Ben Stokes: హామిల్టన్ లో న్యూజిలాండ్ తో జరిగిన మూడవ టెస్ట్ సమయంలో ఇంగ్లాండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్ గాయపడిన విషయం తెలిసిందే. దీంతో టీమ్ ఇండియాతో జరిగిన వైట్ బాల్ సిరీస్ కి దూరమయ్యాడు బెన్ స్టోక్స్. అలాగే ఫిబ్రవరి 19 నుండి ప్రారంభం కానున్న ఛాంపియన్స్ ట్రోఫీ – 2025 కి కూడా దూరం అయ్యాడు. ఈ గాయం కారణంగా కొద్ది రోజుల నుండి మైదానానికి దూరంగా ఉంటున్న స్టోక్స్ కి శస్త్ర చికిత్స పూర్తయింది.
Also Read: Younis Khan – Afghanistan: ఆఫ్ఘనిస్తాన్ కోసం రంగంలోకి పాకిస్తాన్ క్రికెటర్.. ఇక కప్పు గ్యారంటీ?
ఈ విషయాన్ని స్టోక్స్ సోషల్ మీడియా ద్వారా తెలియజేశాడు. ఈ సందర్భంగా తనని తాను బయోనిక్ మ్యాన్ గా అభివర్ణించుకున్నాడు. సర్జరీ విజయవంతంగా పూర్తి అయిందని పేర్కొన్నాడు. న్యూజిలాండ్ తో జరిగిన మూడవ టెస్ట్ లో గాయపడిన సందర్భంలోనే తొడ కండరాలకు గాయం అయిందని.. అతనికి శస్త్ర చికిత్స జరగనుందని ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు అధికారికంగా తెలిపింది. అయితే నిజానికి స్టోక్స్ కి 2024 ఆగస్టులోనే ఈ తొడ కండరాలకు గాయం అయ్యింది.
ఆ సమయంలో రెండు నెలలు ఆటకు దూరమయ్యాడు. ఆ తర్వాత శ్రీలంకతో జరిగిన హోమ్ టెస్ట్ కి మిస్ అయ్యాడు. ఇక న్యూజిలాండ్ పర్యటనలో మరోసారి తొడ కండరాల గాయం అతడిని వెంటాడింది. అయితే తాజాగా చికిత్స పూర్తయిందని అతడు తెలిపాడు. సర్జరీ కారణంగా మరో మూడు నెలల వరకు అతడు ఆటకి దూరం కానున్నాడు. ఈ నేపథ్యంలోనే ఛాంపియన్స్ ట్రోఫీ 2025 కోసం ప్రకటించిన ఇంగ్లాండ్ జట్టులో కూడా ఎంపిక కాలేదు. అలాగే 2025 ఐపీఎల్ సీజన్ లో కూడా స్టోక్స్ అందుబాటులో ఉండడం లేదు.
33 ఏళ్ల స్టోక్స్ తన కెరీర్ లో 110 టెస్ట్ మ్యాచ్ లు ఆడాడు. ఇందులో 6,719 పరుగులు చేశాడు. అత్యధిక పరుగులు 258 కాగా.. టెస్టుల్లో 13 సెంచరీలు, 35 హాఫ్ సెంచరీలు నమోదు చేశాడు. ఇక 114 వన్డేలు ఆడిన స్టోక్స్ 3,463 పరుగులు చేశాడు. ఇందులో అత్యధిక పరుగులు 182. ఇక వన్డేల్లో 5 సెంచరీలు, 24 హాఫ్ సెంచరీలు నమోదు చేశాడు. 43 టి-20 ల్లో 585 పరుగులు చేశాడు. ఇందులో 52 అత్యధిక పరుగులు కాగా.. టి20 ల్లో ఒక హాఫ్ సెంచరీ నమోదు చేశాడు.
Also Read: Indian Cricket Players: టీమిండియాలో పెంట పెట్టిన గిల్.. దక్షిణ భారతీయులకు అన్యాయం?
ఇక స్టోక్స్ ఐపీఎల్ కెరియర్ చూస్తే.. 45 మ్యాచ్లలో 935 పరుగులు చేసాడు. ఇందులో 107 హైయెస్ట్ స్కోర్. ఐపీఎల్ లో రెండు సెంచరీలు, రెండు హాఫ్ సెంచరీలు నమోదు చేశాడు. ఇక అతడి బౌలింగ్ కెరీర్ చూస్తే.. టెస్టుల్లో 210 వికెట్లు, వన్డేల్లో 74, టి-20 ల్లో 26, ఐపీఎల్ లో 28 వికెట్లు పడగొట్టాడు. ICC ఛాంపియన్స్ ట్రోఫీ 2025 కోసం పూర్తి ఇంగ్లాండ్ జట్టు: జోస్ బట్లర్ (కెప్టెన్), జోఫ్రా ఆర్చర్, గుస్ అట్కిన్సన్, జాకబ్ బెథెల్, హ్యారీ బ్రూక్, బ్రైడన్ కార్సే, బెన్ డకెట్, జామీ ఓవర్టన్, జామీ స్మిత్, లియామ్ లివింగ్‌స్టోన్, ఆదిల్ రషీద్, జో రూట్, సాకిబ్ మహమూద్, ఫిల్ సాల్ట్, మార్క్ వుడ్.