BigTV English

Jr NTR : హామీ ఇచ్చి మాట తప్పిన ఎన్టీఆర్… అభిమాని తల్లి ఆవేదన

Jr NTR : హామీ ఇచ్చి మాట తప్పిన ఎన్టీఆర్… అభిమాని తల్లి ఆవేదన

Jr NTR :టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో యంగ్ టైగర్ గా గుర్తింపు తెచ్చుకున్న ఎన్టీఆర్ (NTR).. అద్భుతమైన నటనతో, డాన్స్ పెర్ఫార్మెన్స్ తో భారీ పాపులారిటీ అందుకున్నారు. ముఖ్యంగా ఎన్టీఆర్ కి దేశవ్యాప్తంగా భాషతో సంబంధం లేకుండా ప్రత్యేక ఫ్యాన్ బేస్ ఉంది. దేశవ్యాప్తంగా ఎన్టీఆర్ ను అభిమానించే వారి సంఖ్య కూడా పెరుగుతోంది. ఇలాంటి సమయంలో ఒక అభిమాని తల్లి ఎన్టీఆర్ పై చేసిన కామెంట్లు వైరల్ గా మారుతున్నాయి. “ఎన్టీఆర్ ఇచ్చిన మాట తప్పాడు” అంటూ ఎన్టీఆర్ అభిమాని తల్లి ఆవేదన వ్యక్తం చేస్తోంది. ఈ విషయం తెలిసి ప్రతి ఒక్కరు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. కష్టం వచ్చిన అభిమానికి అండగా నిలిచే ఎన్టీఆర్ మాట తప్పడం ఏంటి? అంటూ ప్రశ్నలు సంధిస్తున్నారు. అసలు ఏం జరిగిందో ఇప్పుడు చూద్దాం.


అభిమాని విషయంలో మాట తప్పిన ఎన్టీఆర్..

కౌశిక్ అనే జూనియర్ ఎన్టీఆర్ అభిమాని క్యాన్సర్ తో బాధపడుతున్నారు. చావు బ్రతుకుల మధ్య ఉన్న అతడిని ఆదుకుంటానంటూ జూనియర్ ఎన్టీఆర్ హామీ ఇచ్చారట. అటు ప్రభుత్వం, ఇటు టీటీడీ ఆర్థిక సహాయంతో చికిత్స కొనసాగిస్తున్నారు. ప్రస్తుతం కౌశిక్ చెన్నై అపోలో హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు. అయితే గతంలో తన కొడుకుకి సహాయం చేస్తానని, అండగా నిలుస్తానని హామీ ఇచ్చిన ఎన్టీఆర్, కనీసం రక్త సాయం లేదా రక్తదానం చేయించమని అడిగినా సరే పట్టించుకోలేదని కౌశిక్ తల్లి సరస్వతి ఆవేదన వ్యక్తం చేస్తోంది.


రూ.20 లక్షల హాస్పిటల్ ఫీజు చెల్లించాలని కౌశిక్ తల్లి ఆవేదన

అంతేకాదు జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ అధ్యక్షుడు కృష్ణ యాదవ్ (Krishna Yadav)తో పాటు జూనియర్ ఎన్టీఆర్ కార్యాలయ సిబ్బందికి ఫోన్ చేసినా సరే ఎటువంటి స్పందన లేదని బాధపడుతోంది సరస్వతి. ఇకపోతే ప్రస్తుతం కౌశిక్ చికిత్స కోసం 20 లక్షల రూపాయల ఆసుపత్రి ఫీజులు చెల్లించాల్సి ఉండగా.. దానికోసం అవస్థ పడుతున్నామని, కనీసం ఇప్పటికైనా జూనియర్ ఎన్టీఆర్ స్పందించాలని ఆమె కోరుతోంది. ఏది ఏమైనా కౌశిక్ తల్లి సరస్వతి ఆవేదన చూసి ప్రతి ఒక్కరూ కంటతడి పెట్టుకుంటున్నారు. కనీసం ఇప్పటికైనా ఈ విషయాన్ని జూనియర్ ఎన్టీఆర్ వరకు చేరవేయాలని, ఆయన కచ్చితంగా స్పందిస్తారని ఎన్టీఆర్ అభిమానులు కామెంట్లు చేస్తూ ఉండడం గమనార్హం.

అసలేం జరిగిందంటే..?

అసలు విషయంలోకి వెళ్తే.. బోన్ క్యాన్సర్ తో బాధపడుతున్న ఎన్టీఆర్ అభిమాని కౌశిక్.. “నా అభిమాన హీరో ఎన్టీఆర్ నటిస్తున్న దేవర సినిమా విడుదల అయ్యే వరకైనా నన్ను బ్రతికించండి” అంటూ వైద్యులను వేడుకున్నారు. ఈ విషయాన్ని అతడి తల్లిదండ్రులు మీడియా సమావేశంలో వెల్లడిస్తూ కన్నీరు పెట్టుకున్నారు. ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో ఎన్టీఆర్ వరకు చేరింది. దీంతో ఎన్టీఆర్ స్పందించారు. ఆసుపత్రిలో క్యాన్సర్ కు చికిత్స తీసుకుంటున్న కౌశిక్ తో ఎన్టీఆర్ వీడియో కాల్ ద్వారా మాట్లాడారు. ఎన్టీఆర్ ను చూడగానే కౌశిక్ ఒక్కసారిగా ఆనందంతో ఉబ్బితబ్బిబైపోయారు. ఎన్టీఆర్ ను చూసి కౌశిక్ మాట్లాడుతూ..” అసలు మిమ్మల్ని చూస్తానని నా కలలో కూడా అనుకోలేదన్నా” అంటూ సంబరపడ్డారు. దీంతో ఎన్టీఆర్.” నవ్వుతూ ఉంటే బాగున్నావ్.. ఎలా ఉన్నావు? ” అంటూ ఆరా తీశారు. దీంతో ధైర్యంగా ఉన్నానని, చికిత్స పూర్తి చేసుకుని బయటకు వస్తానని నమ్మకంగా కౌశిక్ తెలిపారు. అదే సమయంలో చికిత్సకు సహాయం చేస్తామని ఎన్టీఆర్ తెలిపినట్లు సమాచారం. ఇక ఇప్పుడు ఇచ్చిన మాట తప్పారని కౌశిక్ తల్లి ఆవేదన వ్యక్తం చేస్తోంది.

Related News

Film industry: కన్న తండ్రే కసాయి.. కొట్టి ఆ గాయాలపై కారం పూసేవాడు.. హీరోయిన్ ఆవేదన!

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Big Stories

×