E-Paper
Advertisement

ESIC Jobs: 608 ఉద్యోగాలు.. జీతం అక్షరాల రూ.1,77,000.. వీళ్లందరూ అర్హులే..?

ESIC Jobs: 608 ఉద్యోగాలు.. జీతం అక్షరాల రూ.1,77,000.. వీళ్లందరూ అర్హులే..?

ESIC Jobs: ఎంబీబీఎస్ డిగ్రీ పాసైన అభ్యర్థులకు ఇది సువర్ణవకాశం. యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహించే కంబైన్డ్ మెడికల్ సర్వీస్ ఎగ్జామ్ పాసైన అభ్యర్థులకు శుభవార్త అనే చెప్పవచ్చు.  ఈఎస్ఐసీ మెడికల్ ఆఫీసర్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదలైంది. అర్హులైన అభ్యర్థులకు ఇది మంచి అవకాశం. ఈ సువర్ణవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి.

నిరుద్యోగులకు గుడ్ న్యూస్. న్యూఢిల్లీ ఎంప్లాయిస్ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్, హెడ్ క్వార్టర్స్.. దేశ వ్యాప్తంగా ఉన్న ఈఎస్ఐసీ డిస్పెన్సరీలు/ ఆస్పత్రుల్లో ఇన్సూరెన్స్ మెడికల్ ఆఫీసర్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ రిలీజైంది. అర్హత కలిగిన ఆసక్తి గల అభ్యర్థులు ఆన్ లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. నోటిఫికేషన్ పూర్తి వివరాలను డిటెయిల్‌డ్‌గా చూద్దాం.

మొత్తం ఉద్యోగాల సంఖ్య: 608

ఇన్సూరెన్స్ మెడికల్ ఆఫీసర్ గ్రేడ్-2 ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి. (యూఆర్-254, ఎస్సీ-63, ఎస్టీ-53, ఓబీసీ-178, ఈడబ్ల్యూఎస్-60 చొప్పున ఉద్యోగాలు వేకన్సీ ఉన్నాయి.)

విద్యార్హత: ఎంబీబీఎస్ డిగ్రీ అర్హతతో పాటు.. రోటేటింగ్ ఇంటర్న్ షిప్ కంప్లీట్ అయి ఉండాలి. యూపీఎస్సీ నిర్వహించే కంబైన్డ్ మెడికల్ సర్వీస్ ఎగ్జామినేషన్-2022/2023 డిస్ క్లోజర్ లిస్టులో ఎంపికైన అభ్యర్థులు మాత్రమే దరఖాస్తుకు చేసుకునేందుకు అర్హులు అవుతారు.

జీతం: రూ.56,100 నుంచి రూ.1,77,500 వరకు ఉంది.

వయస్సు: 2022 ఏప్రిల్ 4 నాటికి 35 ఏళ్ల వయస్సు దాటి ఉండకూడదు

దరఖాస్తు ముగింపు తేది: 2025 జనవరి 31

ఎంపిక విధానం: యూపీఎస్సీ నిర్వహించే కంబైన్డ్ మెడికల్ సర్వీస్ ఎగ్జామినేషన్-2022/2023 ఫలితాల్లో ప్రతిభ, రిజర్వేషన్ ఆధారంగా ఉద్యోగానికి సెలెక్ట్ చేస్తారు.

అఫీషియల్ వెబ్ సైట్: https://www.esic.gov.in/recruitments

Also Read: CSIR-CEERI Jobs: డిగ్రీ, డిప్లొమా పాసయ్యారా..? నెలకు స్టార్టింగ్ జీతమే.. రూ.57,000

జనవరి 31లోగా దరఖాస్తు ముగింపు తేది ఉంది. ఈ లోగా అర్హత ఉన్న అభ్యర్థులు అందరూ ఉద్యోగానికి అప్లై చేసుకోండి. ఉద్యోగాన్ని సాధించండి ఆల్ ది బెస్ట్.

Related News

టాప్ కంపెనీల్లో ప్లేస్‌మెంట్స్.. ICFAI హైదరాబాద్ 2026 అడ్మిషన్ల నోటిఫికేషన్ విడుదల

NEET Exam: నీట్ రీఎగ్జామ్ వ్యవహారం.. సుప్రీంకోర్టు కీలక తీర్పు

సీబీఎస్ఈ ఇంటర్‌లో ఆన్-స్క్రీన్ మార్కింగ్ వివాదం.. ఆ బాధ్యత నాదే-మంత్రి ధర్మేంద్ర ప్రధాన్

సీబీఎస్ఈ ఇంటర్ రీవాల్యుయేషన్‌.. 4 లక్షల మంది విద్యార్థులు అప్లై.. ఒకరి పేపర్లు మరొకరి, పేరెంట్స్ షాక్

ఇంటర్ విద్యార్థులకు అదిరిపోయే బ్రేక్‌ఫాస్ట్.. ఇడ్లీ మొదలు, జూన్ 12 నుంచి అమలు

AP EDCET 2026 Result: ఏపీ ఎడ్‌సెట్‌-2026 ఫలితాలు.. 99.3 శాతం ఉత్తీర్ణత, వారికి మంత్రి అభినందనలు

తెలంగాణలో ఎప్‌సెట్‌ ఫలితాలు-2026, కేవలం వారం రోజుల్లో, టాపర్స్ వీళ్లే

ఐఐటీ చేరేందుకు మరో పరీక్ష.. జేఈఈ అడ్వాన్సుడ్ నేడు, కొత్త మార్గదర్శకాలు

Big Stories

×