Sugar Scrub: మహిళలు తమ ముఖం అందంగా మెరిసిపోవడానికి వివిధ రకాల స్కిన్ కేర్ ప్రొడక్స్ట్ ఉపయోగిస్తారు. ఇందుకోసం వేలల్లో ఖర్చు చేసే వారు కూడా ఉంటారు. ఇలా మీరు కూడా మెరిసే చర్మం కోరుకుంటే.. మాత్రం కొన్ని రకాల స్కిన్ కేర్ టిప్స్ ప్రతి రోజు పాటించాలి. ముఖ్యంగా ఫేస్ స్క్రబ్ చర్మ సౌందర్యానికి చాలా బాగా ఉపయోగపడుతుంది.
ఇది ముఖాన్ని శుభ్రపరుస్తుంది. ముఖంపై ఉన్న మురికిని కూడా తొలగిస్తుంది. ఇన్ని ప్రయోజనాలు ఉన్న ఫేస్ స్క్రబ్ మీరు ఇంట్లోనే స్క్రబ్ తయారు చేసుకోవచ్చు. దీన్ని తయారు చేయడానికి.. ఏ ఏ పదార్థాలు అవసరం అవుతాయి. దీనిని ఉపయోగించే విధానానికి సంబంధించిన పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
చర్మాన్ని శుభ్రం చేయడానికి స్క్రబ్బింగ్ చాలా ముఖ్యం. ఇది మృత కణాలను నుండి ఉపశమనం కలిగిస్తుంది. మీ ముఖాన్ని సహజ పదార్థాలతో స్క్రబ్ చేసుకోవడం చాలా మంచిది. చక్కెరను ఉపయోగించి ఇంట్లోనే అనేక రకాల స్క్రబ్‌లను తయారు చేసుకోవచ్చు. దీన్ని మీ ముఖానికి అప్లై చేయడం వల్ల మీ చర్మం శుభ్రపడుతుంది.
నిమ్మకాయ, చక్కెర స్క్రబ్:
కావాల్సినవి:
నిమ్మరసం- 1 టేబుల్ స్పూన్
చక్కెర- 1 టేబుల్ స్పూన్
తేనె- తగినంత
ఈ స్క్రబ్ తయారు చేయడానికి.. ఒక చిన్న గిన్నెలో ఒక టేబుల్ స్పూన్ చక్కెర తీసుకోండి. దానికి కాస్త నిమ్మరసం కలపండి. అందులో కొంచెం తేనెను కూడా యాడ్ చేయండి. తర్వాత ఈ మిశ్రమాన్ని నెమ్మదిగా ముఖంపై అప్లై చేయండి. 15 నిమిషాల తర్వాత నీటితో శుభ్రం చేసుకోండి. ఇలా చేయడం వల్ల ముఖంపై ఉన్న నలుపుదనం పూర్తిగా తొలగిపోతుంది. ఫలితంగా ముఖం తెల్లగా మెరిసిపోతుంది. నిమ్మకాయ చర్మాన్ని శుభ్రపరచడంలో సహాయపడుతుంది. దీనిని వాడటం వల్ల వాడకం వల్ల స్కిన్ ట్యాన్ సమస్య కూడా తొలగిపోతుంది.
గ్రీన్ టీ , షుగర్ స్క్రబ్:
కావాల్సినవి:
గ్రీన్ టీ- తగినంత
షుగర్- 1 టేబుల్ స్పూన్
ఆలివ్ ఆయిల్- 1 టీ స్పూన్
ఒక చిన్న గిన్నెలో కాస్త గ్రీన్ టీ తీసుకోండి. తర్వాత దానికి ఒక చెంచా చక్కెర కలపండి. ఈ మిశ్రమానికి తగినంత ఆలివ్ నూనె వేసి బాగా కలపండి. ఇప్పుడు ఈ పేస్ట్‌ని మీ ముఖం మొత్తానికి అప్లై చేసి 20 నిమిషాల తర్వాత కడిగేయండి. ఇలా చేయడం వల్ల మంచి ఫలితం ఉంటుంది.
గ్రీన్ టీలో యాంటీ ఆక్సిడెంట్, యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ మైక్రోబియల్ లక్షణాలు పుష్కలంగా ఉంటాయి. దీనిని ముఖానికి అప్లై చేయడం వల్ల మొటిమలు తగ్గుతాయి.
3. పసుపు, చక్కెర స్క్రబ్:
పసుపు- 1 టీ స్పన్
చక్కెర- 1 టేబుల్ స్పూన్
తేనె – తగినంత
Also Read: ఈ హెయిర్ సీరం వాడితే.. జుట్టు వద్దన్నా పెరుగుతుంది
ఈ స్క్రబ్ తయారు చేయడానికి.. ఒక చిన్న గిన్నెలో ఒక టేబుల్ స్పూన్ పసుపు పొడి, ఒక టీస్పూన్ చక్కెర , ఒక టీస్పూన్ తేనె తీసుకుని బాగా కలపండి. తర్వాత ఈ మిశ్రమాన్ని ముఖంపై అప్లై చేయండి. ఆరిన తర్వాత, గోరు వెచ్చని నీటితో వాష్ చేయండి. ఇలా చేయడం వల్ల మంచి ఫలితం ఉంటుంది.