BigTV English

NTR- Prashanth Neel movie Update: ఎన్టీఆర్ మూవీ కోసం రంగంలోకి దిగిన నటీనటులు, టెక్నీషియన్స్ వీళ్లే..!

NTR- Prashanth Neel movie Update: ఎన్టీఆర్ మూవీ కోసం రంగంలోకి దిగిన నటీనటులు, టెక్నీషియన్స్ వీళ్లే..!

NTR- Prashanth Neel movie Update:జూనియర్ ఎన్టీఆర్ (Jr. NTR), ప్రశాంత్ నీల్ (Prashanth Neel) కాంబోలో రాబోయే ఎన్టీఆర్ 31(NTR-31 ) సినిమా కోసం ఇప్పటికే చాలామంది ఎన్టీఆర్ అభిమానులతో పాటు ప్రశాంత్ నీల్ అభిమానులు కూడా వేచి చూస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించి పూజా కార్యక్రమాలు ఎప్పుడో జరుపుకోగా సినిమా మాత్రం ఇంకా సెట్స్ మీదకు వెళ్లడం లేదు.దానికి కారణం ఓవైపు ఎన్టీఆర్ గత సంవత్సరంలో ‘దేవర’తో బిజీగా ఉన్నారు. ఇక ఈ సినిమా విడుదలై రిజల్ట్ వచ్చిన వెంటనే బాలీవుడ్లోకి వెళ్లిపోయారు. ప్రస్తుతం బాలీవుడ్ లో జూనియర్ ఎన్టీఆర్, హృతిక్ రోషన్(Hrithik Roshan) తో కలిసి ‘వార్ -2’మూవీలో నెగిటివ్ పాత్రలో చేస్తున్న సంగతి మనకు తెలిసిందే. అలా వార్-2 (War-2) మూవీలో బిజీగా ఉన్న కారణంగా ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ కి డేట్స్ ఇవ్వలేకపోతున్నారట. కానీ ఎట్టకేలకు ఈ ఏడాది మాత్రం ఎన్టీఆర్ – ప్రశాంత్ నీల్ ల మూవీ సెట్స్ మీదకు వెళ్లబోతున్నట్టు తెలుస్తోంది. అన్నీ కలిసొస్తే ఈ సినిమా మరికొద్ది రోజుల్లోనే సెట్స్ మీదకు వెళ్లబోతున్నట్లు తెలుస్తోంది.


అయితే ఇప్పటికే ఈ సినిమాలో నటించే కథానాయిక గురించి,కొంతమంది టెక్నీషియన్ల గురించి చాలా రోజులుగా వార్తలు వినిపిస్తున్నాయి. కానీ తాజాగా మాత్రం ఈ సినిమాలో నటించే ఆర్టిస్టులు అలాగే మూవీకి పనిచేసే టెక్నీషియన్స్ వీళ్లే అంటూ సినీ వర్గాల నుండి కొన్ని వార్తలు వినిపిస్తున్నాయి.అంతేకాదు సినిమాకి సంబంధించి అందరూ ఫిక్స్ అయ్యారని కూడా తెలుస్తోంది. మరి ఇంతకీ ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ కాంబోలో రాబోయే సినిమాలో హీరోయిన్ ఎవరు..?టెక్నీషియన్స్ ఎవరు..? ఇందులో ఎవరెవరు నటించబోతున్నారు? అనేది ఇప్పుడు చూద్దాం..

ఎన్టీఆర్ కి జోడీగా కన్నడ బ్యూటీ..


ఎన్టీఆర్ మూవీ దేవర నెగిటివ్ టాక్ తో కూడా రూ.600 కోట్ల కలెక్షన్స్ వసూళ్లు చేయడం అంటే అది ఎన్టీఆర్ కే సాధ్యమని చెప్పుకోవచ్చు. ఎందుకంటే దేవర(Devara)ఎంత నెగటివ్ టాక్ వచ్చినా కూడా సైలెంట్గా రూ. 600 కోట్లు కొల్లగొట్టింది. ఇక దేవర సినిమా తర్వాత అందరి ఫోకస్ ప్రశాంత్ నీల్ డైరెక్షన్ లో రాబోయే సినిమా పైనే ఉంది.ఇక దేవర సినిమా విడుదలైన తర్వాత ఎన్టీఆర్ 31 మూవీలో హీరోయిన్గా కన్నడ బ్యూటీ రుక్మిణి వసంత్ (Rukmini Vasanth) నటిస్తున్నారని చాలా రోజుల నుండి వార్తలు వినిపిస్తున్నాయి. ఇక ఈ హీరోయిన్ పేరు ఎప్పుడైతే నెట్టింట వినిపించిందో అప్పటినుండి ఈ హీరోయిన్ కి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో మార్మోగిపోతున్నాయి.

ఎన్టీఆర్ 31 క్యాస్టింగ్, టెక్నీషియన్స్ వీరేనా?

ఇక హీరోయిన్ గా రుక్మిణి వసంత్ ఫిక్స్ అయిందని, అలాగే ఈ సినిమాకి మ్యూజిక్ రవి బస్రూర్ అందిస్తున్నారని చాలా రోజుల నుండి వార్తలు వినిపిస్తున్నాయి. అలాగే స్టంట్ కొరియోగ్రాఫర్ గా చేతన్ డిసౌజా, కెమెరామెన్ గా భువన్ గౌడ, ఎడిటర్ గా ఉజ్వల్ కులకర్ణి, ఆర్ట్ డైరెక్టర్ గా టియల్ వెంకట ఛలపతిలు ఈ సినిమాకి వర్క్ చేయబోతున్నట్టు సినీ వర్గాల నుండి టాక్ వినిపిస్తోంది. అలాగే ఈ మూవీలో మలయాళ నటులు బిజూ మీనన్, టోవినో థామస్ లు కూడా నటిస్తున్నట్టు సమాచారం. ఏది ఏమైనప్పటికీ ప్రస్తుతం సినీ వర్గాల నుండి వీళ్ళ పేర్లే ఎక్కువగా వినిపించడంతో ఈ విషయం తెలిసిన తెలుగు వాళ్ళు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఈ సినిమాకి ఎక్కువగా కన్నడ, మలయాళ ఇండస్ట్రీలకు చెందిన వాళ్లే వర్క్ చేస్తున్నారని, ఇందులో తెలుగు వాళ్ళకి అన్యాయం చేస్తున్నారని మాట్లాడుకుంటున్నారు. కానీ ఇది ఇంకా ఫైనల్ లిస్ట్ కాదు కాబట్టి ఇప్పుడే సినిమాపై అంత నెగటివ్ టాక్ తీసుకురావడం మంచిది కాదు అని ఎన్టీఆర్ అభిమానులు భావిస్తున్నారు. మరి చూడాలి ఈ సినిమాలో మనం పైన చెప్పుకున్న వాళ్లే ఫిక్స్ అవుతారా.. ? లేక వారి ప్లేసుల్లో వేరే వారిని ఎవరైనా తీసుకుంటారా? అనేది ముందు ముందు తెలుస్తుంది. ఇక ప్రశాంత్ నీల్ సన్నిహితుల నుండి వినిపిస్తున్న సమాచారం ప్రకారం..ఎన్టీఆర్ 31(Ntr-31) మూవీ ఫిబ్రవరి చివరిలో సెట్స్ మీదకు వెళ్లబోతున్నట్టు తెలుస్తోంది.

Tags

Related News

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Big Stories

×