BigTV English

Ram Charan’s Game Changer First Single: ‘గేమ్ ఛేంజర్’ ఫస్ట్ సింగిల్, టీజర్ రిలీజ్ డేట్ వచ్చేసింది.. మెగా ఫ్యాన్స్‌కు పండగే!

Ram Charan’s Game Changer First Single: ‘గేమ్ ఛేంజర్’ ఫస్ట్ సింగిల్, టీజర్ రిలీజ్ డేట్ వచ్చేసింది.. మెగా ఫ్యాన్స్‌కు పండగే!

Ram Charan Game Changer update


Ram Charan’s Game Changer Movie Update: గ్లోబల్ స్టార్ రామ్ ఆర్ఆర్ఆర్ మూవీతో ప్రపంచ వ్యాప్తంగా ఫుల్ క్రేజ్ సంపాదించుకున్నాడు. ఈ మూవీతో ఆయన ఇమేజ్ మరింత పెరిగింది. దీంతో చరణ్ తాను తీయబోయే సినిమాలు కూడా అదే రేంజ్‌లో ఉండాలని నిర్ణయించుకున్నాడు. ప్రస్తుతం డిఫరెంట్ స్టోరీలను ఎంచుకుంటూ పోతున్నాడు.

ఇదిలా ఉంటే ప్రస్తుతం రామ్ చరణ్ హీరోగా క్రియేటివ్ దర్శకుడు శంకర్ డైరెక్షన్‌లో ‘గేమ్ ఛేంజర్’ మూవీ తెరకెక్కుతోంది. భారీ బడ్జెట్‌తో రూపొందుతోన్న ఈ మూవీపై ప్రేక్షకాభిమానుల అంచనాలు తారా స్థాయిలో ఉన్నాయి. దాదాపు గత రెండేళ్ల క్రితం పట్టాలెక్కిన ఈ మూవీ ఇంకా రిలీజ్‌కు నోచుకోలేదు. దీని బట్టి చూస్తే దర్శకుడు శంకర్ ఈ మూవీని ఏ రేంజ్‌లో తీస్తున్నాడో అర్థం చేసుకోవచ్చు.


పొలిటికల్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతోన్న ఈ మూవీలో రామ్ చరణ్ రెండు విభిన్నమైన పాత్రల్లో కనిపించబోతున్నాడు. ఇందులో ఆయనకు జోడీగా బాలీవుడ్ అందాల బ్యూటీ కియారా అద్వానీ హీరోయిన్‌గా నటిస్తోంది. ఇకపోతే ఈ మూవీ నుంచి ఇప్పటివరకు ఒక్క అప్డేట్ కూడా రాకపోవడంతో చెర్రీ అభిమానులు నిరుత్సాహంలో ఉన్నారు.

READ MORE: ‘గేమ్ ఛేంజర్‌’ అప్డేట్ వచ్చేసింది.. రామ్ చరణ్ రోల్ ఎలా ఉంటుందో చెప్పిన డైలాగ్ రైటర్..

ఇక మార్చి నెలలో రామ్ చరణ్ బర్త్ డే ఉండటంతో ఏమైనా అప్డేట్ వస్తుందేమో అని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అలాంటి వారికి తాజాగా ఈ మూవీ నుంచి అదిరిపోయే అప్డేట్ బయటకొచ్చి ఫుల్ ఎనర్టీ అందించింది.

ఈ మూవీలోని ఫస్ట్ సింగిల్, టీజర్‌ను రిలీజ్ చేసేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. మార్చి 27న మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ బర్త్ సందర్భంగా ఈ మూవీలోని ఫస్ట్ సింగిల్/ టీజర్‌ను రిలీజ్ చేసేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నట్లు టాక్ వినిపిస్తోంది. అంతేకాకుండా అదేరోజు ‘గేమ్ ఛేంజర్’ రిలీజ్ డేట్‌ను కూడా వెల్లడించే ప్లాన్‌లో ఉన్నట్లు తెలుస్తోంది.

READ MORE: ‘గేమ్ ఛేంజర్’ రిలీజ్ డేట్ వచ్చేసింది.. మెగా ఫ్యాన్స్‌కి పండగే..!

ఈ అప్డేట్‌తో మెగా అభిమానులు ఫుల్ ఖుష్ అవుతున్నారు. మార్చి 27 కోసం కళ్లు కాయలు కాచేలా ఎదురుచూస్తున్నారు. ఇకపోతే ఈ మూవీలో ఓ సాంగ్ కోసం దర్శకుడు శంకర్ చాలా ఖర్చు చేయించినట్లు తెలుస్తోంది. కేవలం ఒక్క సాంగ్ కోసం దాదాపు రూ.15 కోట్లు ఖర్చు అయినట్లు ఆ మధ్య వార్తలు చక్కర్లు కొట్టాయి. మరి ఆ సాంగ్ ఇదేనేమో చూడాలి.

Tags

Related News

Dharsha Guptha: ఇంస్టాగ్రామ్ ద్వారా నెలకు లక్షల్లో ఆదాయం..ఈ ముద్దుగుమ్మ పనే బాగుందే!

Vithika sheru: మట్టి వినాయకుడిని చేసిన హీరోయిన్.. వామ్మో ఈ టాలెంట్ కూడా ఉందా?

Dethadi Alekhya Harika: మన క్యారెక్టర్ ని డిసైడ్ చేసేది అదే.. బుల్లి కథతో హారిక పోస్ట్!

Big TV kissik talks : స్టేజ్ పై అమ్మాయిలతో పండు అలా.. అడ్డంగా పరువుతీసేసిన వర్ష…

Big TV kissik talks : శేఖర్ మాస్టర్ అలాంటి వాడే.. షాకింగ్ విషయాలను బయట పెట్టిన పండు..!

The Big Folk Night 2025 : జానపదంతో దద్దరిల్లిన ఎల్బీ స్టేడియం.. ఘనంగా బిగ్ టీవీ ఫోక్ నైట్

Big Stories

×