BigTV English

Anupama Parameswaran Insult: ఎన్టీఆర్ ముందే అనుపమకు అవమానం.. మరీ ఇంత దారుణమా?

Anupama Parameswaran Insult: ఎన్టీఆర్ ముందే అనుపమకు అవమానం.. మరీ ఇంత దారుణమా?
Anupama Parameswaran:
Anupama Parameswaran:

NTR Fans Insulted Anupama Parameswaran @ Tillu Square Success Meet: తెలుగు ప్రేక్షకుల అభిమానం ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఒక్కసారి ఒక హీరోను గుండెల్లో పెట్టుకున్నారు అంటే.. చచ్చేవరకు వారిని వదలరు. ఆ హీరో ఎలా అయినా ఉండని, ఎన్నీ ప్లాప్ లు తెచ్చుకొని.. ఆ అభిమానాన్ని మాత్రం ఫ్యాన్స్ వదులుకోరు. అయితే కొన్నిసార్లు ఫ్యాన్స్ మితిమీరిన అభిమానం చాలామందికి తలనొప్పిగా మారుతోంది. ముఖ్యంగా ఏదైనా ఈవెంట్స్ కు వెళ్ళినప్పుడు అయితే మరీ దారుణంగా తయారవుతున్నారు.


ఒకానొక సమయంలో ఇలాంటి పరిస్థితిని అల్లు అర్జున్ ఎదుర్కున్నాడు. అప్పుడే బన్నీ ఒక ఈవెంట్ లో ఒక డైలాగ్ చెప్పాడు. ఇలా వేరేవాళ్ల ఈవెంట్ కు వచ్చినప్పుడు తమ అభిమాన హీరో గురించి అడుగుతూ ఇబ్బంది పెడుతున్నారు. ఆ సమయంలో వాళ్లు మమ్మల్ని అడిగేది.. మా ఈవెంట్స్ లో మీవాళ్ల గోల ఏంటి బ్రదర్ అని. అందుకే ఎవరి ఈవెంట్ కు వస్తే వాళ్ల గురించే మాట్లాడాలి అని చెప్పుకొచ్చాడు. అయితే అప్పుడు బన్నీని ట్రోల్ చేశారు కానీ, ఇప్పుడు ఈ ఘటనను చూస్తే నిజమే అనిపిస్తుంది.

అసలు విషయం ఏంటంటే.. నేడు సిద్దు, అనుపమ జంటగా నటించిన టిల్లు స్క్వేర్ సక్సెస్ సెలబ్రేషన్స్ జరిగిన విషయం తెల్సిందే. ఈ వేడుకకు ఎన్టీఆర్ ముఖ్య అతిధిగా విచ్చేశాడు. ఎన్టీఆర్ రావడంతోనే స్టేజిమొత్తం దద్దరిల్లిపోయింది. అలా అవ్వడం, ఎన్టీఆర్, ఎన్టీఆర్ అని కేకలు పెట్టడం సర్వ సాధారణమే. అయితే ఇక్కడ ఎన్టీఆర్ ఫ్యాన్స్ మరీ దారుణంగా ప్రవర్తించారు.


Also Read: NTR: ఓవర్ గా చెప్పడం లేదు.. దేవర కు మీరందరూ కాలర్ ఎగరేస్తారు

స్టేజిమీద అనుపమ మాట్లాడడానికి వస్తే.. మాట్లాడొద్దు.. మాట్లాడొద్దు అంటూ అరిచారు. ఎన్టీఆర్ స్టేజి మీదకు రావాలని కేకలు పెట్టారు. దీంతో అనుపమ ముఖం చిన్నబుచ్చుకుంది. సినిమా హిట్ అయిన ఆనందంలో ఒక హీరోయిన్ గా ఆ ఆనందాన్ని పంచుకోవడానికి వచ్చిన ఆమెకు ఎన్టీఆర్ ఫ్యాన్స్ వలన అవమానం జరిగింది. ఆమె ఫ్యాన్స్ ను బతిమిలాడుతూ.. కనీసం రెండు నిముషాలు మాట్లాడుతాను అన్నకుండా సైలెంట్ గా ఉండకుండా గోల చేశారు.

చివరికి అనుపమ వెళ్లిపోవడానికి ప్రయత్నించగా.. సుమ అడ్డుకొని మాట్లాడమని చెప్పింది. ఒక్క నిమిషం అయినా మాట్లాడనివ్వమని కోరినా వారు వినకపోయేసరికి చిత్రబృందానికి థాంక్స్ చెప్పి వెళ్ళిపోయింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ గా మారింది. ఇదేనా ఒక హీరోయిన్ కు ఇచ్చే మర్యాద.. అని నెటిజన్స్ ఫైర్ అవుతున్నారు.

Related News

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Big Stories

×