BigTV English

Lucky Baskhar: మళ్లీ వాయిదా పడిన లక్కీ భాస్కర్.. ఈసారి వచ్చేది ఎప్పుడంటే.. ?

Lucky Baskhar: మళ్లీ వాయిదా పడిన లక్కీ భాస్కర్.. ఈసారి వచ్చేది ఎప్పుడంటే.. ?

Lucky Baskhar:   మలయాళ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్.. మహానటి సినిమాతో  తెలుగువారికి పరిచమయ్యాడు. ఇక సీతారామం సినిమాతో తెలుగు వారిలో  ఒకడిగా కలిసిపోయాడు. ఆ సినిమా తరువాత నుంచి దుల్కర్ ప్రతి సినిమా తెలుగులో కూడా రిలీజ్ అవుతుంది. ఇక సీతారామం తరువాత దుల్కర్  నటిస్తున్న తెలుగు చిత్రం లక్కీ భాస్కర్. సార్ సినిమాతో హిట్ అందుకున్న వెంకీ అట్లూరి దర్శకత్వం వహించిన ఈ సినిమాను సితార ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్ పై సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్నాడు.  ఈ చిత్రంలో దుల్కర్ సరసన మీనాక్షీ చౌదరి నటించింది.


ఇప్పటికే  ఈ చిత్రం నుంచి రిలీజైన పోస్టర్స్ , టీజర్, సాంగ్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఇక ఈ సినిమా రిలీజ్  వాయిదాల మీద వాయిదాల పడుతూ వస్తుంది. లక్కీ భాస్కర్ అనౌన్స్ చేసినప్పుడు .. ఈ ఏడాది జూన్ లో రిలీజ్ చేస్తామని చెప్పారు. అది వాయిదా పడి.. ఆగస్టు అన్నారు. అది కూడా వాయిదా పడి సెప్టెంబర్ 7 న వస్తుంది అన్నారు. ఇక కొన్ని కారణాల వలన సెప్టెంబర్ 27 కు మార్చినట్లు తెలిపారు.  ఇలా వాయిదాల మీద వాయిదాలు పడుతూ వస్తున్నా ఈ సినిమా కనీసం సెప్టెంబర్  27 న అయినా వస్తుంది అనుకుంటే.. ఇప్పుడు అది కూడా వాయిదా  పడిందని అధికారికంగా చెప్పుకొచ్చారు.

లక్కీ భాస్కర్.. చివరకు దీవాళీ కానుకగా అక్టోబర్ 31 న రిలీజ్ కానున్నట్లు మేకర్స్ తెలిపారు. “ప్రియమైన అభిమానులు & సినీ ప్రేమికులారా, మా లక్కీ బాస్కర్ పట్ల మీ నిరీక్షణను మేము అభినందిస్తున్నాము.. అంతేకాక మీ ఆతృతను మేము అర్థం చేసుకున్నాము. మీ, మా అభిమాన దుల్కర్ సల్మాన్ .. భాస్కర్ లాంటి అద్భుతమైన పాత్రలో  ఒదిగిపోయాడు. మా ఏస్ టెక్నికల్ సిబ్బంది 80′ వ దశకాన్ని రీక్రియేట్ చేశారు.


అదేవిధంగా, మేము వివిధ భాషలలో డబ్బింగ్ నాణ్యతలో రాజీపడము, మేము ప్రతి భాషలో సాధ్యమయ్యే విధంగా సౌండ్ ను,  వాస్తవికంగా, స్థానికంగా అనిపించేలా చేయాలనుకుంటున్నాము. బహుభాషా చిత్రం మరియు గ్రాండ్ పాన్-ఇండియా విడుదల చేయాలనుకుంటున్నాం.  మేము కోరుకునే నాణ్యతను సాధించడానికి మాకు మరికొంత సమయం కావాలి. భారమైన హృదయంతో, మేము సినిమాను వాయిదా వేయాలని నిర్ణయించుకున్నాము. లక్కీ బాస్కర్ ఇప్పుడు దీపావళి, 31 అక్టోబర్ 2024న విడుదల అవుతుంది” అని చెప్పుకొచ్చారు. ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట వైరల్ గా మారింది. మరి ఈసారైనా లక్కీ భాస్కర్ కు లక్ ఉంటుందో లేదో చూడాలి.

Related News

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Ali Wife : కొత్త బిజినెస్ మొదలుపెట్టిన అలీ వైఫ్ జుబేదా…మీ సపోర్ట్ కావాలంటూ?

Big Stories

×