Ravi Teja: టాలీవుడ్ స్టార్ హీరో రవితేజకు (Ravi teja)ఊహించని షాక్ తగిలింది. హైదరాబాద్లోని ఆర్టీసీ క్రాస్ రోడ్ లో ఉన్న మాంగల్య షాపింగ్ మాల్ (Mangalya Shopping Mall)సీజ్ కావడంతో హీరోకి గట్టి షాక్ తగిలిందని చెప్పాలి. ప్రస్తుతం ఆర్టిసి క్రాస్ రోడ్లో నిర్మాణంలో ఉన్న ఒక భవనంలో మాంగల్య షాపింగ్ మాల్ ను ఏర్పాటు చేశారు. ఆక్యుపెన్సి సర్టిఫికెట్ లేకుండా ఇంకా నిర్మాణం పూర్తి కాకుండా ఉన్న భవనంలో మాంగల్య షాప్ నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలోనే జిహెచ్ఎంసి అధికారులు ఈ భవనాన్ని పరిశీలించి వెంటనే మాంగళ్య షాపింగ్ మాల్ లో సీజ్ చేశారని తెలుస్తోంది. ఇక ఈ బిల్డింగ్ 3 సెల్లార్స్ , గ్రౌండ్ ఫ్లోర్ కాకుండా 5 ఫ్లోర్స్ లలో నిర్మిస్తున్న కమర్శియల్ మరియు మల్టిప్లెక్స్ భవనంగా నిర్మితమవుతుంది.ఇక ఇదే భవనంలో 4, 5 అంతస్తులలోART 7స్క్రీన్ సినిమా హాల్ కూడా ఏర్పాటు చేయబోతున్నట్టు సమాచారం.
ఇలా ఈ భవనంలో నాలుగు ఐదు అంతస్తులలో ఈ ఏషియన్ రవితేజ (ART) సినిమాస్ తో స్క్రీన్ ఏర్పాటు చేయబోతున్నట్లు కూడా తెలుస్తుంది. ఇలా ఈ మాల్ సీజ్ చేయటంతో రవితేజకు కూడా ఊహించని షాక్ తగిలిందని చెప్పాలి. ఇకపోతే ఇటీవల కాలంలో హీరోలందరూ కూడా ఒకవైపు సినిమాలు చేస్తూనే మరోవైపు బిజినెస్ రంగంలోకి అడుగుపెడుతున్న సంగతి తెలిసిందే. ఇలా ఎంతోమంది థియేటర్స్ బిజినెస్ లోకి కూడా అడుగుపెట్టారు.
ART సినిమాస్..
ఇలా ఇప్పటికే ఏషియన్ సినిమాస్ వారు కొంతమంది హీరోలతో కొలాబరేట్ అవుతూ పలు ప్రాంతాలలో ఇలా మల్టీప్లెక్స్లను ఏర్పాటు చేస్తున్నారు. ఇప్పటికే మహేష్ బాబు అల్లు అర్జున్ తో ఏసియన్ వారు భాగస్వామ్యం అయ్యారు. ఈ క్రమంలోనే రవితేజతో కలిసి కూడా భాగస్వామ్యం కావడంతో హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్ లో ఉన్నటువంటి ఈ భవనంలో ఏఆర్టీ పేరుతో మల్టీప్లెక్స్ థియేటర్ ను ఏర్పాటు చేయబోతున్నట్లు తెలుస్తుంది. అయితే ఇంకా ఈ నిర్మాణ భవనం పూర్తి కాకుండా ఇప్పటికే షాపింగ్ మాల్స్ కూడా నిర్వహిస్తున్న నేపథ్యంలో జిహెచ్ఎంసి అధికారులు ఈ బిల్డింగ్ పై చర్యలు తీసుకొని సీజ్ చేసినట్టు తెలుస్తుంది.
పూర్తికాని నిర్మాణం..
ఇలా ఈ బిల్డింగ్ నిర్మాణం పూర్తి కాకుండానే ఈ బిల్డింగ్లో షాపింగ్ మాల్స్ నిర్వహిస్తున్నారు. అయితే ఇదంతా కూడా ఒక బడా బిల్డర్ నిర్వహణతోనే జరుగుతోందని తెలుస్తోంది. ఇక ఈ విషయంపై వరకు రవితేజ ఎక్కడ కానీ, ఏషియన్ సినిమాస్ వారు కానీ స్పందించలేదు. ఇక రవితేజ విషయానికి వస్తే ప్రస్తుతం ఈయన వరుస సినిమాలలో నోటిఫికేషన్ కెరియర్ పరంగా బిజీగా ఉన్నారు. ప్రస్తుతం మాస్ జాతర అనే సినిమా షూటింగ్ పనులలో బిజీగా గడుపుతున్నారు .త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ సినిమాతో పాటు రవితేజ ఇటీవల మరో కొత్త సినిమాకు కూడా కమిట్ అయిన విషయం తెలిసిందే. ఇటీవల కాలంలో రవితేజ సినిమాలు పెద్దగా ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయినా వరుస సినిమా అవకాశాలను అందుకుంటూ బిజీగా ఉన్నారు.