BigTV English

Devara 2: ఎన్టీఆర్ దేవర 2 కోసం మేకర్స్ కష్టపడాల్సిందేనా?

Devara 2: ఎన్టీఆర్ దేవర 2 కోసం మేకర్స్ కష్టపడాల్సిందేనా?

Devara 2:గత ఏడాది కొరటాల శివ (Koratala Shiva), జూనియర్ ఎన్టీఆర్ (Jr.NTR) కాంబినేషన్లో వచ్చిన భారీ బడ్జెట్ పాన్ ఇండియా మూవీ ‘దేవర’.. గత ఏడాది సెప్టెంబర్ 27న వచ్చి సైలెంట్ గా హిట్ కొట్టిన ఈ సినిమా అనుకున్నంత బ్లాక్ బస్టర్ అయితే కాలేదు. సూర్యదేవర నాగ వంశీ (Surya Devara Nagavamsi)నిర్మాతగా వ్యవహరించిన ఈ సినిమాపై ప్రేక్షకులు భారీ అంచనాలు పెట్టుకొని థియేటర్ కి వెళ్లారు. కానీ బెనిఫిట్ షో చూశాక నందమూరి ఫ్యాన్స్, ఎన్టీఆర్ వీరాభిమానులు కూడా అసహనంతో పెదవి విరిచారు. అసలు ఈ సినిమాను ఎన్టీఆర్ ఎందుకు ఒప్పుకున్నారా? అని మాట్లాడుకున్నారు.


నెగిటివ్ టాక్ వచ్చినా 100 రోజులు పూర్తి..

అయితే బెనిఫిట్ షోతో దేవర-1కి నెగటివ్ టాక్ వచ్చింది. కానీ ఆ తర్వాత మెల్లిమెల్లిగా సినిమా అందరికీ ఎక్కేసింది. ఆ తర్వాత సినిమా చూడడానికి జనాలు ఎగబడ్డారు. అయితే అనుకున్నంత హిట్ కాకపోయినప్పటికీ,యావరేజ్ టాక్ మాత్రం వచ్చింది. అలా ఈ సినిమా రూ.500 కోట్ల కలెక్షన్స్ ని అందుకుంది. అయితే రీసెంట్ గానే ఈ సినిమా వంద రోజులు పూర్తి చేసుకున్న సంగతి మనకు తెలిసిందే.


పార్ట్ 2 అవసరమా అంటూ కామెంట్స్..

దాంతో సైలెంట్ గా దేవర తన పని కానిచ్చాడు అని అందరూ అనుకున్నారు.ఇక వంద రోజులు ఒకే గాని.. సినిమాకి అనుకున్నంత పేరైతే రాలేదు. దాంతో దేవర-2 అవసరమా? అని చాలామంది కొరటాల శివని సోషల్ మీడియా వేదికగా అడుగుతున్నారు. అయితే దేవర పార్ట్ 1 తో పాటు దేవర పార్ట్ 2 కూడా ఉంటుందని మేకర్స్ ముందుగానే చెప్పేశారు. అలా సినిమా చివర్లో ఓ చిన్న ట్విస్ట్ పెట్టి దేవర పార్ట్ 2 ని కూడా అనౌన్స్ చేశారు మేకర్స్. దీంతో దేవర 1 చూసిన చాలామంది నందమూరి ఫ్యాన్స్ కూడా దేవర -2 అవసరమా అంటూ అని కొరటాలను ప్రశ్నిస్తున్నారు. ఇక ఎవరు ఎన్ని అనుకున్నా కూడా దేవర -2 కచ్చితంగా వస్తుంది. కాబట్టి దేవర-2 ని ప్రేక్షకులు చూడాలంటే ఈ పని చేయాల్సిందే అంటూ కొంతమంది నెటిజన్స్ సోషల్ మీడియాలో కొరటాల శివకు సలహాలు ఇస్తున్నారు. ఇక దేవర-2 చూడాలి అంటే సినిమాలో యాక్షన్ సన్నివేశాలతో పాటు ఎమోషన్స్ సీన్స్ కూడా ఉండాలని,అలాగే హీరోయిన్ పాత్ర కూడా ఎక్కువగా ఉండాలి అని భావిస్తున్నారు.

పార్ట్ 2 లో అయినా జాన్వికి గుర్తింపు వస్తుందా..

మరో వైపు పార్ట్ -1 సినిమాలో బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ నటించింది. కానీ జాన్వీ కపూర్ కి అంత స్క్రీన్ స్పేస్ లేదు. దాంతో చాలామంది జాన్వీ ఫ్యాన్స్ కూడా నిరాశ పడ్డారు. ఇక దేవర 2 లో అయినా జాన్వీ కపూర్ కి స్క్రీన్ స్పేస్ ఎక్కువగా ఉండాలి అని, ఆమెకు డైలాగులు ఎక్కువగా ఉండాలి అని కోరుకుంటున్నారు. ఇప్పటికే దేవర 2 కి సంబంధించి స్క్రిప్ట్ వర్క్ మొదలు పెట్టేసారట కొరటాల శివ. ఈ ఏడాదిలో దీన్ని సెట్స్ పైకి తీసుకువెళ్లి వచ్చే ఏడాది రిలీజ్ చేయాలని చూస్తున్నారు మేకర్స్. అలాగే కొరటాల శివ పార్ట్-2 కోసం ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటున్నారట. పార్ట్ వన్ లో జరిగిన తప్పులు, పార్ట్ 2లో జరగకుండా ఎన్నో జాగ్రత్తలు తీసుకొని మరీ సినిమాని బాగా తెరకెక్కించాలని చూస్తున్నారట.

ప్రేక్షకులను మెప్పించాలంటే, మేకర్స్ కష్టపడాల్సిందే..

అయితే ఇప్పటికే పార్ట్ వన్ విడుదలయ్యాక సినిమాపై చాలా ట్రోల్స్ వచ్చాయి. అటు ఓటిటిలో కూడా చాలా ట్రోల్స్ వినిపించాయి. థియేటర్లలో కనిపించని మిస్టేక్స్ అన్ని ఓటిటిలో రిలీజ్ అయిన సమయంలో బయట పడ్డాయి. కానీ దేవర -2 విషయంలో మాత్రం కొరటాల శివ చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారట. మరి దేవర -2 నందమూరి ఫ్యాన్స్ ని అయినా మెప్పిస్తుందా లేదా అనేది ముందు ముందు తెలుస్తుంది. అందుకే దేవర 2 తో ప్రేక్షకులను మెప్పించాలి అంటే మేకర్స్ ఎంతో కష్టపడాల్సి ఉంటుందని సినీ విశ్లేషకులు కు సైతం కామెంట్లు చేస్తున్నారు.

Related News

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Big Stories

×