Ka Movie: రాజావారు రాణిగారు అంటూ తెలుగుతెరకు పరిచయమయ్యాడు కుర్ర హీరో కిరణ్ అబ్బవరం. మొదటి సినిమాతోనే మంచి విజయాన్ని అందుకున్న కిరణ్.. ఆ తరువాత తనకు నచ్చిన.. తనవద్దకు వచ్చిన అన్ని సినిమాలను చేసుకుంటూ పోయాడు. ఒక్కో ఏడాది మూడు నాలుగు సినిమాలు రిలీజ్ చేసిన సందర్భాలు ఉన్నాయి.
విజయాపజయాలను పట్టించుకోకుండా వరుస సినిమాలు చేస్తూనే రావడంతో ప్రేక్షకులు అతనిపై ట్రోల్స్ చేయడం కూడా మొదలుపెట్టారు. దీంతో.. కిరణ్ ఒక ఏడాది గ్యాప్ తీసుకొని మంచి కథతో రావాలని ప్రతిజ్ఞ చేశాడు. చెప్పినట్టుగానే.. ఏడాది తరువాత క సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి భారీ విజయాన్ని అందుకున్నాడు.
సుజిత్- సందీప్ దర్శకత్వం వహించిన క సినిమాలో నయన్ సారిక హీరోయిన్ గా నటించింది. పాన్ ఇండియా రేంజ్ లో క సినిమాను రిలీజ్ చేయాలనుకున్నారు కానీ, స్టార్ హీరోల సినిమాలతో పోటీ ఎందుకు అని కేవలం తెలుగులోనే రిలీజ్ చేశారు. క.. దీపావళీ కానుకగా రిలీజ్ అయ్యి భారీ విజయంతో పాటు రికార్డు కలక్షన్స్ ను రాబట్టింది.
ఇక ఈ సినిమా ఎప్పుడెప్పుడు ఓటీటీలోకి వస్తుందా.. ? అని ఎదురుచూస్తున్న వారికి గుడ్ న్యూస్. ఎట్టకేలకు క ఓటీటీ రిలీజ్ డేట్ ను మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. క సినిమా డిజిటల్ హక్కులను ఈటీవీ విన్ సొంతం చేసుకున్న విషయం తెల్సిందే.
Nagarjuna: మా నాన్న ఒకప్పుడు ఆత్మహత్య ప్రయత్నం చేసారు
సుమారు రూ.10కోట్లకు క చిత్రాన్ని ఈటీవి విన్ కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. ఇక ఇప్పటికే ఈ సినిమా రిలీజ్ అయ్యి నాలుగు వారాలు దాటింది. ఎట్టకేలకు నవంబర్ 28 నుంచి క మూవీ.. ఈటీవీ విన్ లో స్ట్రీమింగ్ కానుంది. మరి థియేటర్ లో బ్లాక్ బస్టర్ హిట్ ను అందుకున్న కిరణ్ అబ్బవరం.. ఓటీటీలో ఎలాంటి విజయాన్ని అందుకుంటాడో చూడాలి.