Budh Gochar 2025: జ్యోతిష్య శాస్త్రంలో.. బుధుడిని గ్రహాలకు రాకుమారుడు అని పిలుస్తారు. వ్యాపారం, కమ్యూనికేషన్, గణితం , తెలివితేటలకు అధిపతి. బుధుడు ఒక రాశిలో దాదాపు 21 రోజులు ఉంటాడు. ఆ తర్వాత మాత్రమే రాశిని మారుస్తాడు. అయితే.. బుధుడు ఎప్పుడు సంచరించినా.. కొన్ని రాశులకు వ్యాపారంలో లాభం, డబ్బు పరమైన ప్రయోజనాలు లభిస్తాయి. జ్యోతిష్కుల ప్రకారం, బుధుడు ప్రస్తుతం మిథునరాశిలో ఉన్నాడు. జూన్ 22, 2025న రాత్రి 9:17 గంటలకు కర్కాటక రాశిలోకి ప్రవేశిస్తాడు. బుధుడు రాశిలో మార్పు కారణంగా.. ఈ 3 రాశుల వ్యక్తులు కెరీర్ , విద్యపరంగా మంచి ఫలితాలను పొందుతారు. దీంతో పాటు.. ప్రతి రంగంలో శుభవార్తలు వినే అవకాశాలు ఉన్నాయి. మరి ఆ అదృష్ట రాశులేవో ఇప్పుడు తెలుసుకుందాం.
కర్కాటక రాశి:
బుధుడు రాశి మార్పు కర్కాటక రాశి వారికి ప్రయోజనకరంగా ఉంటుంది. మీకు కొత్త ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. ప్రభుత్వ లేదా అధికారిక పనుల గురించి ఆందోళన చెందుతున్న వారి సమస్యలు తొలగిపోతాయి. సంబంధాలలో సానుకూలత పెరుగుతుంది. అంతే కాకుండా మీరు కొత్త వ్యాపారంలో కొంత నష్టాన్ని చవిచూసి ఉంటే.. ఇప్పుడు సమస్యలు తొలగిపోతాయి. ఈ సమయంలో ఆర్థిక పని ఊపందుకుంటుంది. ఈ సమయం వ్యాపారం లేదా వాణిజ్యంతో సంబంధం ఉన్న వ్యక్తులకు కూడా ప్రయోజనకరంగా ఉంటుంది. మీరు మీ వ్యాపారాన్ని విదేశాలకు తీసుకెళ్లవచ్చు. బుధుడి ప్రభావంతో.. జీవితంలో అందం, శ్రేయస్సు, ఆనందం పెరుగుతాయి
ప్రకటన
కన్య రాశి:
మీ ఇంటి వాతావరణం ఆనందంగా మారుతుంది. మీ మాటల మాధుర్యంతో మీరు సంబంధాలను బలోపేతం చేసుకోవడంలో విజయం సాధిస్తారు. మీ కమ్యూనికేషన్ నైపుణ్యాలు ప్రజలలో మంచి ఇమేజ్‌ను సృష్టిస్తాయి. ఆరోగ్యం మెరుగుపడే అవకాశం ఉంది. ఈ సమయంలో.. ఉద్యోగంలో ఉన్నవారికి కూడా కొన్ని కొత్త బాధ్యతలు వస్తాయి. మీరు మతపరమైన, ఆధ్యాత్మిక పనుల వైపు ఆకర్షితులవుతారు. ఈ సమయంలో.. పెండింగ్‌లో ఉన్న పాత పనులు పూర్తవుతాయి. వ్యాపారంలో లాభాలు ఆర్జించిన తర్వాత మీరు ఆర్థిక స్థాయిలో బలంగా ఉంటారు. మీ అత్తమామల వైపు నుండి మీకు ఆర్థిక ప్రయోజనాలు లభించే అవకాశం ఉంది.
Also Read: ఈ ఆయుర్వేద పదార్థాలు వాడితే.. 50 ఏళ్లయినా జుట్టు అస్సలు రాలదు
తులారాశి:
బుధుడు కర్కాటకంలోకి ప్రవేశించడం మీకు ప్రత్యేకంగా ఉంటుంది. ఈ సంచారం మీకు ప్రమోషన్ అవకాశాలను సృష్టిస్తోంది. ఈ సమయం విద్యార్థులకు చాలా అనుకూలంగా ఉంటుంది. మీరు విద్యా పరంగా కూడా మంచి ఫలితాలను పొందుతారు. ఆన్‌లైన్ లేదా మార్కెటింగ్ రంగంలో పనిచేసే వ్యక్తుల జీతం పెరుగుతుంది. ఈ సమయం మీ ఖ్యాతిని, ప్రభావాన్ని కూడా పెంచుతుంది. కొత్త ఇంట్లోకి ప్రవేశించే అవకాశాలు కూడా ఉండవచ్చు. మీకు వాహనపరమైన ఆనందం లభిస్తుంది. సంబంధాలు బలపడతాయి. అంతే కాకుండా పరస్పర విశ్వాసం మరింతగా పెరుగుతుంది. మీరు మీ జీవిత భాగస్వామి నుండి ఆశ్చర్యకరమైన బహుమతిని పొందే అవకాశాలు కూడా ఉంటాయి. అంతే కాకుండా సమస్యలు తొలగిపోతాయి.