Parliament Ambedkar Row: కేంద్ర హోంమంత్రి అమిత్ షా రాజీనామా చేసి దేశ ప్రజలను క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు తెలంగాణ కాంగ్రెస్ ఇన్‌ఛార్జ్ దీపాదాస్ మున్షీ. అమిత్ షా వ్యాఖ్యలతో ఎస్సీ, ఎస్టీ, ఓబీసీల గుండెల్లో గాయమైంద న్నారు. ఇది కేవలం ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ ల విషయం కాదని, ఆ వర్గాలు అంబేద్కర్‌ను దేవుడిగా భావిస్తున్నాయని గుర్తు చేశారు.
సోమవారం మధ్యాహ్నం గాంధీభవన్‌లో మాట్లాడిన ఆమె, అమిత్ షా వ్యాఖ్యలకు నిరసనగా ‘అంబేద్కర్ సమ్మాన్ సప్తాహ’ నిర్వహిస్తున్నట్లు చెప్పుకొచ్చారు. ప్రతి జిల్లా హెడ్ క్వార్టర్‌లో అంబేద్కర్ విగ్రహాలకు పూలమాల వేసి అమిత్ షాని బర్తరఫ్ చేయాలని కోరుతూ జిల్లా కలెక్టర్లను కలుస్తామన్నారు.
అమిత్ షా వ్యాఖ్యలతో రాజ్యాంగాన్ని బీజేపీ తొలగించాలన్న విషయం మరోసారి బట్టబయలైందన్నారు మున్షీ. బీజేపీ సర్కార్‌లో జరిగిన అవినీతిపై ప్రశ్నించి చర్చ చేయాలని కోరితే, ఆ ఇష్యూ డైవర్ట్ చేయడానికి ఇలాంటి విషయాలు తెరపైకి తెస్తున్నారని వెల్లడించారు.
2007లో కర్మయోగి అనే బుక్లెట్ నరేంద్రమోడీ రాసిన కొన్ని విషయాలు వివరించారామె. దేశమంతా మాన్యువల్ స్కావెంజింగ్ ఆపాలని కోరుతుంటే.. మోదీ మాత్రం తల మీద మానవ వ్యర్థాలు మోసే విధానం (మాన్యువల్ స్కావెంజింగ్)ని దేవుడి సేవగా అభివర్ణించారని అన్నారు.
ALSO READ: : మాజీ ప్రధాని పీవీకి నేతల నివాళి, సేవలు మరువలేం
2010లో సామాజిక్ సంరస్థ అనే పుస్తకంలో ఎస్సీలను దారుణంగా అవమానించిన విషయాన్ని వివరించారు. ఇది ముమ్మాటికీ తప్పుగా వర్ణించారు. రోహిత్ వేముల ఆత్మహత్య విషయాన్ని సైతం ప్రస్తావించారు. సమాజంలో అసమానతలు ఉన్నపుడు రోహిత్ వేముల లాంటి వాళ్లు ఆత్మస్థైర్యం చేసుకోవాల్సి వస్తుందన్నారు. మోదీ ఆలోచన- బీజేపీ ఆర్‌ఎస్‌ఎస్ ఆలోచన విధానం రెండూ ఒక్కటేనన్నారు.