Pawan Kalyan: టాలీవుడ్ హీరో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఎన్నికల ముందు వరుసగా సినిమాలను అనౌన్స్ చేశాడు. అయితే అందులో ఏ ఒక్క సినిమాను పూర్తి చేయలేదు. గ తేడాది జరిగిన ఎన్నికల్లో పోటీ చేసి ఘన విజయాన్ని సొంతం చేసుకున్నాడు. దాంతో అయినా ఏపీ రాష్ట్రానికి డిప్యూటీ సీఎం అయ్యాడు. ప్రస్తుతం రాజకీయాల్లో ఫుల్ బిజీగా ఉన్న పవన్ కళ్యాణ్ సినిమాలకు దూరమయ్యాడు. తాను సైన్ చేసిన సినిమాలను పూర్తి చేస్తాడని నిర్మాతలకు మాట ఇచ్చాడు. అయితే ఇప్పటివరకు ఏ సినిమాకు డేట్స్ ఇవ్వలేదు. పవన్ కళ్యాణ్ నటించిన సినిమాలలో ముందుగా హరిహర వీరమల్లు సినిమా రిలీజ్ అవుతుందని అందరూ అనుకున్నారు. కానీ ప్రస్తుతం ఇండస్ట్రీలో మరో వార్త చక్కర్లు కొడుతుంది. హరిహర వీరమల్లు నుంచి వరుస అప్డేట్లు వస్తున్న కూడా ఎక్కువమంది ఓజే సినిమా కోసమే వెయిట్ చేస్తున్నారంటూ ఓ వార్త ప్రచారంలో ఉంది..
పవన్ కళ్యాణ్ సినిమాలు..
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఒకవైపు రాజకీయాల్లో బిజీగా ఉన్నా కూడా మరోవైపు మాత్రం వరుసగా సినిమాలను అనౌన్స్ చేశారు. హరిహర వీరమల్లు, ఓజీ, ఉస్తాద్ భగత్ సింగ్.. ఈ మూడు సినిమాల కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ సినిమాలకు టైమ్ ని కేటాయించే పరిస్థితిలో లేరు. కానీ షూటింగ్లకు డేట్స్ ఇస్తానని అన్నారు. దాదాపు షూటింగ్ ని పూర్తి చేసుకున్న వీరమల్లు సినిమా నుంచి ఇటీవల వరుసగా అప్డేట్లు వదులుతున్నారు మేకర్స్. అయితే అందరి దృష్టి మాత్రం ఓజీ పైనే ఉందని తెలుస్తుంది. ఈ మూవీ షూటింగు చాలా పెండింగ్ ఏ ఉంది. కానీ ఈ మూవీ కూడా ఈ ఏడాదిలోనే రిలీజ్ అయిపోతుంది అంటూ ఓ వార్త ఫిలింనగర్ లో చక్కర్లు కొడుతుంది. అసలు అందులో నిజం ఎంత ఉందో ఒకసారి చూసేద్దాం..
2025 పవన్ ఫ్యాన్స్ డబుల్ ట్రీట్..
పవన్ కళ్యాణ్ నటించిన సినిమాలలో సుజిత్ కాంబినేషన్లో వస్తున్న సినిమా ఓజీ.. ఈయన డిప్యూటీ సీఎం అయిన తర్వాత ఓజీ గోల పక్కన పెట్టండి అని చాలా సందర్భాల్లో చెప్పారు. ఈ సినిమాను ముందుగా పూర్తి చేస్తే ఒక పని అయిపోతుంది అనే ఉద్దేశంతో పవన్ కళ్యాణ్ ఉన్నట్లు సన్నిహిత వర్గాల్లో టాక్.. ఏప్రిల్, మే నెలలో వీలుని బట్టి తగినన్ని డేట్లు ఇచ్చి త్వరగా పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరిగేలా చూడాలని నిర్మాతకు సమాచారమిచ్చారట.. ఈ మూవీని ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా పూర్తిచేసి సెప్టెంబర్ నెల కల్లా థియేటర్లలోకి తీసుకురావాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారట. అటు ఓటిటి ప్లాట్ఫారం కూడా కన్ఫర్మ్ అవ్వడంతో ఈ వార్త నిజమై ఉంటుందని అభిమానులు ఫుల్ ఖుషి అవుతున్నారు. మొత్తానికైతే 2025 ఏడాది పవన్ అభిమానులకు మర్చిపోలేనిదిగా ఉంటుందని తెలుస్తుంది.. ఏది ఏమైనా కూడా అటు పవన్ కళ్యాణ్ కూడా కమిట్ అయిన సినిమాలను త్వరగా పూర్తి చేయాలని ఉద్దేశం లో ఉన్నట్లు తెలుస్తుంది మొత్తానికైతే పవన్ కళ్యాణ్ ని మళ్ళీ ఇన్నాళ్లకు స్క్రీన్ పై చూడటం కోసం వెయ్యి కళ్లతో ఎదురుచూస్తున్నారు..