BigTV English

Aadhaar-Voter ID: ఓటుకు ఆధార్ తప్పనిసరి కాదు.. కేంద్ర ఎన్నికల సంఘం క్లారిటీ

Aadhaar-Voter ID: ఓటుకు ఆధార్ తప్పనిసరి కాదు.. కేంద్ర ఎన్నికల సంఘం క్లారిటీ

 


Aadhaar Not Mandatory For Voting EC

Aadhaar Not Mandatory For Voting EC: ఓటర్ నమోదుకు ఆధార్ తప్పనిసరి కాదని కేంద్ర ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. ఆధార్ కార్డు లేకపోతే ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించకోకుండా ఆపబోమని తృణమూల్ కాంగ్రెస్ బృందానికి స్పష్టం చేసింది. ఓటరు గుర్తింపు కార్డు, లేదా ఏ ఇతర చెల్లుబాటు అయ్యే వ్యక్తిగత గుర్తింపు కార్డులతో ఓటు వేసేందుకు అనిమతిస్తామని హామీ ఇచ్చింది.


పశ్చిమ బెంగాల్ ప్రజలు వేల సంఖ్యలో ఆధార్ కార్డులను డియాక్టివేట్ చేస్తున్నారని తృణమూల్ ఎంపీలు ప్రధాన ఎన్నికల కమీషనర్ (సీఈసీ) రాజీవ్ కుమార్ కు ఫిర్యాదు చేసారు. ఈ నేపథ్యంలో తృణమూల్ నేతలు మాట్లాడుతూ ఆర్ధికంగా సున్నితమైన ప్రాంతాలపై నిఘా కోసం జిల్లాస్థాయి కమిటీలు ఏర్పాటు చేయాలని , దీనిపై ఈసీ నిర్ణయం తీసుకుందని, తమ రాష్ట్రంలో ఆధార్ కార్డుల డీయాక్టివేషన్ ఏర్పాటు కావడం ఇదే తొలిసారి అని తృణమూల్ నేతలు విలేకరులకు తెలిపారు.

Read more: పీఎం కిసాన్ సమ్మాన్ యోజన .. ఫిబ్రవరి 28న రైతుల ఖాతాల్లో రూ. 2 వేలు జమ..

2021 అసెంబ్లీ ఎన్నికల సమయంలో కేంద్ర బలగాలు ప్రజలను భయభ్రాంతులకు గురి చేసేలా వ్యవహరించాయని ఈ సారి అలాంటివి జరగకుండా చట్టానికి అనుగుణంగా పనిచేసేలా ఆదేశాలు ఇవ్వాలని పార్టీ తరుపున వారు సీఈసీని కోరినట్లు తెలిపారు. ఈ నేపథ్యంలో కేంద్ర ఎన్నికల సంఘం ఓటు హక్కు వినియోగంపై అవగాహన కల్పించి పోలింగ్ శాతాన్ని పెంచేలా ప్రయత్నం చేస్తుంది. బ్యాంకులు, పోస్టాఫీస్ శాఖలో అవగాహన కార్యక్రమాలు చేపట్టింది. భారతీయ బ్యాంకులు సంఘం, పోస్టాఫీస్ శాఖలతో సోమవారం ఒప్పందం కుదుర్చుకున్నట్లు తెలుస్తోంది.

Tags

Related News

EPFO Tagline Contest: ఈపీఎఫ్ఓ నుంచి రూ.21 వేల బహుమతి.. ఇలా చేస్తే చాలు?

Earthquake: వణికిన ఫిలిప్పీన్స్.. 7.6 తీవ్రతతో భారీ భూకంపం

UP Governor: యూపీ గవర్నర్ వార్నింగ్.. సహజీవనం వద్దు, తేడా వస్తే 50 ముక్కలవుతారు

Tata Group: టాటా గ్రూప్‌లో కుంపటి రాజేస్తున్న ఆధిపత్య పోరు.. రంగంలోకి కేంద్రం..

Donald Trump: ప్రెసిడెంట్ ట్రంప్‌నకు యూఎస్ చట్టసభ సభ్యులు లేఖ

Narendra Modi: ఓటమి తెలియని నాయకుడు.. కష్టపడి పని చేసి, ప్రపంచానికి చూపించిన లీడర్..

Ayodhya: అయోధ్యలో మరో కీలక ఘట్టం.. బృహస్పతి కుండ్ ప్రారంభోత్సవానికి సిద్ధం

India Vs America: భారత్‌ను దెబ్బకొట్టేందుకు పాక్‌తో అమెరికా సీక్రెట్ డీల్స్..

Big Stories

×