NTR: టాలీవుడ్‌లో రెండు సూపర్ స్టార్ ఫ్యామిలీలు – మెగా & నందమూరి! ఈ రెండు కుటుంబాల మధ్య మూడున్నర దశాబ్దాల రైవల్రీ ఉంది. చిరు, బాలయ్యల మధ్య బాక్సాఫీస్ వార్ దశాబ్దాలుగా జరుగుతూనే ఉంది. సినీ అభిమానులు కూడా మెగా-నందమూరి అభిమానులుగా విడిపోయి గొడవలు పడుతూ ఉంటారు… ఇలాంటి రైవల్రీలో కూడా చరణ్-ఎన్టీఆర్ బెస్ట్ ఫ్రెండ్స్ అయ్యారు.
“RRR” సినిమా ఈ ఇద్దరి మధ్య ఉన్న స్నేహాన్ని ప్రపంచానికి చూపించేసింది. షూటింగ్ టైమ్‌లో, ప్రమోషన్ టూర్‌లో వీళ్ల మధ్య కెమిస్ట్రీ మాములుగా లేదు. ఒకరిని ఒకరు ఆటపట్టించుకోవడం, ఫ్రాంక్స్ చేయడం – అసలు వీళ్ల ఎంటర్వ్యూలు చూస్తే నిజంగా ఇద్దరు స్టార్ హీరోలు ఇగోలు పక్కన పెట్టి ఇంత క్లోజ్ గా ఉంటారా? ఇంత ఫన్నీగా ఉంటారా అనిపించకమానదు.
రామ్ చరణ్ బర్త్ డే (2025, మార్చి 27)కి ఎన్టీఆర్ ఒక స్పెషల్ ట్వీట్ చేసాడు. “Happy Birthday, Dear Brother” అంటూ ఎన్టీఆర్ నుంచి ట్వీట్ రాగానే మెగా అభిమానులు, దాన్ని రీట్వీట్ చేస్తూ సందడి చేస్తున్నారు. చరణ్ నుంచి ఇంకా రిప్లై రాలేదు కానీ అది కూడా వచ్చేస్తే సోషల్ మీడియాలో ఆర్ ఆర్ ఆర్ సినిమా టైమ్ మ్యూచువల్ ఫ్యాన్ మేడ్ ఎడిట్స్ మళ్లీ బయటకి వస్తాయి. ట్రిపుల్ ఆర్ సినిమా ప్రమోషన్స్ లో చరణ్ మాట్లాడుతూ… తన బర్త్ డేకి సరిగ్గా 12 గంటలకి, ఉపాసనతో కేక్ కట్ చేసి ఆ తర్వాత ఎన్టీఆర్ తో కలిసి బయటకి వెళ్లిపోయే వాడిని అని చెప్పాడు. ప్రస్తుతం ఎన్టీఆర్ జపాన్ లో దేవర ప్రమోషన్స్ లో బిజీగా ఉన్నాడు కాబట్టి ఈ ఇయర్ చరణ్ బర్త్ డే సెలబ్రేషన్స్ కి ఎన్టీఆర్, చరణ్ కలవడం కష్టమే.
ఈ ఇద్దరూ కలిసి మళ్లీ స్క్రీన్ మీద కనిపించాలనేది ఇప్పుడు గ్లోబల్ ఆడియెన్స్ కోరుకునే డ్రీమ్! “RRR 2” గురించి టాక్ వినిపిస్తుంది కానీ, ఆ క్లారిటీ కోసం ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నారు. విజయేంద్రప్రసాద్ కూడా ట్రిపుల్ ఆర్2 గురించి హింట్స్ ఇచ్చాడు కానీ అఫీషియల్ గా ఎలాంటి కన్ఫర్మేషన్ లేదు. ఆర్ ఆర్ ఆర్ సినిమాకి సీక్వెల్ కచ్చితంగా ఉంటుంది కానీ అది ఎప్పుడు స్టార్ట్ అవుతుంది? ఎన్నేళ్లు పడుతుంది అనేది మాత్రం ఒక్క రాజమౌళికే తెలియాలి. అన్ని కుదిరి ఎన్టీఆర్-చరణ్ ని ఆర్ ఆర్ ఆర్ 2 సినిమాలో ఇంకొక్కసారి కలిసి చూసే అవకాశం వస్తే మాత్రం మరోసారి వరల్డ్ వైడ్ బాక్సాఫీస్ దద్దరిల్లడం పక్కా!