పవర్ స్టార్ పవన్ కళ్యాణ్(Pawan Kalyan) ‘అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి’ సినిమాతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చారు. ఆ తర్వాత తనదైన నటనతో భారీ పాపులారిటీ సొంతం చేసుకున్నారు. ఇకపోతే సినిమాల కంటే ప్రజా శ్రేయస్సే ముఖ్యమని భావించారు పవన్ కళ్యాణ్. అందుకే దాదాపు కొన్ని సంవత్సరాలు పాటు రాజకీయాలలో కష్టపడి, ఎన్నో విమర్శలు ఎదుర్కొని, ఒడిదుడుకులు తట్టుకొని. నేడు ఆంధ్రప్రదేశ్ కి డిప్యూటీ సీఎం గా పదవీ బాధ్యతలు చేపట్టారు. ఇకపోతే సడన్గా పవన్ కళ్యాణ్ రాజకీయాల్లోకి రావడంతో ఆయన అభిమానులు నిరాశ వ్యక్తం చేస్తున్నారు.. తమ అభిమాన హీరో నుంచి ఒక్క సినిమా అయినా వస్తుందా అంటూ ఆలోచించే వారి ఎక్కువైంది. ఈ నేపథ్యంలోనే అభిమానులను సంతోష పెట్టడానికి తాను పెండింగ్లో ఉంచిన సినిమాలను పూర్తి చేసే పనిలో పడ్డారు పవన్ కళ్యాణ్.
ఓజీలో జపాన్, కొరియర్ నటీనటులు..
ప్రస్తుతం ‘హరిహర వీరమల్లు’ సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్న ఈయన.. మరోవైపు ఒరిజినల్ గ్యాంగ్ స్టర్ సినిమాని కూడా ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు. ఈ రెండు చిత్రాలతో పాటు ‘ఉస్తాద్ భగత్ సింగ్’ సినిమాని కూడా ఈయన కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. ఇదిలా ఉండగా ‘ఒరిజినల్ గ్యాంగ్ స్టర్ ‘(OG) సినిమాపై ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ ఎస్.ఎస్. తమన్ చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. తమన్ మాట్లాడుతూ.. “పవన్ కళ్యాణ్ ఓజీ సినిమాలో కొరియన్, జపాన్ నటీనటులు ఉండబోతున్నారు. ముఖ్యంగా ఈ సినిమా దర్శకుడు సుజీత్ (Sujeeth)ఆయన టీం అందుకోసం ఇప్పటికే కొంతమంది నటీనటులతో చర్చలు జరుపుతున్నారు. ఈ సినిమా లోకల్ మూవీ కాదు.. ఇంటర్నేషనల్ మూవీ” అంటూ ఒక ఇంటర్వ్యూలో తెలిపారు. ప్రస్తుతం తమన్ చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.
ఓజీ సినిమా కోసం పవన్ కళ్యాణ్ వారసుడు..
అంతేకాదు ఈ సినిమాకు సంబంధించి మరో విషయాన్ని బయట పెట్టారు తమన్. తమన్ మాట్లాడుతూ..”పవన్ కళ్యాణ్ వారసుడు అకీరా నందన్ పియానో అద్భుతంగా ప్లే చేస్తారు. ఇది అందరికీ తెలిసిన విషయమే. ఓజీ కోసం అకీరాను పిలవబోతున్నాను. అకీర చేతి వేళ్ళు కూడా చాలా పెద్దగా ఉంటాయి. పర్ఫెక్ట్ గా పియానో ప్లే చేస్తాడు. అంతేకాదు రెండు నెలలు నాతో కూడా పనిచేశాడు. కాబట్టి ఈ సినిమాలో అకీరా నందన్ కి అవకాశం ఇద్దాం అనుకుంటున్నాను” అంటూ క్లారిటీ ఇచ్చారు. మొత్తానికైతే తమన్ ఇచ్చిన ఈ రెండు అప్డేట్స్ అభిమానులలో సంతోషాన్ని నింపుతున్నాయి. తండ్రి సినిమా కోసం అకీరా నందన్ పనిచేయబోతున్నారు అని తెలిసి అభిమానుల ఆనందానికి అవధులు లేవు. మరోవైపు జపాన్, కొరియర్ నటీనటులు ఇందులో నటించబోతున్నారు అనడంతో ఇక ఈ సినిమా ఏ రేంజ్ లో ఉంటుందో అంటూ అప్పుడే ఊహగానాలు వ్యక్తం చేస్తున్నారు. ఇకపోతే ఈ చిత్రానికి సంగీత దర్శకుడిగా పని చేస్తున్న తమన్ ఇలా వరుస అప్డేట్స్ వదులుతూ సినిమాపై మరింత హైప్ పెంచుతున్నారు.