BigTV English

Pawan Vs Udhayanidhi stalin: సనాతన ధర్మం.. తమిళనాడు డిప్యూటీ సీఎం ఉదయనిధిపై పవన్ పంచ్, ఎందుకంటే?

Pawan Vs Udhayanidhi stalin: సనాతన ధర్మం.. తమిళనాడు డిప్యూటీ సీఎం ఉదయనిధిపై పవన్ పంచ్, ఎందుకంటే?

Pawan Vs Udhayanidhi stalin: తిరుపతి వారాహి సభలో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కామెంట్స్ వెనుక ఏం జరిగింది? తమిళనాడు డిప్యూటీ సీఎం ఉదయనిధిస్టాలిన్‌పై ఎందుకు ఆగ్రహం వ్యక్తం చేశారు? సనాతన ధర్మం సభకు తిరుపతినే ఎందుకు ఎంచు కున్నారు? దీనివెనుక బీజేపీ పెద్దల స్కెచ్ ఉందా? ఇవే ప్రశ్నలు చాలా మందిని వెంటాడుతున్నాయి.


తమిళనాడులో పాగా వేసేందుకు బీజేపీ పావులు కదుపుతుందా? మరో రెండేళ్లలో ఆ రాష్ట్ర అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్నాయి. ఈ క్రమంలో పవన్‌కల్యాణ్.. స్టాలిన్ ప్రభుత్వాన్ని టార్గెట్ చేసినట్టు కనిపిస్తోంది. పవన్ వ్యాఖ్యల వెనుక బీజేపీ పెద్దలు ఉన్నారనే ప్రచారం బలంగా సాగుతోంది.

తిరుపతి వారాహి సభలో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. సనాతన ధర్మం అనేది వైరస్ లాంటిదని, ఈ మహమ్మారిని నిర్మూలించాలంటూ ఆ మధ్య తమిళనాడు సీఎం స్టాలిన్ కొడుకు, ఉదయనిధి వ్యాఖ్యానించారు. దీనిపై బీజేపీ నేతల నుంచి పెద్దగా ప్రతిఘటన ఎదురుకాలేదు. పరిస్థితి గమనించిన పవన్ కల్యాణ్, ఆ విషయాన్ని తనవైపు తిప్పుకునే ప్రయత్నం చేశారు.


సనాతన ధర్మాన్ని ఎవరూ ఏమీ చేయలేరని, దాన్ని నిర్మూలించాలంటే వారే తుడిచిపెట్టుకుని పోతారన్నారు పవన్ కల్యాణ్. ఈ మాటను తిరుపతి బాలాజీ సాక్షిగా చెబుతున్నానని వ్యాఖ్యానించారు. ఆ మాటలను తమిళం, ఇంగ్లీష్‌లో ప్రస్తావించారు.

ALSO READ: 7 పాయింట్లతో ‘వారాహి డిక్లరేషన్’.. సనాతన ధర్మ పరిరక్షణకు ప్రత్యేక చట్టం, కీలక అంశాల ప్రస్తావన

సనాతన ధర్మానికి భంగం కలిగితే బయటకు వచ్చి పోరాటం చేస్తానని, అవసరమైతే ప్రాణ త్యాగం చేస్తానని కుండబద్దలు కొట్టేశారు. ఒకవిధంగా తమిళనాడు డిప్యూటీ సీఎం ఉదయనిధి స్టాలిన్‌కు పవన్ కల్యాణ్ హెచ్చరిక ఇచ్చారన్నది కొందరి నేతల మాట. సనాతన ధర్మంపై దాడులు న్యాయస్థానాలు కాపాడడం బాధాకరమని జగన్ విషయాన్ని ప్రస్తావించే ప్రయత్నం చేశారు.

పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో కామెంట్స్ పడిపోతున్నాయి. సనాతన ధర్మంపై తిరుపతిలో మాట్లాడినంత మాత్రాన సరిపోదని, ఇదే విషయాన్ని తమిళనాడులో సభ పెట్టి మాట్లాడితే బాగుంటుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. సనాతనధర్మం గురించి తప్పుగా మాట్లాడితే తాటతీస్తానని అక్కడ చెప్పాలన్నది నెటిజన్స్ వ్యాఖ్య.

మరో రెండేళ్లలో తమిళనాడు అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్నాయి. అక్కడ హిందూవాదాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లే నాయకులు లేరని బీజేపీ హైకమాండ్ ఆలోచన. ఈ నేపథ్యంలో పవన్‌కల్యాణ్ రూపంలో ప్లాన్ వేసిన్నట్లు రాజకీయ విశ్లేషకుల మాట. మరి పవన్ సనాతన ధర్మం కామెంట్స్ తమిళ తంబీలతోపాటు అక్కడి రాజకీయ పార్టీలేమంటాయో వెయిట్ అండ్ సీ.

 

Related News

Araku Coffee: ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. అరకులో ఇకపై అందరూ లక్షాధికారులే!

Pawan Kalyan project: పవన్ సరికొత్త కార్యక్రమానికి శ్రీకారం.. కోట్లల్లో ఖర్చు.. ఎందుకంటే?

Railways: రైల్వే ప్రాజెక్టులపై దృష్టి.. అవన్నీ జరిగితే ఏపీకి తిరుగుండదు

Pulivendula Politics: పులివెందుల రాజకీయాలు.. 30 ఏళ్లలో రెండోసారి, ఓటర్లు ఫుల్‌ఖుషీ

Pawan Kalyan: రూటు మార్చిన పవన్.. నిన్న మామిడి.. నేడు చీరలు, రేపు?

AP Free Bus Scheme: ఏపీలో ఫ్రీ బస్ స్కీమ్.. ఆ బస్సు లెక్కితే ఉచిత ప్రయాణం ఉండదు

Big Stories

×