BigTV English

Ponnam Prabhakar: తెలంగాణ రైతులకు గుడ్ న్యూస్.. మంత్రి కీలక ప్రకటన

Ponnam Prabhakar: తెలంగాణ రైతులకు గుడ్ న్యూస్.. మంత్రి కీలక ప్రకటన

Ponnam Prabhakar: తెలంగాణ రైతులకు ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ఆగష్టు 15 లోపు రెండు లక్షల రుణమాఫీ చేస్తామని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మండలం పోతారంలో కాంగ్రెస్ పార్టీ శ్రేణుల పార్లమెంట్ ఎన్నికల సన్నాహక సమావేశంలో పొన్నం పాల్గొన్నారు. త్వరలోనే అర్హులకు కొత్త రేషన్ కార్డులు ఇస్తామని అన్నారు. రైతులకు రెండు లక్షల రుణమాఫీ చేస్తామని హామీ ఇచ్చారు. వచ్చే వానాకాలం పంటకు రూ. 500 బోనస్ ఇస్తామని తెలిపారు.


కరీంనగర్ పార్లమెంట్ ఎన్నికల్లో పార్టీ గెలుపు కోసం కృషి చేయాలని కార్యకర్తలకు మంత్రి పిలుపునిచ్చారు. ఎంపీ బండి సంజయ్ నియోజకవర్గంలో ఏం అభివృద్ధి చేశారో చెప్పాలని అన్నారు. బండి సంజయ్, వినోద్ కుమార్ లు నియోజకవర్గ అభివృద్ధిపై చర్చకు రావాలని సవాల్ విసిరారు. ఎంపీగా బండి సంజయ్ రాష్ట్రానికి ఒక్క పరిశ్రమ కూడా  తేలేదని ఆరోపించారు. పదేళ్లలో బీఆర్ఎస్ చేసిందేమి లేదన్నారు. బీఆర్ఎస్‌కు ఓటు వేసి వృధా చేసుకోకుండా..కాంగ్రెస్ కు ఓటు వేసి గెలిపించాలని ప్రజలను కోరారు.

ALSO READ:CM Revanth counter to KCR: కేసీఆర్‌కు స్ట్రాంగ్ కౌంటర్, దమ్ముంటే టచ్ చేసి చూడు..


కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాపాలన అందిస్తోందని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. ప్రభుత్వానికి వస్తున్న ఆదరణ చూసి ఓర్వలేక బీఆర్ఎస్, బీజేపీలు ఉద్ధేశ పూర్వకంగానే విమర్శలు చేస్తున్నారని ఆరోపించారు. ప్రభుత్వంపై అడ్డగోలుగా ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఐదేళ్లు సుస్థిరంగా ఉంటుందని స్పష్టం చేసారు. పేదల భూములను లాక్కున్న వారిని వదిలిపెట్టమని మంత్రి  హెచ్చరించారు.

Related News

Metro Parking System: గుడ్ న్యూస్.. మెట్రో సరికొత్త పార్కింగ్ సిస్టమ్ సిద్ధం, మనుషులతో పనేలేదు!

Hyderabad News: జీహెచ్ఎంసీ నిఘా.. ఆ పని చేస్తే బుక్కయినట్టే, అసలు మేటరేంటి?

Weather News: కొన్ని గంటల్లో ఈ ఏరియాల్లో భారీ వర్షం.. ఇక రాత్రంతా దంచుడే

Nagarjunasagar flood: నాగార్జునసాగర్‌ గేట్లు ఎత్తివేత.. సందర్శకులకు బిగ్ అలర్ట్!

Hyderabad Rains: అమీర్‌పేట ముంపు ప్రాంతాల్లో సీఎం రేవంత్ పర్యటన.. అధికారులకు కీలక ఆదేశాలు

Malreddy Ranga Reddy: రంగారెడ్డి ఎమ్మెల్యే మల్‌రెడ్డి కుటుంబంలో రాఖీ పండుగ రోజే విషాదం

Big Stories

×