OTT Movie : సస్పెన్స్ థ్రిల్లర్ మూవీస్ మూవీ లవర్స్ ను బాగా ఎంటర్టైన్ చేస్తాయి. నెక్స్ట్ ఏం జరుగుతుందో అనే టెన్షన్ తో ఆ మూవీని ఎంజాయ్ చేస్తూ చూస్తారు. సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాలు ఇదివరకు చాలానే వచ్చినా ఇప్పుడు మనం చెప్పుకోబోయే మూవీ కాస్త డిఫరెంట్ గా ఉంటుంది. ఈ మూవీ ఎందులో స్ట్రీమింగ్ అవుతుంది? స్టోరీ ఏమిటో తెలుసుకుందాం పదండి.
అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon prime video)
ఇది ఒక హాలీవుడ్ క్రైమ్ సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ. ఒక సైకో కిల్లర్ చుట్టూ ఈ మూవీ స్టోరీ నడుస్తుంది. ఈ మూవీలో ట్విస్టులు మీద ట్విస్టులు ఉంటాయి. హీరో ఆ సైకోని ఎలా కనిపెట్టాడు అనేది చివరి వరకు సస్పెన్స్ గా ఉంటుంది. ఈ క్రైమ్ థ్రిల్లర్ మూవీ పేరు “ది రివర్ మర్డర్స్” (The River Murders). ప్రస్తుతం ఈ మూవీ అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon prime video) లో స్ట్రీమింగ్ అవుతోంది.
స్టోరీ లోకి వెళితే
హీరో ఒక ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ గా ఉంటాడు. హీరో భార్య ఒక కేఫ్ నడుపుతూ ఉంటుంది. హీరో ఆ కేఫ్ లో తన భార్యతో మాట్లాడుతుండగా, ఒక పోలీస్ ఆఫీసర్ అతని దగ్గరికి వచ్చి, సిటీలో ఒక బ్రిడ్జి దగ్గర ఒక అమ్మాయి చనిపోయి ఉంది. ఆ అమ్మాయి ఎవరో కాదు 12 సంవత్సరాల క్రితం నువ్వు డేటింగ్ చేసిన అమ్మాయి అని చెప్తుంది. హీరో ఆ చోటికి వెళ్లి చూడగా ఆ అమ్మాయిని ఒంటి మీద బట్టలు లేకుండా చంపి బ్రిడ్జి కింద బాడీని పెట్టి ఉంటారు. ఆ డేటింగ్ చేసిన అమ్మాయిని హీరో మొదట ఆ బ్రిడ్జి దగ్గరే కలుసుకొని ఉంటాడు. ఇలాగే మరొక మర్డర్ జరుగుతుంది. ఆమె కూడా ఇతనితో డేటింగ్ చేసి ఉంటుంది. ఆమెను కూడా ఇలాగే చంపి ఉంటారు. హీరో డేటింగ్ చేసిన అమ్మాయిలను ఎవరో సైకో కిల్లర్ చంపుతూ ఉంటాడు. మిగతా అమ్మాయిలను కాపాడాలంటే నువ్వు ఎంత మందితో డేటింగ్ చేశావో చెప్పాలని పోలీసులు హీరోని అడుగుతారు.
పోలీసులకు హీరో పూర్తి సమాచారం ఇస్తాడు. అయితే ఆ సైకో కిల్లర్ చనిపోయిన అమ్మాయిల నాలిక మీద సిలువ గుర్తు వేస్తూ ఉంటాడు. పోలీసులు ఆ హత్యలపై ఇన్వెస్టిగేషన్ చేయడం మొదలు పెడతారు. ఇన్వెస్టిగేషన్లో పోలీసులకు దిమ్మతిరిగే విషయాలు వెలుగులోకి వస్తాయి. ఇంతకీ వరుసగా హత్యలు చేస్తున్న ఆ సైకో కిల్లర్ ఎవరు? పోలీసులు వెలుగులో తెచ్చిన విషయాలు ఏమిటి? హీరోకి ఆ హత్యలకు సంబంధం ఉందా? అనే విషయాలను తెలుసుకోవాలనుకుంటే ఓటిటి ప్లాట్ ఫామ్ అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon prime video) లో స్ట్రీమింగ్ అవుతున్న క్రైమ్ థ్రిల్లర్ “ది రివర్ మర్డర్స్” (The River Murders) మూవీని తప్పకుండా చూడండి. ఈ థ్రిల్లర్ మూవీలో ప్రతి సీన్ చాలా ఆసక్తికరంగా ఉంటుంది.