Rashmika Mandanna: ప్రస్తుతం సౌత్, నార్త్ అన్నీ చుట్టేస్తూ పాన్ ఇండియా రేంజ్ పాపులారిటీ సంపాదించుకున్న హీరోయిన్ ఎవరు అంటే చాలామంది టక్కున గుర్తొచ్చే పేరు రష్మిక మందనా. మామూలుగా సౌత్ నుండి నార్త్‌కు వెళ్లిన ముద్దుగుమ్మలు అక్కడ సక్సెస్ సాధించిన తర్వాత పూర్తిగా అక్కడే సెటిల్ అయిపోతుంటారు. కానీ రష్మిక అలా కాదు.. సౌత్, నార్త్ రెండిటినీ పర్ఫెక్ట్‌గా బ్యాలెన్స్ చేస్తోంది. అందుకే పాన్ ఇండియా హీరోయిన్ అనే ట్యాగ్‌ను సంపాదించుకుంది. ప్రస్తుతం రష్మిక.. తన అప్‌కమింగ్ మూవీ ‘ఛావా’ ప్రమోషన్స్‌లో బిజీగా గడిపేస్తోంది. తాజాగా ఈ మూవీ నుండి ఒక సాంగ్‌ను లాంచ్ చేయడం కోసం మేకర్స్ అంతా హైదరాబాద్‌లో అడుగుపెట్టారు.
తెలుగు పాఠాలు
విక్కీ కౌశల్ (Vicky Kaushal), రష్మిక మందనా (Rashmika Mandanna) హీరోహీరోయిన్లుగా నటించిన చిత్రమే ‘ఛావా’ (Chhaava). హిస్టరీ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కిన ఈ సినిమా భారీ బడ్జెట్‌తో తెరకెక్కింది. ఇప్పటికే పలుమార్లు విడుదలను వాయిదా వేసుకున్న ఈ మూవీ ఫైనల్‌గా ఫిబ్రవరీ 14న విడుదల కానుంది. విడుదలకు ఇంకా కొన్నిరోజులే ఉండడంతో ‘ఛావా’ ప్రమోషన్స్ మొదలయ్యాయి. తాజాగా ఈ సినిమాలోని మొదటి సాంగ్‌ను విడుదల చేయడం కోసం హీరోహీరోయిన్లతో పాటు మ్యూజిక్ డైరెక్టర్ ఏఆర్ రెహమాన్, సింగర్ అర్జిత్ సింగ్ కూడా హైదరాబాద్‌కు వచ్చారు. అదే సమయంలో విక్కీ కౌశల్‌కు తెలుగు పాఠాలు నేర్పించింది రష్మిక. తెలుగు ప్రేక్షకులను నేరుగా తెలుగులోనే పలకరించడానికి రష్మిక సాయం తీసుకున్నాడు విక్కీ.
తెలుగులో పలకరింపులు
స్టేజ్‌పైకి రాగానే తెలుగు ప్రేక్షకులను ఎలా పలకరించాలని రష్మిక మందనా అడిగాడు విక్కీ కౌశల్. తను చెప్పిన విధంగా ‘‘అందరికీ నమస్కారం. అందరూ బాగున్నారా? హైదరాబాద్‌కు రావడం చాలా సంతోషంగా ఉంది’’ అంటూ తెలుగులో మాట్లాడి ప్రేక్షకులను ఇంప్రెస్ చేశాడు. విక్కీ కౌశల్ బాలీవుడ్ హీరోనే అయినా తనకు తెలుగులో కూడా చాలానే ఫ్యాన్ బేస్ ఉంది. మంచి కథలను ఎంచుకుంటాడని, కష్టపడి ఇండస్ట్రీలో అడుగుపెట్టి భారీ ఫ్యాన్ బేస్‌ను సంపాదించుకున్నాడని తనపై మంచి ఒపీనియన్ ఉంది. అందుకే ఇప్పుడు తను హీరోగా నటించిన ‘ఛావా’ను థియేటర్లలో చూడడానికి కూడా తెలుగు ప్రేక్షకులు ఆసక్తి చూపిస్తున్నారు.
Also Read: ప్లీజ్ నాకు పని ఇవ్వండి.. స్టేజ్‌పైనే బాలీవుడ్ హీరోకు ‘తండేల్’ డైరెక్టర్ రిక్వెస్ట్..
రష్మికకు సాయం
‘ఛావా’లో విక్కీ కౌశల్.. ఛత్రపతి సాంబాజీ మహారాజ్ పాత్రలో నటిస్తుండగా.. రష్మిక మందనా.. మహారాణి యేసుబాయ్ పాత్రలో కనిపించనుంది. మొఘలులకు ఎదురెళ్లి మరాఠా సామ్రాజాన్ని కాపాడుకున్న సాంబాజీ మహారాజ్ జీవితకథ ఆధారంగా తెరకెక్కింది ‘ఛావా’. ఇందులో నుండి ‘జానే తూ’ అనే పాటను విడుదల చేయడానికి మేకర్స్ హైదరాబాద్‌కు వచ్చారు. కొన్నిరోజుల క్రితం జిమ్‌లో వర్కవుట్ చేస్తుండగా రష్మిక కాలుకు గాయమయ్యింది. ఆ గాయం వల్ల తను నడవలేకపోతున్నా కూడా వీల్ చైర్‌పై వచ్చి ‘ఛావా’ ప్రమోషన్స్‌లో పాల్గొంటోంది రష్మిక. విక్కీ కౌశల్ కూడా జెంటిల్‌మ్యాన్‌లాగా తనకు సాయం చేస్తున్నాడు.