BigTV English
Advertisement

Jr. Ntr : ఇక్కడ సినిమాలకు బ్రేక్.. అక్కడ సినిమాలకు గ్రీన్ సిగ్నల్..

Jr. Ntr : ఇక్కడ సినిమాలకు బ్రేక్.. అక్కడ సినిమాలకు గ్రీన్ సిగ్నల్..

Jr. Ntr : గ్లోబల్ స్టార్ ఎన్టీఆర్, మాస్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో వచ్చిన మూవీ దేవర.. రిలీజ్ కు ముందు భారీ అంచనాలతో వచ్చిన ఈ మూవీ మిక్సీ్డ్ టాక్ ను సొంతం చేసుకుంది. టాక్ ఎలా ఉన్నా కలెక్షన్ల సునామీ సృష్టిస్తుంది. ఏడు రోజులకు రూ. 400 కోట్లకు పైగా వసూల్ చేసింది. ఇప్పటికి సినిమాకు క్రేజ్ తగ్గలేదు. ఆరేళ్ళ తర్వాత ఎన్టీఆర్ సోలో హీరోగా చేసిన ఈ మూవీ పాజిటివ్ టాక్ ను అందుకోవడంతో ఫ్యాన్స్ ఫుల్ ఖుషి అవుతున్నారు. ఈ సినిమా తర్వాత మరో రెండు సినిమాలు ఎన్టీఆర్ లైనప్ లో ఉన్నాయి. వాటిని ఇంకా పూర్తి చెయ్యలేదు కానీ ఇప్పుడు మరో సినిమాకు ఎన్టీఆర్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అది కూడా తమిళ డైరెక్టర్ తో అనే వార్తలు ఇండస్ట్రీలో షికారు చేస్తున్నాయి..


రజినీకాంత్ తో గత ఏడాది జైలర్ సినిమాను తీసి భారీ సక్సెస్ ను తన ఖాతాలో వేసుకున్న డైరెక్టర్ నెల్సన్‌ దిలీప్‌కుమార్‌ తో ఎన్టీఆర్ సినిమా ఒకే అయ్యే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఇటీవల నెల్సన్ ఎన్టీఆర్ ఇంటికి వెళ్లినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. తమిళ డైరెక్టర్ ఎన్టీఆర్ ఇంటికి వెళ్లడం ఏంటి? కొత్త సినిమా కోసమేనా అనే వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. అందరు అనుకున్నట్లుగానే నెల్సన్ ఎన్టీఆర్ కోసం రాసుకున్న సినిమా కథను వినిపించాడట. ఆయన చెప్పిన స్టోరీ లైన్ బాగా నచ్చడంతో ఈ కథకు ఎన్టీఆర్‌ అంగీకారం తెలిపారనే టాక్‌ ఫిల్మ్‌నగర్‌ సర్కిల్స్‌లో తెరపైకి వచ్చింది..

ఇకపోతే ప్రస్తుతం ఎన్టీఆర్‌ హిందీ చిత్రం ‘వార్‌ 2’ లో హృతిక్ తో కలిసి సినిమా చేస్తున్నాడు.. ఈ మూవీ షూటింగ్ ఇంకా పూర్తి కాలేదు. త్వరలోనే ప్రశాంత్‌ నీల్‌తో చేయనున్న ‘డ్రాగన్‌’ సినిమా సెట్స్‌లో జాయిన్‌ అవుతారు. మరోవైపు ‘జైలర్‌ 2’ సినిమా స్క్రిప్ట్‌ను మరింత మెరుగుపరిచే పనుల్లో ఉన్నారు నెల్సన్‌. ‘జైలర్‌’లో హీరోగా నటించిన రజనీకాంత్‌ ‘జైలర్‌ 2’లోనూ నటిస్తారు.. ‘వార్, డ్రాగన్‌’ సినిమాలను ఎన్టీఆర్‌ పూర్తి చేశాక, అటు ‘జైలర్‌ 2’ను నెల్సన్‌ కంప్లీట్‌ చేశాక… కానీ ఎన్టీఆర్‌-నెల్సన్‌ కాంబోలోని సినిమా సెట్స్‌పైకి వెళ్లే చాన్సెస్‌ కనిపించడం లేదు.. ఈ సినిమా అనౌన్స్మెంట్ రావడానికి, సినిమా సెట్స్ మీదకు వెళ్లాడానికి చాలా టైం ఉందనే వార్తలు వినిపిస్తున్నాయి. ఇక ఈ మధ్య ఎన్టీఆర్ తమిళ సినిమాల పై, తమిళ డైరెక్టర్స్ తో సినిమాలు చెయ్యడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నాడని గుసగుసలు వినిపిస్తున్నాయి.. తెలుగు డైరెక్టర్లతో కాకుండా తమిళ డైరెక్టర్ లను లైన్లో పెడుతున్నాడని టాక్.. తెలుగులో సినిమాలకు బ్రేక్ తీసుకుంటాడా? తమిళ సినిమాలలో నటిస్తాడా? అన్నది ఆసక్తిగా మారింది.. దీనిపై ఎన్టీఆర్ క్లారిటీ ఇవ్వాల్సి ఉంది..


Related News

Tejaswini Nandamuri: నందమూరి వారసురాలు వైరల్ యాడ్ డైరెక్టర్ ఎవరో తెలుసా? ఇంత బ్యాక్గ్రౌండ్ ఉందా?

Film industry: ఘనంగా సినిమాటిక్ ఎక్స్ పో 3వ ఎడిషన్!

CM Revanth on Movie Tickets: సినిమా టికెట్ డబ్బుల్లో సినీ కార్మికులకు వాటా… సీఎం సంచలన ప్రకటన

Bandla Ganesh: బండ్ల గణేష్ ఇల్లు చూడండి.. ఎంత అద్భుతంగా ఉందో!

Telugu Heroes : సినిమాలతో పాటు హోటల్స్… లగ్జరీ రెస్టారెంట్స్ ఉన్న హీరోలు వీళ్లే

Salman Khan: పాక్ ను కెలికిన సల్లు భాయ్.. తెలుగు సినిమాలు బాగా చూస్తారంటూ..

Siva Jyothi: బేబీబంప్ తో పెళ్లి పీటలు ఎక్కిన శివ జ్యోతి.. ఇలా కూడా చేస్తారా?

Kantara 2: వైకల్యాన్ని జయిస్తూ.. నోటితోనే కాంతార బిజీఎం!

Big Stories

×