో ఎన్ని సినిమాలు ఉన్నా కూడా రాజమౌళి వివి వినాయక్ దర్శకత్వంలో చేసిన సినిమాలు మాత్రం మంచి సక్సెస్ అందించాయి. అప్పట్లో వచ్చే ఫ్యాక్షన్ సినిమాల్లో ఎన్టీఆర్ ఇచ్చే పర్ఫామెన్స్ నెక్స్ట్ లెవెల్ లో అనిపించేది. అదే ట్రీట్ కొన్ని సంవత్సరాలు తర్వాత త్రివిక్రమ్ శ్రీనివాస్ అరవింద సమేత వీర రాఘవ అనే సినిమాతో అందించారు. ఇక ఎన్టీఆర్ గురించి ప్రస్తావన వస్తే టెంపర్ సినిమాకి ముందు టెంపర్ సినిమా తర్వాత అని చెప్పాలి. టెంపర్ సినిమా తర్వాత ఎన్టీఆర్ చేసిన ప్రతి సినిమా మంచి సక్సెస్ సాధించింది.
టెంపర్ తర్వాత
టెంపర్ తర్వాత ఫెయిల్యూర్ డైరెక్టర్ తో హిట్ సినిమా కూడా ఆ సినిమా మంచి సక్సెస్ సాధించింది. ఒక తరుణంలో కేవలం సక్సెస్ఫుల్ డైరెక్టర్ తో మాత్రమే సినిమాలు చేసి వరుస ఫెయిల్యూర్ చూశాడు ఎన్టీఆర్. తర్వాత తర్వాత తన ఆలోచనలో మార్పు వచ్చింది. ఒక డైరెక్టర్ కి ఫెయిల్యూర్ సినిమా వచ్చిన వెంటనే ఆ డైరెక్టర్ తో సినిమా చేసి సక్సెస్ సాధించాడు. బాబి, సుకుమార్, త్రివిక్రమ్ శ్రీనివాస్, కొరటాల శివ వంటి దర్శకులతో సక్సెస్ కొట్టించాడు. ఇక ప్రస్తుతం ఎన్టీఆర్ ఇమేజ్ ఏ రేంజ్ లో ఉందో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. ప్రపంచవ్యాప్తంగా ఎన్టీఆర్ కి గుర్తింపు లభించింది. త్రిబుల్ ఆర్ సినిమా తర్వాత ఎన్టీఆర్ రేంజ్ మారిపోయింది. రీసెంట్ గా కూడా దేవరా సినిమాతో మంచి సక్సెస్ సాధించాడు. ప్రస్తుతం ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో సినిమా చేస్తున్నాడు ఎన్టీఆర్.
ఎంత ఎదిగిన ఒదిగి ఉన్నాడు
ఇక ప్రస్తుతం కళ్యాణ్ రామ్, విజయశాంతి కలిసి నటించిన సినిమా అర్జున్ సన్నాఫ్ వైజయంతి. ఈ సినిమా ఏప్రిల్ 18న విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ తరుణంలో ఈ సినిమాకి సంబంధించిన ట్రైలర్ ఈవెంట్ను నిర్వహించింది చిత్ర యూనిట్. ఈ ఈవెంట్లో విజయశాంతి మాట్లాడుతూ ఎన్టీఆర్ గారు అంటూ సంబోధించారు. వెంటనే ఎన్టీఆర్ ఆ మాటకు విజయశాంతి దగ్గరికి వెళ్లి ఎన్టీఆర్ గారు అని నన్ను పిలవకండి అమ్మ అంటూ చెప్పుకోచ్చారు. ఎంత గుర్తింపు వచ్చినా కూడా తనని ఒక పెద్ద వ్యక్తితో గారు అనిపించుకోకుండా ఉండటమే తన ఉద్దేశమని క్లియర్ గా అర్థమవుతుంది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారుతుంది. ఈ వీడియోని చూసి చాలామంది ఎన్టీఆర్ అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అది మా హీరో అంటూ ఎలివేషన్ పోస్ట్ వేస్తున్నారు.
Also Read : Arjun S/o Vyjayanthi Movie Pre release event : ముందు ఈ సినిమా నేను చేయకూడదు అనుకున్నాను – విజయ శాంతి