Keerthy Suresh: సౌత్ ఫిలిం ఇండస్ట్రీలో ఉన్న టాలెంటెడ్ హీరోయిన్స్ లో కీర్తి సురేష్ ఒకరు. కిషోర్ తిరుమల దర్శకత్వం వహించిన నేను శైలజ సినిమాతో తెలుగు ఫిలిమ్ ఇండస్ట్రీకి హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది కీర్తి. బాక్స్ ఆఫీస్ వద్ద ఈ సినిమా అద్భుతమైన సక్సెస్ సాధించింది. ఈ సినిమా తర్వాత త్రివిక్రమ్ దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ లాంటి హీరో పక్కన కూడా మంచి అవకాశం అందుకుంది. త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ నటించిన అజ్ఞాతవాసి సినిమా బాక్సాఫీస్ వద్ద ఊహించిన సక్సెస్ సాధించలేకపోయింది. అందుకే ఈ సినిమాలో నటించిన కీర్తికి కూడా అంత పెద్దగా పేరు రాలేదు. నాగ్ అశ్విన్ దర్శకత్వం వహించిన మహానటి సినిమా ఏ రేంజ్ హిట్ అయింది అని అందరికీ తెలిసిన విషయమే. ఈ సినిమాలో మహానటి సావిత్రి పాత్రలో 100% ఒదిగిపోయింది కీర్తి సురేష్. కీర్తి తప్ప ఈ పాత్రలో ఇంకెవరిని ఊహించలేము అనే రేంజ్ లో పేరు సంపాదించింది. వాస్తవానికి కీర్తి కంటే ముందు ఈ పాత్ర కోసం చాలామందిని సంప్రదించాడు దర్శకుడు నాగ్ అశ్విన్. అయితే ఈ సినిమాలో కొన్ని కీలక మద్యపానం సేవించే సీన్స్ ఉండడంతో దీనిని రిజెక్ట్ చేసిన హీరోయిన్ కూడా ఉన్నారు. ఎట్టకేలకు కీర్తి సురేష్ నటించిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి సక్సెస్ సాధించింది.
ఈ సినిమా తర్వాత కీర్తిచేసిన దసరా వంటి సినిమాతో కూడా మంచి పేరును సంపాదించుకుంది. పరుశురాం దర్శకత్వంలో మహేష్ బాబు నటించిన సర్కారు వారి పాట సినిమా కూడా మంచి పేరును తీసుకొచ్చింది. కీర్తి కేవలం తెలుగు సినిమాలలో మాత్రమే కాకుండా తమిళ్ ఫిలిమ్ ఇండస్ట్రీలో కూడా తనను తాను ప్రూవ్ చేసుకుంది. అయితే బాలీవుడ్ లో కీర్తి ప్రూవ్ చేసుకోవలసిన అవసరం ఉంది. ప్రస్తుతం ఫస్ట్ బాలీవుడ్ సాంగ్ తో ప్రేక్షకులు ముందుకు రాబోతుంది కీర్తి. వరుణ్ ధావన్ నటిస్తున్న బేబీ జాన్ అనే సినిమాలో నటిస్తుంది కీర్తి సురేష్. ఈ సినిమా నుంచి నైన మటక అనే సాంగ్ ప్రోమో విడుదలైంది. ఈ ప్రోమోలో కీర్తి సురేష్ చాలా హాట్ గా కనిపిస్తుంది. అయితే కీర్తి ఇలా మోస్ట్ ఎనర్జిటిక్ గా కనిపించడం మొదటిసారి అని చెప్పాలి. ఈ సినిమాకి ఎస్ఎస్ తమన్ సంగీతం అందిస్తున్నారు. ఫస్ట్ సాంగ్ ప్రోమో తోని బాలీవుడ్ ప్రేక్షకులను అట్రాక్ట్ చేసింది అని చెప్పొచ్చు.
Also Read : Nagarjuna: మా నాన్న ఒకప్పుడు ఆత్మహత్య ప్రయత్నం చేసారు
కేవలం హీరోయిన్ గా మాత్రమే కాకుండా లేడీ ఓరియంటెడ్ ఫిలిమ్స్ కూడా చేసింది కీర్తి. అయితే ఆ సినిమాలేవి కూడా పెద్దగా సక్సెస్ కాలేదు. ఇక ప్రస్తుతం కీర్తి కి వరుసగా అవకాశాలు వస్తూనే ఉన్నాయి. కేవలం తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో మాత్రమే కాకుండా సౌత్ సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ఒక ప్రత్యేకమైన ఫ్యాన్ బేస్ ఉంది. చాలామంది ఆడియన్స్ కూడా కేవలం కీర్తి కోసమే సినిమాకు వెళ్తారు అని కూడా చెప్పాలి. ప్రస్తుతం తెలుగులో ప్రాజెక్ట్స్ ఏమీ లేవు. కానీ తమిళ్ లో ఒక రెండు సినిమాలతో పాటు బాలీవుడ్ లో బేబీ జాన్ సినిమాతో ప్రేక్షకులను అలరించునుంది కీర్తి.