BigTV English

Jr NTR : డైరెక్టర్ తో ఎన్టీఆర్ గొడవ.. సినిమా క్యాన్సిల్..?

Jr NTR : డైరెక్టర్ తో ఎన్టీఆర్ గొడవ.. సినిమా క్యాన్సిల్..?

Jr NTR : గ్లోబల్ స్టార్ ఎన్టీఆర్ రేంజ్ ఇప్పుడు మరో మెట్టు పెరిగింది. ట్రిపుల్ ఆర్ తర్వాత మరో బ్లాక్ బాస్టర్ మూవీ దేవర తో తన రేంజ్ పెరిగింది. ఈ మూవీ మంచి టాక్ తో దూసుకుపోవడం మాత్రమే బాక్సాఫీస్ ను షేక్ చేసే కలెక్షన్స్ ను కూడా అందుకుంది. ఈ సినిమా సక్సెస్ ను ఎన్టీఆర్ ఎంజాయ్ చేస్తున్నాడు. ఇక తన నెక్స్ట్ ప్రాజెక్టు లపై ఫోకస్ పెట్టినట్లు తెలుస్తుంది. ప్రస్తుతం ఆయన బాలీవుడ్ మూవీ వార్ 2 షూటింగ్ లో బిజీగా ఉన్నాడు. వచ్చే ఏడాది ఈ మూవీని ఎలాగైనా రిలీజ్ చెయ్యాలని చూస్తున్నాడట. అందుకే గ్యాప్ లేకుండా వరుసగా షూటింగ్ లో పాల్గొంటున్నాడు. ఈ మూవీ తర్వాత ప్రశాంత్ నీల్ తో మరో సినీమాకు సైన్ చేసాడు. వరుసగా షూటింగ్ తో బిజీగా ఉన్న ఎన్టీఆర్ డైరెక్టర్ పై కోపంతో షూటింగ్ క్యాన్సిల్ చేసుకున్నాడనే ఓ వార్త నెట్టింట షికారు చేస్తుంది. ఏంటి నమ్మట్లేదు కదా.. ఆ మూవీ ఏంటో? ఎందుకు ఎన్టీఆర్ అలిగి వెళ్ళిపోయాడో తెలుసుకుందాం..


ఎన్టీఆర్ సినిమా జీవితంలో ఎన్నో ఆసక్తికర సంఘటనలు చోటుచేసుకున్నాయి. కొన్ని అవమానాలు కూడా ఉన్నాయి. మరికొన్ని తన కోపం వల్ల జరిగాయి. వాటిలో ఒకటి ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఎన్టీఆర్ చైల్డ్ ఆర్టిస్ట్ గా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టాడు. అప్పుడు ఆయన “బాల రామాయణం” అనే సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించాడు. ఆ సమయంలో, ఎన్టీఆర్ దర్శకుడు గుణశేఖర్ పై అలిగిన సంగతి తెలిసిందే. గుణశేఖర్ దర్శకత్వంలో, ఎన్టీఆర్ బాల రాముడి పాత్రలో నటించాడు. సినిమా షూటింగ్ సమయంలో, చిన్న పిల్లలు అంతా అల్లరి చేసేవారు, కానీ ఎన్టీఆర్ ఇతరులతో పోల్చితే ఎక్కువగా అల్లరి చేసేవాడట.. షూటింగ్ కోసం తెచ్చిన వస్తువులను పగగొట్టేవాడట దాంతో డైరెక్టర్ అతనిపై సీరియస్ అయ్యాడు. అంతేకాకుండా, టేకు విల్లు విరగొట్టడంతో, గుణశేఖర్ ఎంతో కోపంతో ఎన్టీఆర్ పై ఆగ్రహం వ్యక్తం చేశాడని అప్పటిలో ఓ వార్త వినిపించింది.

డైరెక్టర్ అలా అనడంతో ఎన్టీఆర్ నేను ఉండను ఇంటికి పోతాను అని అలిగి షూటింగ్ క్యాన్సిల్ చేసుకొని వెళ్లాడట.. పరిస్థితి మరింత చెడ్డగా మారడంతో, గుణశేఖర్, ఇతర యూనిట్ సభ్యులు ఎంతో ప్రాధేయపడి, చివరికి ఎన్టీఆర్ షూటింగ్ కి తిరిగి రావాలని ఒప్పించారు. దాంతో షూటింగ్ లో తిరిగి పాల్గొన్నాడట.. ఆ తర్వాత ఆ సినిమా మంచి హిట్ టాక్ ను సొంతం చేసుకుంది. ఈ మూవీ వచ్చి చాలా ఏళ్లు అయ్యాక ఇన్నాళ్లకు మరోసారి చర్చకు రావడం విశేషం.. మొత్తానికి ఎన్టీఆర్ మహా మొండోడు అని అర్థమయ్యింది. ఇక ఎన్టీఆర్ కేరీర్ విషయానికొస్తే.. ట్రిపుల్ ఆర్ సినిమాతో ఎన్టీఆర్ రేంజ్ ప్రపంచ వ్యాప్తంగా పెరిగింది. అలాగే రీసెంట్ గా దేవర సినిమాతో మరో బ్లాక్ బాస్టర్ హిట్ ను తన ఖాతాలో వేసుకున్నాడు.. ఇప్పుడు వార్ 2 సినిమాతో బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చాడు. ఈ సినిమా కోసం అటు తెలుగు ప్రేక్షకులు, బాలీవుడ్ ప్రజలు వెయిట్ చేస్తున్నారు.


Related News

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Ali Wife : కొత్త బిజినెస్ మొదలుపెట్టిన అలీ వైఫ్ జుబేదా…మీ సపోర్ట్ కావాలంటూ?

Big Stories

×