Bigg Boss 8 Telugu Elimination: బిగ్ బాస్ సీజన్ 8 ప్రారంభం అయినప్పటి నుండే ఇందులో కన్నడ బ్యాచ్ డామినేషన్ ఎక్కువగా ఉందని ప్రేక్షకులు ఫీల్ అవుతూ ఉన్నారు. కానీ ఆ కన్నడ బ్యాచే స్ట్రాంగ్‌గా ఆడుతూ టాప్ 10 వరకు చేరుకున్నారు. కానీ టాప్ 10కు చేరుకున్న తర్వాత వారి ఓవరాక్షన్ మరింత పెరిగిపోయిందని, అందుకే వారికి బుద్ధి చెప్పాలని ప్రేక్షకులు ఫీలయ్యారు. అందుకే ఈసారి నామినేషన్స్‌లో కేవలం కన్నడ బ్యాచ్ మాత్రమే ఉంది. అలా ఎలిమినేషన్ సమయం వచ్చేసరికి కన్నడ బ్యాచ్‌కు చెందిన పృథ్వి, యష్మీ ఉండగా.. అందులో నుండి యష్మీ ఎలిమినేట్ అయినట్టు సమాచారం.
ఇన్నిరోజులు తప్పించుకుంది
ఫైనల్‌గా యష్మీ ఇప్పటికైనా ఎలిమినేట్ అయ్యిందని చాలామంది ప్రేక్షకులు హ్యాపీగా ఫీలవుతున్నారు. అలాగే పృథ్వి కూడా ఎలిమినేట్ అయ్యి ఇది డబుల్ ఎలిమినేషన్ అయ్యింటే బాగుండేదని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. యష్మీ అంటే ముందు నుండే చాలామంది ప్రేక్షకులకు ఇష్టం లేదు. అనవసరంగా అరవడం, వేరే వాళ్లపై ఆరోపణలు చేయడం, నిందించడం లాంటివి చేస్తుంటే తనను బయటికి పంపడమే కరెక్ట్ అనుకున్నారు. కానీ ప్రతీవారం యష్మీ కంటే వరస్ట్ గేమ్ ఆడుతున్న వారిని సెలక్ట్ చేసి బయటికి పంపిస్తున్నారు ప్రేక్షకులు. ఇక బిగ్ బాస్ 8లో టాప్ 10 కంటెస్టెంట్స్ మాత్రమే మిగలడంతో ఇప్పటినుండి కేవలం బెస్ట్ పర్ఫార్మర్స్ మాత్రమే చివరి వరకు ఉండగలరు. అందుకే ఇప్పటికైనా యష్మీ ఎలిమినేట్ అవ్వడం కరెక్ట్ అని ఆడియన్స్ భావించినట్టు తెలుస్తోంది.
Also Read: ఆర్జీవిని బ్లాక్ చేసిన హాట్ బ్యూటీ.. ఆ ఒక్కటి అడగొద్దు..?
మొసలి కన్నీళ్లు
మొదట్లో అనవసరమైన వాగ్వాదాలకు దిగి ప్రేక్షకుల మధ్య నెగిటివ్ అయ్యింది యష్మీ. ఆ తర్వాత మెల్లగా గ్రూపిజం మొదలుపెట్టింది. ప్రేరణ తన బెస్ట్ ఫ్రెండ్ అంటూ నాటకాలు మొదలుపెట్టింది. కానీ తన ప్రవర్తన చాలావరకు అలా ఉండేది కాదు. ఏదైనా టాస్క్ వచ్చినప్పుడు మాత్రం ప్రేరణ తన ఫ్రెండ్ అని మర్చిపోయి ఆడేది. తనను ఎవరైనా నిలదీసినప్పుడు మాత్రం మొసలి కన్నీళ్లతో అందరినీ సైలెంట్ చేసేది. ఈ విషయాన్ని ప్రేక్షకులు కూడా బాగా గమనించారు. అందుకే యష్మీ తప్పు చేసి దొరికిపోయిన ప్రతీసారి దొంగ ఏడుపులు ఏడుస్తుందని ఓపెన్‌గానే కామెంట్స్ చేశారు. ఆ కామెంట్స్ నేరుగా యష్మీకి కూడా వినిపించారు నాగార్జున. తాను అలా చేయడం లేదని తప్పును ఒప్పుకోకుండా మళ్లీ అదే ప్రవర్తనను కంటిన్యూ చేస్తూ వచ్చింది యష్మీ.
నిఖిల్‌పై ఫోకస్
యష్మీ ఎలిమినేషన్‌కు మరొక ముఖ్య కారణం నిఖిల్‌తో క్లోజ్ అవ్వడమే అన్నది అందరికీ తెలిసిన ఓపెన్ సీక్రెట్. నిఖిల్.. ఇతర కంటెస్టెంట్స్‌తో, ముఖ్యంగా అమ్మాయిలతో క్లోజ్‌గా ఉంటూ కూడా తన ఆట తాను ఆడుతున్నాడు. టాస్కులు వచ్చినప్పుడు అందరినీ వెనక్కి నెట్టి మరీ తన సత్తా ఏంటో చాటుకుంటాడు నిఖిల్. కానీ యష్మీ అలా కాదు.. గత కొన్నిరోజులుగా నిఖిల్‌పైనే ఫోకస్ పెట్టి ఆటను పక్కన పెట్టేసింది. ఎంతమంది చెప్పినా తన వైఖరి మారకపోవడంతో ఫైనల్‌గా ఎలిమినేట్ అయిపోయింది.