E-Paper
Advertisement

Jabardasth Nukaraju: ఆసియాకు నాకు మధ్య గొడవలు ఎక్కువయ్యాయి.. బ్రేకప్.. ?

Jabardasth Nukaraju: ఆసియాకు నాకు మధ్య గొడవలు ఎక్కువయ్యాయి.. బ్రేకప్.. ?
Advertisement

Jabardasth Nukaraju: జబర్దస్త్ ద్వారా మంచి పేరు తెచ్చుకున్న కమెడియన్ నూకరాజు. ఎలాంటి పాత్ర అయినా కూడా తనదైన నటనతో మెప్పించి ఆనతి కాలంలోనే టీమ్ లీడర్ అయిపోయాడు. ఇక జబర్దస్త్ లో పరిచయమైన జంటల్లో సుధీర్ రష్మీ మధ్య ప్రేమను పరిచయం చేసి.. ఆన్ స్క్రీన్ రొమాన్స్ కు తెరలేపారు. ఇక వీరి తరువాత అలానే చాలామంది ట్రై చేశారు. కొందరికి వర్క్ అవుట్ అయ్యింది.. ఇంకొందరికి వర్క్ అవుట్ కాలేదు. ఇక అలా బయట కూడా వర్క్ అవుట్ అయిన జంటల్లో నూకరాజు- ఆసియా జంట ఒకటి.

ఒక లేడీ క్యారెక్టర్ ద్వారా ఆసియా.. నూకరాజు టీమ్ లో జాయిన్ అయ్యింది. ఆ తరువాత వీరి పరిచయం ప్రేమగా మారి.. పెళ్లి వరకు దారితీసిందని టాక్. అయితే గత కొన్నిరోజులుగా ఈ జంట బ్రేకప్ చెప్పుకున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. తాజాగా ఈ వార్తలకు చెక్ పెట్టాడు నూకరాజు. ప్రేమలో గొడవలు కామన్ అని, కానీ అర్ధం చేసుకొనే వారు ఉంటే అవన్నీ తొలగిపోతాయని చెప్పుకొచ్చాడు. అంటే తమ మధ్య బ్రేకప్ అవ్వలేదని, కలిసి పోయినట్లు తెలిపాడు. ఒక వీడియోలో నూకరాజు మాట్లాడుతూ.. ” ప్రేమలో అలకలు, గొడవలు, బుజ్జగింపులు ఉంటాయి. అలానే ఆసియాకు నాకు మధ్య గొడవలు ఉన్నాయి. నేను బిజీగా ఉండడం వలన ఆమెకు టైమ్ ఇవ్వలేకపోయేవాడిని. తాను నాపై అలిగేది.. నేను పట్టించుకోకుండా ప్రోగ్రామ్స్ అంటూ వెళ్లిపోయేవాడిని.. వందశాతం తప్పు నాదే.

Advertisement

తప్పు ఎవరిదైనా ఎప్పుడు ఆమె నాతో మాట్లాడేది. కొన్నిరోజుల క్రితం నేను దుబాయ్ ఈవెంట్ కు వెళ్లాను. ఆసియా ఫోన్ చేసింది.. కానీ నా ఫోన్ కలవలేదు. కనీసం ఆమె బర్త్ డే కు విష్ కూడా చేయలేదు. ఇండియా వచ్చాక ఆసియాతో మాట్లాడాను. అర్ధం చేసుకుంది. అప్పుడు బర్త్ డే మిస్ అయినా.. ఇప్పుడు ఆమె బర్త్ డే ఎంతో గ్రాండ్ గా చేద్దామనుకుంటున్నాను. చిన్న ఈగోలతో ప్రేమను దూరం చేసుకోకండి.. మా బంధం ముక్కలు కాలేదు” అని చెప్పుకొచ్చాడు. మరి ఈ జంట పెళ్లి ఎప్పుడు చేసుకుంటారో చూడాలి.

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×